Monday, November 12
Log In

ఇంటర్ పరీక్ష ఫీజుల గడువు పెంపు

ఇంటర్మీడిట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫీజుల గడువును పెంచారు. మార్చి, 2019 లో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఫీజులు చెల్లించడానికి ఇవాళే ఆఖరు తేది. అయితే ఇవాళ వెబ్ సైట్ మొరాయించడంతో విద్యార్థులు టెన్షన్ పడ్డారు. రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది దాకా ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. వీళ్ళల్లో 25శాతం మంది కూడా ఫీజులు కట్టలేదు. నాలుగైదు రోజులుగా వెబ్ సైట్ మొరాయిస్తుండటంతో ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు ఇప్పటికే బోర్డుకి 172 మెయిల్స్ పెట్టాయి. ఇంటర్ ఫీజుల వసూలు చేసే బాధ్యతలను ఎలాంటి అనుభవం లేని సంస్థకు బోర్డు అప్పగించిందని చెబుతున్నారు. గతంలో ఈ సంస్థపై ఆరోపణలు ఉన్నాయంటున్నారు. బోర్డుపై తీవ్ర విమర్శలు రావడంతో చివరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అక్టోబర్ 31 దాకా ఫీజులు చెల్లించడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలిచ్చింది.