Wednesday, October 23

జులై 1 నుంచి గ్రూప్ 2 ఇంటర్వ్యూలు

గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు షెడ్యూల్ ప్రకటించింది tspsc. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. దాంతో మొత్తం 2064 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే TSPSC వెబ్ సైట్ లో ఉంచారు. ఇంటర్వ్యూకి అభ్యర్థులను జంబ్లింగ్ పద్దతిలో , విడతలవారీగా ఎంపిక చేస్తారు. ప్రతి రోజు 48 మంది అభ్యర్థుల చొప్పున వారంలోని ఆరు రోజులకు 288 మందిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ హాజరయ్యే వారి వివరాలను వారం ముందే వెబ్ సైట్ లో పొందు పరుస్తారు. గ్రూప్ 2 కింద మొత్తం 1032 పోస్టులను TSPSC భర్తీ చేస్తోంది. 2016 లో రాత పరీక్షలు జరిగాయి. దాదాపు 3 యేళ్ళకు ఈ నియామకాలు పూర్తవుతున్నాయి.

 

ఇంటర్వ్యూకి ఎంపికైన వారి జాబితా నెంబర్ల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి

Group-II Services -Result Notification for Interview