Sunday, August 19
Log In

ఇంటర్ లో ఎక్కువ మార్కులనే లెక్కలోకి..

ఇంటర్మీడియట్ ఇంప్రూవ్ మెంట్ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తే వాటినే లెక్కలోకి తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టత ఇచ్చింది.  ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు రాసినప్పటికీ... మార్చి 2018 పరీక్షల్లో వచ్చిన మార్కులు, మే 2018 పరీక్షల్లో వచ్చిన మార్కులను పోలుస్తారు. వీటిల్లో ఏ మార్కులు ఎక్కువ ఉంటే వాటినే పరిగణిస్తామని తెలిపింది.  ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా పాసైన సబ్జెక్టుల్లో ఇంప్రూవ్ మెంట్ రాసుకునే అవకాశం కల్పించినప్పటికీ... తాజాగా వచ్చే మార్కులనే లెక్కలోకి తీసుకుంటారు