Sunday, January 24
Shadow

బ్యాంక్ ఎగ్జామ్స్ సిలబస్ లో ఏమేమి ఉంటాయి ? (2020కి మారాయి)

IBPS 2020 ద్వారా గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే.  తెలుగులో కూడా రాసుకోడానికి ఛాన్స్ ఉండటంతో ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశముంది.  పైగా SSCతో పాటు రాష్ట్ర స్థాయిలో SI పోటీ పరీక్షలు రాసిన వారు కూడా ఈ బ్యాంక్ ఉద్యోగాలకు ఈజీగా పోటీ పడొచ్చు.  కాస్త కష్టపడాలి. మంచి ప్లానింగ్ తో పాటు టైమ్ టేబుల్ వేసుకోవాలి.  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ను వేగంగా, తప్పులు లేకుండా చేయగలగాలి.  2019 ఎగ్జామ్స్ కీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. గమనించగలరు.  నేషనల్ వెబ్ సైట్స్ లో 2019 మోడల్ లో ఇచ్చారు. కానీ 2020 కి IBPS ఒరిజినల్ నోటిఫికేషన్ ఆధారంగా ఈ Essay తయారు చేశాం.

PRELIMS EXAMS

1) రీజనింగ్ ఎబిలిటీ – 40ప్రశ్నలు – 40 మార్కులు

2) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 40 ప్రశ్నలు – 40 మార్కులు

మొత్తం: 80 ప్రశ్నలు, 80 మార్కులు, 45 నిమిషాలు

అసలు IBPS 2020 POs ఎగ్జామ్ లో ఉండే సిలబస్ అంశాలను ఓసారి పరిశీలిద్దాం.

ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో అంశాలు

రీజనింగ్ సిలబస్

1) పజిల్స్

2) ఆల్ఫా న్యూమెరిక్ సిరీస్/ ఆల్ఫా బెట్స్ / న్యూమెరిక్ సిరీస్

3) డెరెక్షన్ సెన్స్

4) డేటా సఫీషియన్సీ

5) ఇన్ ఈక్వలిటీస్

6) సీటింగ్ అరేంజ్ మెంట్

7) ఇన్ పుట్ – ఔట్ పుట్

8) సిలాయిజమ్స్

9) బ్లడ్ రిలేషన్స్

10) ఆర్డర్ అండ్ ర్యాంకింగ్

11) కోడింగ్ & డీకోడింగ్

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సిలబస్

1) సింప్లిఫికేషన్ & అప్రాక్షిమేషన్

2) నంబర్ సిరీస్

3) క్వాడ్రాటిక్, క్వాంటిటీ బేస్డ్

4) రేషయో & ప్రొపర్షన్, పార్టనర్షిప్

5) పర్సంటేజ్

6) మిక్చర్స్, అలిగేషన్స్

7) ఎవరేజ్ & ఏజెస్

8) ప్రాఫిట్ అండ్ లాస్

9) టైమ్ అండ్ వర్క్ & పైప్ అండ్ సిస్టర్న్

10) సింపుల్ ఇంట్రెస్ట్ & కాంపౌండ్ ఇంట్రెస్ట్

11) టైమ్ అండ్ డిస్టెన్స్, బోట్ అండ్ స్ట్రీమ్

12) పెర్ముటేషన్, కాంబినేషన్ & ప్రాబబిలిటీ

13) మెన్సురేషన్ ( 2D & 3D)

14) డేటా ఇంటర్ ప్రిటేషన్ ( Bar, Line, Pie, mixed, missing, arithmetic, caselet)

15) డేటా సఫీషియన్సీ

ఇక POs మెయిన్స్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ చూద్దాం

1) రీజనింగ్ : 40 ప్రశ్నలు, 50 మార్కులు

2) కంప్యూటర్ నాలెడ్జ్: 40 ప్రశ్నలు – 20 మార్కులు

3) జనరల్ అవేర్ నెస్ : 40 ప్రశ్నలు, 40 మార్కులు

4) ఇంగ్లీష్ లాంగ్వేజ్ : 40 ప్రశ్నలు – 40 మార్కులు

(హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది... అభ్యర్థులు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ ఎంపిక చేసుకోవచ్చు)

5) క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ : 40 ప్రశ్నలు – 50 మార్కులు

మొత్తం 200 ప్రశ్నలు, 200 మార్కులు , 2 గంటలు టైమ్ ( 120 నిమిషాలు)

( మెయిన్స్ లో రీజనింగ్,  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్టులకు పైన వివరించిన సిలబస్ ఉంటుంది... Difficulty  levels మారతాయి.  అలాగే మెయిన్స్ లో కొత్తగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్ నెస్ యాడ్ అవుతుంది.  2019 లో డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ ప్రిటేషన్ ను తొలగించారు (వీటిని ఆఫీసర్ స్కేల్ 2 అంటే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టులకు మాత్రమే చేర్చారు. Multi purpose Assts, POs కి ఈ విభాగం లేదు)

ఇంగ్లీషు సిలబస్

1) Reading Comprehension

2) Close Test

3) Para Jumbles

4) Vocabulary based

5) Fill in the Blanks

6) Multiple Meaning / Error Spotting

7) Paragraph Completion

8) Spelling Errors

9) Word Replacement

10) Column based Fillers and Sentence Connectors

11) Word Usage

12) Idioms and Phrases

13) Sentence Completion

జనరల్ అవేర్ నెస్ సిలబస్

1) బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్ నెస్

2) కరెంట్ అఫైర్స్ ( 4 నుంచి 5 నెలలు)

3) స్టాటిక్ అవేర్ నెస్

Note: IBPS 2020 ఎగ్జామ్ ఈసారి తెలుగులో ఉన్నందున చాలామంది అభ్యర్థులు పోటీ పడతారని భావిస్తున్నాం.  అందుకే మేం www.telanganaexams.com & www.andhraexams.com వెబ్ సైట్స్ ద్వారా గైడెన్స్, టెస్టులు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం.  ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటేనే వీటిని స్టార్ట్ చేస్తాం.  అందుకోసం Telegram app లో IBPS 2020 పేరుతో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేస్తున్నాం (వాట్సాప్ గ్రూప్ లేదు).  ఆసక్తి ఉన్న వాళ్ళు 703 6813 703 కి  టెలిగ్రామ్ ద్వారా మెస్సేజ్ చేయండి... లింక్ పంపుతాం )

రూరల్ బ్యాంక్స్ PO/CLERKS: తెలంగాణలో 583, APలో 289 పోస్టులు. తెలుగులో రాసుకునే అవకాశం... పూర్తి వివరాలకు క్లిక్ చేయండి :http://telanganaexams.com/bank-pos-clerks-telangana-andhra-pradesh-posts/

మీరు తెలంగాణ ఎగ్జామ్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారా ? లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి: https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams&hl=en