భారతదేశం – ఉనికి, విస్తరణ


1) భారత దేశం రేఖాంశాలపరంగా ఏ గోళంలో ఉంది ?
జ: పూర్వార్థ గోళంలో
2) భారత్ గుండా ఎన్ని అక్షాంశాలు, రేఖాంశాలు పోతున్నాయి ?
జం 30 అక్షాంశాలు, 30 రేఖాంశాలు
3) భారత్ దేశం మొత్తం విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు ?
జ: 32,87,263 చ.కి.మీ
4) ప్రపంచ భూవిస్తీర్ణంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ?
జ: 7 వ స్థానం
5) ప్రపంచంలో విస్తీర్ణంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి ?
జ: రష్యా, కెనడా, చైనా
6) భారత్ లో ప్రామాణిక సమయం ఏ గడియారంతో ప్రారంభమవుతుంది ?
జ: యూనీలోని మీర్జాపూర్ లో గల వింధ్యాచల్ రైల్వేస్టేషన్ లో గల గడియారంతో
7) భారత దేశ తూర్పు, పశ్చిమ కనుమల మధ్య వ్యత్యాసం ఎన్ని గంటలు ?
జ: దాదాపు 2 గంటలు


8) దేశంలో సూర్యుడు మొదట ఉదయించే ప్రాంతం, అస్తమించే ప్రాంతం ఏవి ?
జ: ఉదయించేది : అరుణాచల్ ప్రదేశ్ ( డ్యాంగ్ లోయ)
అస్తమించేది : గుజరాత్
9) భారత దేశానికి ఉత్తరాన చిట్టచివరి ప్రాంతం ఏది ?
జ: ఇందిరా కాల్ ( ఇది జమ్మూకాశ్మీర్ లోని లడఖ్ జిల్లాలోని కిలిక్ ధావన్ కనుమలో ఉంది)


10) భారత్ దేశానికి దక్షిణాన చిట్టవరి ప్రాంతం ఏది ?
జ: గ్రేటర్ నికోబార్ దీవిలోని ఇందిరా పాయింట్ (పిగ్మాలియన్ పాయింట్ )
భూభాగం మీద - కన్యాకుమారి
11) భారత్ దేశానికి తూర్పున చిట్టవరి ప్రాంతం ఏది ?
జ: పూర్వాంచల్ పర్వతాల్లోని పట్కాయ్ కొండల్లోని దీపూ కనుమ (అరుణాచల్ ప్రదేశ్)
12) భారత్ దేశానికి పశ్చిమాన చిట్టవరి ప్రాంతం ఏది ?
జ: రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలోని సర్ క్రిక్ రేఖ ( గుజరాత్)
13) భారత్ కు అంతర్జాతీయ భూ సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు ?
జ: 15,200 కి.మీ
14) భారత్ దేశ తీర రేఖ పొడవు (భూభాగంలో ) ఎంత ?
జ: 6100 కిమీ
15) భారత్ ఎన్ని దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉంది ?
జ: ఏడు దేశాలతో
16) భారత్ లో అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఎన్ని ?
జ: 17
17) భారత్ కు అతి ప్రాచీన నామం ఏది ?
జ: జంబూ ద్వీపం (జంబూ అంటే నేరేడు పండు)
18) భారత్ ను ఇండియాగా ఎవరు వర్ణించారు ?
జ: గ్రీకులు
19) భారత్ దేశంతో ఎక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది ?
జ: బంగ్లాదేశ్ (4096 కి.మీ) ( పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఎక్కువ సరిహద్దు ఉంది)
20) పాకిస్థాన్ కి మన దేశంలో ఏయే రాష్ట్రాలు సరిహద్దులుగా కలిగి ఉన్నాయి ?
జ: పంజాబ్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్
21) ఒకే ఒక దేశం సరిహద్దుగా కలిగిన రాష్ట్రం ఏది ?


జ: త్రిపుర ( బంగ్లాదేశ్ - 3 వైపులా ఉంది)
22) బంగ్లాదేశ్ తో 2015 మే 7న అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఆమోదించింది. ఈ ఒప్పందం ఎప్పుడు, ఎవరెవరి మధ్య జరిగింది ?
జ: 1974 మే 16న భారత ప్రధాని ఇందిరాగాంధీ, బంగ్లాదేశ్ ప్రధాని ముజిబుల్ రెహమాన్ తో
23) భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ఒప్పందం ఎన్నో రాజ్యాంగ సవరణ కింద పార్లమెంటు ఆమోదించింది ?
జ: 119 వ, 100 వ రాజ్యాంగ సవరణల కింద
24) భారత్ -బంగ్లా ఒప్పందంతో ఏ దేశాలకు ఎన్ని భూభాగాలు వచ్చాయి ?
జ: భారత్ దేశం బంగ్లాదేశ్ నుంచి పొందినవి : 111 (17149 ఎకరాలు)
బంగ్లాదేశ్ కు ఇచ్చినవి: 51 ప్రాంతాలు ( 7100 ఎకరాలు)
25) భారత్ తో అతి తక్కువ సరిహద్దు కలిగిన దేశం ఏది ?
జ: ఆఫ్ఘనిస్తాన్ ( 80 కిమీ)
26) భారత్ లో తీర రేఖను కలిగిన రాష్ట్రాలు ఎన్ని ?
జ: రాష్ట్రాలు 9, కేంద్ర పాలిత ప్రాంతాలు 2
27) దేశంలో పొడవైన తీరం కలిగిన రాష్ట్రం ఏది ?
జ: కాండ్లాతీరం (కచ్) - గుజరాత్ లో (1054కిమీ)
28) దేశంలో తక్కువ తీరం కలిగిన రాష్ట్రం ఏది ?
జ: వంగ తీరం - పశ్చిమబెంగాల్ ( 400 కిమీ)
29) సముద్ర తీరం కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవి ?
జ: పుదుచ్చేరి, డయ్యూ డామన్
30) తీరరేఖతో పాటు అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏవి ?
జ: గుజరాత్, పశ్చిమ బెంగా


31) బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహాసముద్రం తీర రేఖను కలిగిన రాష్ట్రం ఏది ?
జ: తమిళనాడు
32) భారత్ యొక్క సముద్ర ప్రాదేశిక జలాలలు ఎన్నిక మైళ్ళు ?
జ: 12 నాటికల్ మైళ్ళు ( 1నాటికల్ మైల్ - 1852 కిమీ)
33) అంతర్జాతీయ సరిహద్దు, సముద్ర తీరం లేని రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు. అలాంటి రాష్ట్రాలు దేశంలో ఏవి ?
జ: 5 ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, హర్యానా, తెలంగాణ
34) భూపరివేష్టిత కేంద్ర పాలితప్రాంతాలు ఏవి ?
జ: న్యూఢిల్లీ, చండీగఢ్
35) దేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది ?
జ: ఉత్తర ప్రదేశ్ ( 9)
36) దేశంలో అతి తక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది ?
జ:  మేఘాలయ (1-అసోం),  సిక్కిం ( 1 - వెస్ట్ బెంగాల్)