Friday, July 19

గ్రూప్ 2 ఇంటర్వ్యూలు జులైలో..

కోర్టులో కేసుల క్లియర్ అవడంతో ఇకపై గ్రూప్ 2 ఇంటర్వ్యూలపై దృష్టిపెట్టింది TSPSC. ఈ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు జులై మొదటి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు TSPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. గ్రూప్ 2 ఇంటర్వ్యూలకు 2వేల మందికి పైగా అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు. గ్రూప్ 2  ఇంటర్వ్యూలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. అలాగే TRT పైనా స్పందించారు ఘంటా చక్రపాణి. టీఆర్టీ ఎంపిక జాబితా పూర్తయిందనీ... ఆ నివేదికను ప్రభుత్వానికి పంపినట్టు చెప్పారు. విద్యాశాఖ ఆమోదం తర్వాత నియామకాలు పూర్తవుతాయన్నారు TSPSC ఛైర్మన్.

 

గ్రూప్ 2 ఇంటర్వ్యూలను ఎలా ఫేస్ చేయాలి... వర్తమాన అంశాల్లో వేటిపై దృష్టిపెట్టాలో ప్రత్యేకంగా వీడియో క్లాసులను అందిస్తాం.  ఈ కింది లింక్ ద్వారా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్  ఛానెల్ ని subscribe చేసుకోండి...

please subscribe our Telangana Exams You Tube channel with the following Link.

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true