Thursday, June 27

గ్రూప్ 2 వివాదంపై హైకోర్టు తీర్పు

గ్రూప్ 2 బబ్లింగ్, వైట్ నర్ వివాదంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సాంకేతిక కమిటీ సిఫార్సులతో ఎంపిక ప్రక్రియ చేపట్టాలని TSPSC కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎంపిక ప్రక్రియలో బబ్లింగ్, వైట్ నర్ అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుపై TSPSC ఛైర్మన్ చక్రపాణి స్పందించారు. హైకోర్టును స్వాగతిస్తామని, త్వరలోనే మెరిట్ జాబితా, ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని చెప్పారు.

గతంలో గ్రూప్ 2 లిస్ట్ నుంచి తీసేసిన 343 మంది అభ్యర్థుల ఫలితాలను కూడా సమీక్షించాలని కోర్టు ఆదేశించింది. దీంతో గతంలో సింగిల్ బెంచ్ తీసేసిన 343 మంది అభ్యర్థులకు ఈ డబుల్ బెంచ్ తీర్పుతో ఊరట కలిగింది. మొత్తం 1032 పోస్టులకు 1:3 నిష్పత్తిలో సెలెక్ట్ అయిన అభ్యర్థలు 3147 మంది ఉన్నారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో 1:2 రేషియోలో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు TSPSC సిద్ధమవుతోంది.