Monday, October 15
Log In

హయ్యర్ ఎడ్యుకేషన్ పరీక్షల షెడ్యూల్

ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో లేని విధంగా పోటీ పరీక్షలను ఈ ఏడాది నుంచి ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్నారు. JEE (Main), NEET(UG)లను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటాయి.

1. JEE (Main): 2019 జనవరి, 2019 ఏప్రిల్ లో
జనవరిలో పరీక్ష షెడ్యూల్:
09 సెప్టెంబర్, 2018 to 30 సెప్టెంబర్, 2018 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి.
06 జనవరి, 2019 to 20 జనవరి, 2019 మధ్యలో 8 విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకిష్టమైన ఏ తేదీనైనా ఎంపిక చేసుకోవచ్చు
రిజల్ట్స్ : 2019 ఫిబ్రవరి మొదటివారంలో

JEE(Main) ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్ష షెడ్యూల్
2019 ఫిబ్రవరి రెండోవారంలో దరఖాస్తుల సమర్పణ
07 ఏప్రిల్, 2019 to 21 ఏప్రిల్, 2019 మధ్యలో 8విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకిష్టమైన ఏ తేదీనైనా ఎంపిక చేసుకోవచ్చు
రిజల్ట్స్: 2019 మే నెల మొదటివారంలో

2. NEET(UG) : ఫిబ్రవరి 2019, మే 2019 పరీక్ష నిర్వహణ
ఫిబ్రవరి 2019 పరీక్ష
01 అక్టోబర్,2018 to 31 అక్టోబర్, 2018 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
03 ఫిబ్రవరి,2019 to 17 ఫిబ్రవరి,2019 మధ్యలో పరీక్ష నిర్వహణ
2019 మార్చి మొదటివారంలో ఫలితాల వెల్లడి

NEET మే 2019 పరీక్ష
మార్చి 2019 రెండోవారంలో ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు
- 12 మే, 2019 to 26 మే, 2019 మధ్యలో పరీక్ష నిర్వహిస్తారు.
రిజల్ట్స్ : 2019 జూన్ మొదటివారంలో

3. యూజీసీ-నెట్.. డిసెంబర్‌లో నిర్వహణ.
- 01 సెప్టెంబర్,2018 నుంచి 30 సెప్టెంబర్, 2018 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
- 02 డిసెంబర్, 2018 నుంచి 16 డిసెంబర్, 2018 మధ్యలో రెండు షిప్టుల్లో శని, ఆదివారాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
2019 జనవరి చివరివారంలో ఫలితాలను రిలీజ్ చేస్తారు.

4. జనవరి 2019లో సీమ్యాట్, జీప్యాట్ పరీక్ష నిర్వహణ..
- 22 అక్టోబర్,2018 నుంచి 15 డిసెంబర్,2018 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పించ వచ్చు.
- 27 జనవరి,2019న పరీక్ష నిర్వహణ
- 2019 ఫిబ్రవరి మొదటివారంలో ఫలితాల వెల్లడి

పరీక్షా విధానం, సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేవు. గతంలో ఉన్నట్టే పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష ఫీజులో కూడా మార్పులు లేవు.