Monday, November 12
Log In

పంచాయతీ కార్యదర్శి ఫలితాలకు బ్రేక్

జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు జరిగిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలను వెల్లడించవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 30 వరకూ వీటిని రిలీజ్ చేయొద్దని పంచాయతీ రాజ్ శాఖను ఆదేశించింది. గ్రామపంచాయతీల్లో చాలాకాలంగా పనిచేస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లను పంచాయతీ కార్యదర్శులుగా రెగ్యులర్ చేయాలని కోరుతూ తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన కోర్టు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ ప్రక్రియలో గరిష్ట వయో పరిమితిపై దాఖలైన కేసుల్లో ... ఫలితాలను నిలిచి ఉంచాలన్న ఆదేశాలు ఈ కేసుకు కూడా వర్తించేలా ఆదేశాలిచ్చారు. విచారణ సోమవారానికి వాయిదా పడింది.