Wednesday, October 23

IBPS తెలుగులో నిర్వహించాలని ట్విట్టర్ ఉద్యమం !

ఫ్రెండ్స్
IBPS 2019 క్లర్క్స్ ఎగ్జామ్ తెలుగులో నిర్వహిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే మొన్న రిలీజ్ అయిన నోటిఫికేషన్ లో మాత్రం ఇంగ్లీష్ లేదా తెలుగులో మాత్రమే ఎగ్జామ్ అని ఉంది. మేం తెలంగాణ ఎగ్జామ్స్ /ఆంధ్రా ఎగ్జామ్స్ తరపున మేడమ్ కు ట్వీట్స్ ద్వారా రిప్రజెంట్ చేశాం. ఫ్రెండ్స్ మీరు కూడా నిర్మలా సీతారామన్ గారికి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయండి... ఈసారి ఎగ్జామ్ ఖచ్చితంగా తెలుగులో జరుగుతుంది. 16.09.19న జరిగే ఆఫీసర్స్ స్కేల్ 1 పోస్టు మెయిన్ ఎగ్జామ్ కూడా తెలుగుతో సహా ఇతర ప్రాంతీయ భాషల్లో రాసుకునే అవకాశం ఇచ్చారు. మనకీ ఛాన్స్ వస్తుంది. దయచేసి ఈ ట్విట్టర్ ఉద్యమంలో మీరూ పాల్గొనండి.

ప్రాంతీయ బ్యాంకుల ఉద్యోగాలకు టెస్టులు రాసుకోడానికి తెలుగులో అవకాశం ఇస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు.  ఇప్పుడు జాతీయ బ్యాంకులు కాబట్టే ... అవకాశం ఇవ్వరన్న వాదన వినిపిస్తోంది.  అయితే ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకల్లో కూడా కనిమొళి, సిద్ధరామయ్య లాంటి వాళ్ళు ప్రాంతీయ భాషల కోసం డిమాండ్ చేశారు.  అందువల్ల దక్షిణాదివాళ్ళం గట్టిగా పోరాడితేనే ఫలితం ఉంటుంది.

ఎక్కువమంది నిరుద్యోగులకు ఈసారి బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే అవకాశం దక్కుతుంది. ఏ మాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఈ రోజే మీ ట్వీట్ ను ట్విట్టర్ ద్వారా సీతారామన్ గారికి రిప్రజెంట్ చేయండి. వీలైతే ప్రధాని నరేంద్రమోడీ మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా ట్వీట్స్, రిప్రజెంట్ చేయండి.

(విష్ణుకుమార్ మేడుకొండూరు, సీనియర్ జర్నలిస్ట్ )

 

Please join in

తెలంగాణ ఎగ్జామ్స్ ట్విట్టర్ ఫాలో అవ్వండి