Thursday, December 13

మే19న JEE అడ్వాన్సుడ్ పరీక్ష

ఐఐటీల్లో ప్రవేశానికి జరిగే JEE అడ్వాన్సుడ్ 2019 పరీక్ష 2019 మే 19 (ఆదివారం) జరుగుతుంది. ఈసారి ఈ ఎగ్జామ్ ను IIT, రూర్కీ నిర్వహించబోతోంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (ఆన్ లైన్ ) ను అమలు చేయబోతున్నారు.

ఎగ్జామ్ టైమ్:

2019 మే 19 (ఆదివారం)

ఉదయం 9-12 గంటల వరకూ పేపర్ - 1

మధ్యాహ్నం 2-5 గంటల వరకూ పేపర్ - 2

JEE మెయిన్ నుంచి కటాఫ్ మార్కులు, సామాజిక వర్గాల రిజర్వేషన్ ప్రకారం 2.20 లక్షల మందికి మాత్రమే అడ్వాన్సుడ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా 2019-20 విద్యా సంవత్సరానికి దేశంలోని 23 IITల్లో బీటెక్ లోకి ప్రవేశం కల్పిస్తారు.