Tuesday, November 13
Log In

JEE ( MAIN) 2019 నోటిఫికేషన్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE-MAIN) జనవరి 2019 కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏడాదికి రెండు సార్లు నిర్వహించే ఈ ఎగ్జామ్ కోసం అభ్యర్థులు 1సెప్టెంబర్ 2019 నుంచి 30 సెప్టెంబర్ 2019 వరకూ అప్లయ్ చేసుకోవచ్చు

ఎంట్రన్స్ పరీక్షలు 6 జనవరి 2019 నుంచి 20 జనవరి 2019 వరకూ జరుగుతాయి.

Paper-1 ( B.E/B.Tech., కోసం) - మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ - కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్

సమయం: మొదటి షిప్ట్: ఉదయం 9.30 గం. నుంచి మధ్యాహ్నం 12.30 గం. వరకూ

రెండో షిప్ట్ : మధ్యాహ్నం 2.30 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకూ

Paper-2 (B.Arch/B.Planning) - మేథమెటిక్స్ పార్ట్ -1, ఆప్టిట్యూట్ టెస్ట్ పార్ట్ - 2 - కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్

డ్రాయింగ్ టెస్ట్ - పార్ట్ -3 - పెన్ అండ్ పేపర్ బేస్డ్ టెస్ట్ (ఆఫ్ లైన్ ) విధానం డ్రాయింగ్ షీట్ పై రాయాలి

2019 సం.నికి IIT లో అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ లో అడ్మిషన్స్ పొందగోరే అభ్యర్థులు JEE (MAIN) 2019 లోని పేపర్ - 1 (BE./B.Tech)కి హాజరు కావాలి. JEE(M) 2019 లో పేపర్ -1 (B.E./B.Tech) లో వారి పెర్ ఫార్మెన్స్ ఆధారంగా JEE( ADVANCE) కి అర్హులవుతారు. JEE(A) లో ర్యాంకుల ఆధారంగానే IIT లో ప్రవేశాలు కల్పిస్తారు.

అభ్యర్థులు JEE(M) జనవరి, 2019 మరియు JEE(M) ఏప్రిల్ 2019 ...లో నిర్వహించే రెండు పరీక్షలకు తప్పనిసరిగా హాజరు కానవసరం లేదు. ఒకవేళ అభ్యర్థి రెండు ఎగ్జామ్స్ రాస్తే ఎందుకు ఉత్తమ మార్కులు ఉంటే దానిని JEE(ADVANCED) 2019 కోసం పరిగణనలోకి తీసుకుంటారు.

పూర్తి వివరాలకు

http://www.nta.ac.in మరియు http://www.jeemain.nic.inలో చూడగలరు.
అభ్యర్థులు 1సెప్టెంబర్ 2019 నుంచి 30 సెప్టెంబర్ 2019 వరకూ అప్లయ్ చేసుకోవచ్చు. పరీక్ష రుసుమును 1అక్టోబర్ 2018 వరకూ ఆన్ లైన్ లో చెల్లించవచ్చు.

Notification వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి :

https://jeemain.nic.in/WebInfo/Handler/FileHandler.ashx?i=File&ii=6&iii=Y