GROUP – 2 ప్రిపరేషన్ ప్లాన్

అదృష్టాన్ని నమ్ముకొని... లేదా గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అనే పరిస్థితి లేదు. సిలబస్ పై పూర్తిగా అవగాహన, నిరంతరం ప్లానింగ్, కష్టపడాలి... అదే టైమ్ లో తెలివిగా చదువుకోవాలి. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం ఉంటుంది. మీరు రాయబోయే ఎగ్జామ్ కోసం లక్షల మంది పోటీ పడొచ్చు...ఇప్పటికే పుస్తకాలు బట్టీ పట్టి ఉండొచ్చు. పోస్టుల సంఖ్య తక్కువగా ఉండొచ్చు. అయినా సరే... ఏమాత్రం వెనుకడుగు వేయొద్దు. మన ఉద్యోగం మన కోసం అక్కడ ఒక్కటి గ్యారంటీగా  ఉంటుందని ఊహించుకోండి...... దాన్ని గురి తప్పకుండా కొట్టాలని గుర్తుపెట్టుకోండి.

మీరు ఆరు నెలలు లేదంటే కనీసం 3 నెలలు ఓ ప్లాన్ ప్రకారం చదివితే... గ్రూప్ ఉద్యోగాన్ని సాధించడం ఈజీ. సిలబస్ చాలా ఉంది అని మాత్రం బెంగ పెట్టుకోవద్దు... మనం టైమ్ ని సద్వినియోగం చేసుకుంటూ... ఎంత ప్రణాళికాబద్దంగా చదివామన్నది ముఖ్యం. నెలలు... వారాలు... రోజులు... గంటలు... నిమిషాలు... ఇలా ప్రతి ఒక్క నిమిషాన్ని ప్లాన్ చేసుకొని చదివితే విజయం మీ సొంతం అవుతుంది.

ఉద్యోగం సంపాదించాలంటే ఖచ్చితంగా మీలో ఈ మార్పును కోరుకుంటున్నాం :

1) బద్దకం వదిలించాలి :

బద్దకం అనేది మెదడు నిస్తేజంగా మారుస్తుంది. ఉదయం ఐదింటికల్లా మనం చదవడం స్టార్ట్ చేయాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచే వాళ్ళు ఎందరో గొప్ప గొప్ప విజయాలు సాధించారు. వాళ్ళు ఇప్పటికీ అదే బాటలో నడుస్తున్నారు. అందువల్ల పొద్దునే లేవడం అనేది బద్దకంగా ఫీల్ అవ్వకండి...

2) భయాన్ని జయించండి:

లక్షలమంది ప్రిపేర్ అవుతున్నారు. నాకు ఉద్యోగం వస్తుందా... అన్న భయాన్ని ముందు వీడండి. నేను పూర్ స్టూడెంట్ ను. నాకసలు ఏమీ గుర్తుండదు... ఎంత చదివినా మర్చిపోతాను. ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు వెంటనే మానుకోండి. పాజిటివ్ దృక్పథాన్ని అలవాటు చేసుకోండి... నేను దేన్నయినా సాధించగలను అన్న గట్టి నమ్మకం మీ మీద మీరు పెట్టుకోండి.  మన మెదడుకు మనం ఇచ్చే పాజిట్ సంకేతాలే... మన విజయానికి బాటలు వేస్తాయి.

3) అనుకుంటే సరిపోదు:

చాలామంది నాకు మంచి జాబ్ రావాలి. నేను జీవితంలో స్థిరపడాలి... అని కలలు కంటారు. కానీ గుర్తుపెట్టుకోండి. కలలు కనడమే కాదు... అవి నిజం కావడానికి నా వంతుగా ఏం చేయాలన్న దానిపై దృష్టిపెట్టండి. మనం చదువుతున్న పుస్తకాల మీద ఏ మాత్రం శ్రద్ధ తగ్గినా... మన చూపులు పుస్తకం వైపు, మన మనసు వేరొక చోట ఉంటే... మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు. ప్రతి క్షణం విలువైనది అన్న సంగతి బాగా గుర్తు పెట్టుకోండి.

4) సిలబస్ మీద పట్టు సాధించాలి :

చాలామంది ఎగ్జామ్ రాసే వరకూ సిలబస్ మీద పట్టు సాధించలేకపోతుంటారు. ముందు నుంచీ దానిపై దృష్టిపెట్టకుండా చివరికి గందరగోళంలో పడిపోతారు. సిలబస్ మీద పట్టు సాధించే వాళ్ళే గ్రూప్స్ లో విజయం సాధిస్తారన్నది మర్చిపోకండి. ఒక్కో పేపర్ లో ఏయే అంశాలున్నాయి... మిగతా పేపర్లలో ఈ సిలబస్ ఎంతవరకు కవర్ అవుతోంది... అన్నది తెలుసుకుంటే... ఒక పేపరు చదువుతూనే రెండో పేపర్ సిలబస్ కూడా కొంతవరకూ పూర్తి చేయొచ్చు.

అంటే జనరల్ స్టడీస్ కి చదువుతూనే మిగతా పేపర్లలో సిలబస్ ను కూడా కవర్ చేయొచ్చు.

5) ప్రతి నిమిషం విలువైనదే:

ముందు చెప్పినట్టు ప్రతి నిమిషం... ప్రతి క్షణం కూడా ఉద్యోగ సాధనలో విలువైనదే. టైమ్ వేస్ట్ చేసుకుంటే విజయం దూరమవుతుంది. అలాగే మన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నట్టే. రోజుకి మనకు 86 వేల 400 సెకన్లు ఉంటాయి. దాన్ని ఏ మాత్రం వ్యర్థం చేసుకోవద్దు. ఇతరుల టైమ్ వేస్ట్ చేయొద్దు. మనం చదువుకుంటున్నప్పుడు వేరే విషయాలు గానీ... డిస్కషన్ గానీ పెట్టుకున్నప్పుడు ... అవి మనకు ఎంతవరకు ఉపయోగం.. అని మీరు గుర్తిస్తే చాలు. మీ సరదాలు, షికార్లు, ప్రేమలు, సినిమాలు లాంటి వాటికి ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టండి. మనం అనుకున్న ఉద్యోగం సాధిస్తే.. ఇంతకంటే రెట్టింపు సరదాలు అనుభవించవచ్చని గుర్తుంచుకోండి.

గ్రూప్ -2 పరీక్షా విధానం

మల్టీపుల్ ఛాయిస్ క్వొశ్చన్స్ తో నాలుగు పేపర్లు + ఇంటర్వూ ఉంటాయి. నాలుగు పేపర్లు ఒక్కోటి 150 మార్కుల చొప్పున 600 మరియు 75 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.

మొదటిపేపర్ : జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ

రెండో పేపర్ : చరిత్ర, పాలిటీ అండ్ సొసైటీ

మూడో పేపర్: ఎకానమీ అండ్ డెవలప్ మెంట్

నాలుగో పేపర్: తెలంగాణ చరిత్ర

ఒక్కో పేపర్ కు రెండున్నర గంటల టైమ్ ఉంటుంది. డిగ్రీ స్థాయి సిలబస్ తో పరీక్ష ఉంటుంది. గ్రూప్ అభ్యర్థుల రిఫరెన్స్ బుక్స్ నేను గతంలోనే సూచించాను.  వాటితో పాటు... Telangana Exams వెబ్ సైట్, Telangana Exams Plus యాప్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఫాలో అవ్వండి.

ఇప్పటికే Telangana Exams plus యాప్ లో ప్రత్యేకంగా గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యేవారి కోసం Target Group 2 అని మాక్ అండ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాం.  ఇందులో జనరల్ స్టడీస్ కలుపుకొని మొత్తం 4 పేపర్లకి సంబంధించి ప్రత్యేకంగా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఇస్తున్నాం. అయితే గ్రూప్ 1,2,3 కి కలిపి ... సిరీస్ ఒకటి నడుస్తోంది. కానీ చాలామంది exclusiveగా గ్రూప్ 2 కి మాక్ అండ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ కావాలని అడిగారు.  అందుకే ఇది స్టార్ట్ చేశాం. ఇప్పటికే కొన్ని టెస్టులు ఇచ్చాం.  ఇంకా exclusive టెస్టులు ఇవ్వబోతున్నాం. సిలబస్ అంతా కవర్ చేస్తూ... ప్రతి లెసన్ కు 2,3 టెస్టులు వచ్చేలా  ప్రశ్నలు, జవాబులు అందిస్తున్నాం. గతంలో వచ్చిన ప్రశ్నలు, ప్రస్తుత సంఘటనలకు అనుగుణంగా అప్ డేట్ చేస్తున్నాం.

ఈ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే.... Telangana Exams plus అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని... అందులో store అని ఉంటుంది... అక్కడ క్లిక్ చేసి వెళితే మీకు టార్గెట్ గ్రూప్ 2 సిరీస్ కనిపిస్తుంది.

జనరల్ స్టడీస్ ( అన్ని పోటీ పరీక్షలకు కామన్ పేపర్ )

గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -4 తదితర పరీక్షల్లో జనరల్  స్టడీస్ అనేది కీలకం. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్లతో పాటు కేంద్ర స్థాయిలోని పరీక్షలకు కూడా జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి కొద్దిగా సిలబస్ లో మార్పులు చేర్పులు ఉంటాయి.

1) అంతర్జాతీయ సంబంధాలు - పరిణామాలు

2) జనరల్ సైన్స్ : శాస్త్ర, సాంకేతిక రంగంలో భారతదేశ విజయాలు

3) పర్యావరణ అంశాలు: విపత్తు నిర్వహణ, నివారణ వ్యూహాలు

4) ప్రపంచ, భారత, తెలంగాణ భూగోళిక శాస్త్రం

5) భారత దేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం

6) తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం

7) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు

8) సామాజిక వెలి, హక్కులు - అంశాలు, సమ్మిళిత విధానాలు

9) లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్

10) బేసిక్ ఇంగ్లీష్ ( sscస్టాండర్డ్)

ఈ పది అంశాల్లో పట్టు సాధించాలి. గ్రూప్ ఉద్యోగాలు కొట్టడం ఈజీ.

 

గ్రూప్ 2 లోని నాలుగు పేపర్లతో Exclusive గ్రూప్ 2 కోర్సులో జాయిన్ అవ్వండి.  మీ కల సాకారం చేసుకోండి

ఈ లింక్ ద్వారా డైరెక్ట్ గా  కోర్సు PURCHASE చేసి జాయిన్ అవ్వండి.

Hey! Checkout this amazing course TARGET GROUP 2 (TSPSC) - 4 PAPERS- TM TEST SERIES + MENTORSHIP VIDEOS, LIVE INTERACTIONS by Telangana Exams Plus.
Click to Buy now! http://payments.course-today.com?token=eyJjb3Vyc2VJZCI6NjIxNDUsInR1dG9ySWQiOjEzOTcxNCwib3JnSWQiOjEyMjM1LCJjYXRlZ29yeUlkIjpudWxsfQ==

 

పేపర్1 జనరల్ స్టడీస్,జనరల్ ఎబిలిటీస్ (150 మార్కులు)

1.కరెంట్ అఫైర్స్ ప్రాంతీయ,జాతీయ అంతర్జాతీయ అంశాలు:-

కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు): ఇవన్నీ ప్రతి రోజూ పేపర్లలో, టివీల్లో చూస్తున్నవే.అయినా పరీక్షలో అడిగే విధానం విభిన్నంగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అంటే రాష్ట్ర్రానికి మాత్రమే పరిమితం కాదు. జాతీయ, అంతర్జాతీయ స్దాయిలో జరుగుతున్న వివిధ సంఘటనలు ఇందులో ఉంటాయి. వార్తల్లోని ప్రదేశాలు, వ్యక్తులు, అవార్డులు, నియామకాలు, ఆటలు, ఆర్దిక, రాజకీయ భౌగోళిక పరిణామాలు, శాస్త్ర్ర్ర సాంకేతిక పరిజ్ణానం, ప్రముఖ వ్యక్తుల పర్యటనలు, మరణాలు, కొత్త పథకాలు మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షకు ముందు ఏడాది నుంచి కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే బెటర్. ప్రతి రోజూ దినపత్రిక చూడటం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్స్ రాసుకోవడం లాంటివి చేయాలి. వీటిని ఎగ్జామ్ డేట్ కు నెల ముందు వరకూ ఎప్పటిప్పుడు అప్ డేట్ చేసుకుంటే బెటర్.

అంతర్జాతీయ సంబంధాలు, ముఖ్య పరిణామాలు:

గ్రూప్స్ లో ఇది కొత్తగా ప్రవేశపెట్టిన అంశం. అయినా గతంలో కరెంట్ ఎఫైర్స్ లో భాగంగానే ఉండేది. భారత దేశానికి ఇతర దేశాలతో ఉన్న సంబంధాలతో పాటు ఇరుగు, పొరుగు దేశాలతో ఎదురైన ఇబ్బందులు, ఒప్పందాలు లాంటివి నోట్స్ రాసుకోవాలి. దీంతో పాటు ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం జరుగుతున్న ముఖ్య పరిణామాలపై ఫోకస్ చేయాలి.

2. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత విజయాలు:-

గ్రూప్స్ లో అన్ని పరీక్షలకు జనరల్ స్టడీస్ పేపర్ కు సంబంధించిన జనరల్ సైన్స్, టెక్నాలజీ అంశాలపై ప్రిపరేషన్ కొనసాగించాలి. జనరల్ సైన్స్ లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం లాంటి విభాగాలు ఉంటాయి. వీటికి అదనంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్షం, పర్యావరణ కాలుష్యం, జీవ వైవిధ్యం లాంటి అంశాలు ఉంటాయి.

జనరల్ సైన్స్ లో ఇచ్చే ప్రశ్నలు ఏవైనా నిత్య జీవితంలో ఎదుర్కునే అంశాలపైనే ఉంటాయి. కానీ సబ్జెక్ట్ లోతుగా చదవాల్సిన పనిలేదు. 6-10 తరగతుల పాఠ్యపుస్తకాల్లో మనకు కావాల్సినంత సమాచారం ఉంటుంది. ఇవి మొదట చదవడం వల్ల సైన్స్ పదాలపై అవగాహన ఏర్పడతుంది. దాంతో సమకాలీన అంశాలు తేలిగ్గా అర్థం చేసుకొని చదవడం వీలవుతుంది. పరమాణు నిర్మాణం, ఎలక్ట్రాన్ విన్యాసం లాంటి వాటిల్లో ప్రాథమిక అంశాలు చాలు.

సైన్స్ అండ్ టెక్నాలజీ అతి ముఖ్యమైంది అంతరిక్ష రంగం, డిఫెన్స్ రంగంలో వినియోగించే వివిధ రకాల మిస్సైల్స్, యుద్ధ విమానాలు మొదలగున్నవి. భారత దేశం ప్రస్తుతం అంతరిక్ష రంగంలో దూసుకుపోతోంది. శాటిలైట్స్ ప్రయోగంలో ప్రపంచ అగ్రరాజ్యాలతో పోటీ పడుతోంది. ప్రతి యేటా పదుల సంఖ్యలో విదేశాల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపుతోంది. మన అంతరిక్ష రంగం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ సాధించిన విజయాలు గుర్తుండాలి. మేజర్ గా వాతావరణం, విద్య, చంద్రుడు, మార్స్ లాంటి వాటిపై ప్రయోగాలకు పంపినవి, ఈ శాటిలైట్స్ కు ఉపయోగించిన ఇంజన్లు, ద్రవ ఇంధనం, రిమోట్ సెన్సింగ్, ఇన్సాట్ లాంటి అంశాలపై పూర్తిగా అవగాహన ఉండాలి. ఇక రక్షణ రంగంలో ప్రధానంగా క్షిపణులు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు లాంటి వాటిపై పట్టుసంపాదించాలి. బయోటెక్నాలజీ, మూలకణాలు, జన్యుమార్పిడి, టీకాలు, మొక్కలు, ఐటీ-సోషల్ నెట్ వర్కింగ్ లాంటి అంశాల్లో ప్రణాళికా బద్ధంగా చదివితే ఫలితం ఉంటుంది. భౌతిక శాస్త్రంలో ధ్వని, విద్యుత్, ఉష్ణ శక్తి, మెకానిక్స్, ప్రమాణాలపై దృష్టి పెట్టాలి. రసాయన శాస్త్రంలో అనువర్తిత అంశాలు, జీవశాస్త్రంలో మానవ శరీర ధర్మ శాస్త్రం, వ్యాధులు, పోషణ, విటమన్లు, ముఖ్యమైన జంతువుల, మొక్కల శాస్త్రీయ నామాలు లాంటి వాటిపై ఫోకస్ చేయాలి.
3. పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ-నివారణ, ఉపశమన వ్యూహాలు :-

ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి. గతంలో ఈ సబ్జెక్ట్ కు రాష్ట్ర స్థాయిలో అంత ప్రియారిటీ ఉండేది కాదు. కానీ tspscఇప్పుడు దీన్ని కూడా చేర్చింది. సివిల్స్ తరహాలో ప్రాధాన్యత ఇచ్చినందున 10 ప్రశ్నలదాకా ఈ అధ్యయం నుంచి ఆశించవచ్చు. వాయు, జల కాలుష్యాలు, భూతాపం పెరగడానికి కారణాలు, గ్రీన్ హౌస్ వాయువులపై స్టడీ చేయాలి. అలాగే లేటెస్ట్ గా జరిగిన పర్యావరణ సదస్సులు, దేశంలోని విపత్తుల నిర్వహణ కార్యాలయాలు, ఇవి ఏ కేంద్ర ప్రభుత్వ శాఖల కిందకు వస్తాయి. రాష్ట్రంలో విపత్తుల నిర్వహణను ఏ శాఖలు చూస్తాయి. విపత్తుల విభాగంలో భూకంపాలు, వరదలు, కరువు కాటకాలు, తుఫాన్లు లాంటి వాటితో పాటు వీటి నిర్వహణ, ఉపశమన వ్యూహాలు కూడా స్టడీ చేయాలి.

4.ప్రపంచ, భారత, తెలంగాణ భూగోళ శాస్త్రం:-

జాగ్రఫీకి సంబంధించి సమకాలీన అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అలాగే సబ్జెక్టులోని అంశాలు, సమకాలీన అంశాలను జోడీ చేస్తూ చదువుకోవాలి. గత ప్రశ్నల ఆధారంగా ఎలాంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయన్నదానిపై అవగాహన ఏర్పరచుకోవాలి.

ఎ.వరల్డ్ జాగ్రఫీ:-

విశ్వం, సౌర కుటుంబం, గ్రహాలు, ఉపగ్రహాల గురించి తెలుసుకోవాలి. భూమికి సంబంధించి భూభ్రమణం, భూపరిభ్రమణం, అంక్షాంశాలు, రేఖాంశాలు, భూమి అంతర్నిర్మాణం, భూమి పొరలు, భూచలన సిద్దాంతాలు, శిలలు, మృత్తికలు, క్రమ క్షయం లాంటివి చదవాలి. పీఠభూములు, మైదానాలు, భూస్వరూపాలు, అంతర్జాతీయ దిన రేఖ, స్థానిక కాలం లాంటివి చూడాలి. ప్రధాన పంటలు అవి పండించే దేశాలు, వ్యవసాయ రీతులు, ఉత్పత్తులు, అటవీ విస్తరణ, సమస్యలు, అంతరిస్తున్న జీవజాతులు, రెడ్ డేటా బుక్ గురించి తెలుసుకోవాలి.

బి. ఇండియన్ జాగ్రఫీ:-

దేశానికి సంబంధించిన భౌగోళిక ప్రాంతాల ఉనికి, సహజ వనరులపై అవగాహన ఉండాలి. మనదేశంతో ఇతర దేశాలకు ఉన్న సరిహద్దులు, వాటి పేర్లు, బోర్డర్ ను పంచుకుంటున్న రాష్ట్రాల వివరాలపై ప్రశ్నలు వస్తున్నాయి. నీటిపారుదల, పంటల విస్తరణ, వార్తల్లో ఉన్న నదులు, ఉపనదులు, వాటిపై ఆనకట్టలు తెలుసుకోవాలి. రుతుపవనాలు, వర్షపాతం విస్తరణ, ఖనిజ వనరులు, పరిశ్రమలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, రేవు పట్టణాలు, జలమార్గాలపై ప్రశ్నలు వస్తున్నాయి. దేశంలోని ఆదిమ తెగలు, వారి సంస్కృతులను భౌగోళిక ప్రాంతాల వారీగా చదవాలి.

సి. తెలంగాణ జాగ్రఫీ:-

ఇండియన్ జాగ్రఫీలో అంశాలను ప్రత్యేకంగా తెలంగాణ దృష్టితో కూడా చదవాలి. తెలంగాణ భూస్వరూపం, నేలలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టుల వివరాలు, పండే పంటలు, పరిశ్రమలు, వర్షపాతం వివరాలు, కరువు మండలాలు గురించి చదవాలి.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి లాంటి అనేక ప్రాజెక్టులు, వాటి నిర్మాణం వ్యయం, ఆయకట్టు, ఏయే జిల్లాలకు ప్రయోజనం... వాటికి ఉన్న కాలువలు ఎక్కడెక్కడ...

5. భారత దేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం :-

భారతదేశ చరిత్రలో రాజకీయ అంశాలకన్నా సంస్కృతి, వారసత్వం, కళల మీదే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ లో మిగిలిన సబ్జెక్టులతో పోలిస్తే హిస్టరీ పరిధి ఎక్కువగానే ఉంటుంది. అయినా చదవడానికి ఆసక్తికరంగా, తేలిగ్గా ఉంటుంది. కీలక అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. గ్రూప్ 2 సెకండ్ పేపర్ లో కూడా హిస్టరీ, సాంస్కృతిక అంశాలు కవర్ అవుతాయి. దాంతో ఒకసారి చదివితే రెండు పేపర్లకు పనికొస్తుంది. హిస్టరీని ఎలా చదవాలన్నది వివరంగా ఆ పేపర్లో వివరిస్తాం. అలాగే గత వీడియోల్లో రిఫరెన్స్ బుక్స్ సజెస్ట్ చేశాం.  ఒకసారి ఈ యూట్యూబ్ ఛానెల్ లో చూడండి.

చరిత్రలో ఎక్కువగా సాంస్కృతిక వారసత్వంపైనే ఫోకస్ చేయాలి. సింధూ నాగరికత నుంచి ఆధునిక సిలికాన్ నాగరికత వరకూ ఎంతో సంస్కృతి ఉంది. కళలు, మతాలు, వాస్తు, శిల్పం, నాట్యం, నాటకం, సాహిత్యం, భాష ఇలా ప్రతిదాంట్లో మన వారసత్వ సంపదపై దృష్టిపెట్టాలి.

భారత స్వాతంత్ర్య జాతీయోద్యమంపైనా ఫోకస్ ఉండాలి.

6. తెలంగాణ సమాజం, పంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం:-

తెలంగాణలో శాతవాహన కాలం నుంచి 2015 దాకా సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం మొదలైన రంగాలను చదవాలి.

7. కేంద్ర, రాష్ట్ర విధానాలు :

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలపై అవగాహన ఉండాలి. అలాగే తెలంగాణ ప్రభుత్వ విధానాలు చాలా ముఖ్యం. ప్రభుత్వ పథకాలతో పాటు పారిశ్రామిక విధానం, రైతాంగ విధానం, గ్రామాభివృద్ధి, పట్టణాల అభివృద్ధి, పేద, బడుగు, బలహీన వర్గాల వారి సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మొదలైనవి చదవాలి. జూన్ 2, 2014 రాష్ట్రం ఏర్పటినప్పటి నుంచి ఇప్పటి వరకూ చదవాలి. వాటి అప్ డేట్స్ కూడా ఎగ్జామ్ కి నెల ముందు ఫాలో కావాలి.

8) సామాజిక వెలి, హక్కులు - అంశాలు, సమ్మిళిత విధానాలు:

సమాజంలో ఉన్న బడుగు, బలహీన వర్గాలు, వారి హక్కులు, రాజ్యాంగ రక్షణలు, వారిపై జరుగుతున్న అకృత్యాలు, నివారణోపాయాలు, ఆర్థిక, సామాజిక రంగాల్లో వారి అభివృద్దికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు మొదలగునవి. ఈ వర్గాల వారికి చట్టాలు కల్పిస్తున్న రక్షణలు, గిరిజనులు, ఆదివాసీల సమస్యలపై అవగాహన పెంచుకోవాలి.

9) లాజికల్ రీజనింగ్, అనలటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్:

మిగిలిన సబ్జెక్టులతో పోలిస్తే మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే నిమిషం కంటే ఎక్కువ టైమ్ తీసుకునే అవకాశముంది. అందువల్ల జనరల్ స్టడీస్ లో మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలపై డే ఒన్ నుంచి ప్రిపరేషన్ పకడ్బందీగా సాగాలి. చివర్లో చూసుకుందాంలే అనుకుంటే మాత్రం మీరు నష్టపోక తప్పదు. మెంటల్ ఎబిలిటీలో 20 మార్కుల దాకా ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఇందులో 1) రీజనింగ్ 2) వెర్బల్ రీజనింగ్ 3) అర్థమెటిక్ లో నంబర్ సిరీస్, నంబర్ అనాలజీ, నంబర్ క్లాసిఫికేషన్ లాంటి అంశాలు ఉంటాయి. వీటిని ఎగ్జామ్ లో స్పీడ్ గా చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ముందు నుంచి బాగా పట్టు సాధించాలి. ఒక్కోసారి అభ్యర్థి తలరాతను ఇవే తిరగరాస్తాయి.

10) బేసిక్ ఇంగ్లీష్ ( ssc స్టాండర్డ్):

ఇది పదో తరగతి స్థాయిలో ఉంటుంది. ప్యాసేజీ ఇచ్చి ప్రశ్నలు అడగడం, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, యాక్టివ్, పాసివ్ వాయిస్, సమానార్థక, వ్యతిరేక పదాలు, సరైన పదాలు కూర్చడం లాంటివి ఉంటాయి. వీటిని కూడా ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి.

పేపర్ - 2 : చరిత్ర, రాజ్యాంగం, సమాజం

1) భారత, తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక చరిత్ర (50 మార్కులు)

2) భారత రాజ్యాంగం, సవాళ్ళు (50 మార్కులు)

3) సమాజ నిర్మితి, ప్రభుత్వ విధానాలు (50 మార్కులు)

1) భారత దేశ, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర:-

1) సింధు లోయ నాగరికత ప్రత్యేక లక్షణాలు: సమాజం, సంస్కృతి, తొలివేద, మలివేద నాగరికతలు, క్రీ.పూ.6వశతాబ్దంలో మత ఉద్యమాలు - జైన మతం, బౌద్ధ మతం, మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చాళుక్యుల సామాజిక, సాంస్కృతిక సేవలు, చోళుల కళలు, వాస్తు శిల్పం, హర్షుడు, రాజపుత్ర యుగం.

2) ఇస్లాం మత ప్రభావం : ఢిల్లీ సుల్తాన్ వంశ స్థాపన - ఢిల్లీ సూల్తానుల కాలంలో సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు - సూఫీ, భక్తి ఉద్యమాలు, మొగలులు : సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, భాష, సాహిత్యం, కళలు, వాస్తు శిల్పం, మరాఠాల సంస్కృతికి వారు చేసిన సేవలు, బహమనీ సూల్తానులు, విజయనగర సామ్రాజ్యంలో దక్కన్ సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు - సాహిత్యం, కళలు, వాస్తు శిల్పానికి విజయనగర రాజులు చేసిన సేవలు

3) యూరోపియన్ల ఆగమనం: బ్రిటీష్ పాలన ప్రారంభం, విస్తరణ, సామాజిక సాంస్కృతిక విధానాలు, కార్న్ వాలిస్, వెల్లస్లీ, విలియం బెంటింక్, డల్ హౌసీ, ఇతరులు - 19వ శతాబ్దంలో సామాజిక, మత సంస్కరణల ఉద్యమాలు, భారత దేశంలో సామాజిక నిరసన ఉద్యమాలు, జ్యోతిబా, సావిత్రి బాయి పూలే, అయ్యంకాళి, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, నాయకర్, గాంధీ, అంబేద్కర్ .

4) ప్రాచీన తెలంగాణలో సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు: శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినులు, ముదిగొండ, వేములవాడ, చాళుక్యులు, మతం, భాష, సాహిత్యం, కళ, వాస్తు శిల్పం, మధ్యయుగ తెలంగాణ - కాకతీయులు, రాచకొండ, దేవరకొండ వెలమల సేవలు. కుతుబ్ షాహీలు, సామాజిక సాంస్కృతిక అభివృద్ధి, ఉమ్మడి సంస్కృతి ఆవిర్భావం - పండగలు. వీటితో పాటు ఉత్సవాలు, జాతరలు, ఉర్సు, మొహర్రం తదితర అంశాలు.

5) అజఫ్ జాహీ వంశ స్థాపన : నిజాం ఉల్ ముల్క్ నుంచి చివరి నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ వరకూ చదవాలి. సాలార్ జంగ్ సంస్కరణలు, సామాజిక వ్యవస్థ, సామాజిక పరిస్థితులు, జాగార్ధారులు, జమీందారులు, దేశ్ ముఖ్ లు, దొరలు, వెట్టి, భగేలా వ్యవస్థలు. మహిళల స్థితిగతులు, తెలంగాణలో సాంఘిక, సాంస్కృతిక ఉద్యమాలకు సంబంధించిన ఆర్యసమాజం, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహిళా సభ, ఆది హిందూ ఉద్యమాలు, సాహిత్య, గ్రంథాలయ ఉద్యమాలు, గిరిజన, రైతుల తిరుగుబాట్లకు సంబంధించిన రాంజీ గోండు, కొమరం భీం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, పోలీస్ చర్య, నిజాం పరిపాలన ముగింపు అంశాలను సిలబస్ లో పేర్కొన్నారు.

మార్కులు ఎలా సంపాదించాలి ?

సిలబస్ లో రాజకీయ చారిత్రక అంశాల కంటే సామాజిక, సాంస్కృతిక చరిత్రకు ప్రాధాన్యత ఇచ్చారు. అంటే రాజవంశీయుల కాలల్లో రాజులు, యుద్ధాలు, సంధులు లాంటివి కాకుండా రాజుల కాలంలో నిర్మాణాలు, కళలు, సామాజిక, మత పరిస్థితులు లాంటి అంశాలపైనా దృష్టిపెట్టాలి.

సెక్షన్ - 2 భారత రాజ్యాంగం, పరిశీలన, సవాళ్ళు ( 50 మార్కులు )

గ్రూప్ ఎగ్జామ్ లో పాలిటీ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. పైగా జనరల్ స్టడీస్ లో కూడా ఇది మిళితమై ఉంటుంది. అందువల్ల సమకాలీన అంశాలను జోడీ చేస్తూ చదివితే రెండు విధాలా స్కోర్ చేయొచ్చు. రాజ్యాంగ ప్రకరణలపై తాజా సవరణలను చేరుస్తూ చదువుకోవాలి.

1) భారత రాజ్యాంగం క్రమపరిణామం - స్వభావం - ప్రధాన లక్షణాలు - ప్రవేశిక ప్రాధాన్యత

2) ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాలు - ప్రాథమిక విధులు

3) భారత సమాఖ్య ప్రధాన లక్షణాలు - కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసనపరమైన, పరిపాలనాపరమైన అధికారాల పంపిణీ

4) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధ్యక్షుడు, ప్రధానమంత్రి, మంత్రిమండలి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు- మంత్రిమండలి - అధికారాలు, విధులు

5) 73,74 రాజ్యాంగ సవరణలకు సంబంధించి గ్రామీణ మరియు పట్టణపాలన

6) ఎన్నికల వ్యవస్థ, స్వేచ్ఛాయుత ఎన్నికలు, అక్రమాలు, ఎన్నికల సంఘం, ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పార్టీలు

7) భారత దేశంలో న్యాయవ్యవస్థ - న్యాయవ్యవస్థ క్రియాశీలత

8) ఎ) ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనారిటీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు
బి) అమలు చేయడానికి సంక్షేమ వ్యవస్థ, ఎస్సీల జాతీయ కమిషన్, బీసీల జాతీయ కమిషన్

9) భారత రాజ్యాంగం నూతన సవాళ్ళు

సిలబస్ లో పేర్కొన్న ప్రతి అంశాన్ని తప్పనిసరిగా చదవాలి. భారత రాజ్యాంగంలోని ముఖ్య లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక విధులు-హక్కులు, ఆదేశిక సూత్రాలు, భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన, శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పాత్రలపై అధ్యయనం చేయాలి. ఎన్నికల వ్యవస్థ, ఎన్నికలు, అక్రమాలు, ఎన్నికల కమిషన్, ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పార్టీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, మైనార్టీలకు ప్రత్యేక సదుపాయాలు. జాతీయస్థాయిలో కమిషన్లు. ఇలా ప్రతి అంశాన్నీ కవర్ చేయాలి. సిలబస్ లో పేర్కొన్న అంశాలపైనే బాగా పట్టు సంపాదించాలి. రాజ్యాంగ సవరణలకు సంబంధించి 73,74 ఆర్టికల్స్ చాలా ముఖ్యం. పంచాయతీ రాజ్ వ్యవస్థ, నగరపాలక వ్యవస్థల గురించి తెలుసుకోవాలి.

ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు, వాటి ప్రాముఖ్యత, తేదీలు తెలుసుకోవాలి. రాజ్యాంగ పర సంస్థలైన యూపీఎస్సీ, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల కమిషన్లు... అవి ఎలా ఏర్పడ్డాయి, వాటి కాల వ్యవధి, మొదటి, ప్రస్తుత అధ్యక్షుల సమాచారం తెలుసుకోవాలి. ఇటీవల పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలు ఆమోదించిన బిల్లులు, వాటికి సంబంధించిన చట్టాలు, రాజ్యాంగ సవరణలు తెలియాలి. గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై అవగాహన ఉండాలి.

పరిపాలనలో కీలకమైన కలెక్టర్లు, విధులు, ప్రభుత్వ శాఖల సమాచారం తెలియాలి. రాజ్యాంగ వ్యవస్థల అధిపతులను తెలుసుకోవాలి. వీటికితోడు ఈసారి కొత్తగా భారత రాజ్యాంగం-సవాళ్ళు అనే అంశాన్ని చేర్చారు. వీటితోపాటు రాజ్యాంగ పరిషత్ ఎన్నికల విధానం, ముఖ్య కమిటీల అధ్యక్షులు, రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం లక్ష్యాల తీర్మానం, ముఖ్య షెడ్యూళ్ళు, కీలకమైన సుప్రీంకోర్టు తీర్పులు, రాష్ట్రపతి ఎన్నిక, రాజ్యసభ, విధానపరిషత్ ల ఎన్నికల విధానం, కేంద్ర- రాష్ట్ర సంబంధాలు, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, నిబంధనలు, సవరణలు, జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి లాంటి అంశాలపై దృష్టి పెట్టాలి.

సెక్షన్ - 3: సమాజ నిర్మితి ( సమాజ నిర్మితి - అంశాలు, సమస్యలు, ప్రభుత్వ విధానాలు)(50 మార్కులు)

1) భారత సాంఘిక నిర్మాణం: భారతీయ సమాజం - ప్రధాన లక్షణాలు - కులం, కుటుంబం, వివాహం, బంధుత్వం, మతం, తెగ, మహిళలు, తెలంగాణ సమాజంలో సామాజిక, సాంస్కృతిక లక్షణాలు

2) సామాజిక సమస్యలు: కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం, మహిళలపై హింస, బాల కార్మికులు, మనుషుల అక్రమ రవాణా, వికలాంగులు, వృద్ధులు తదితర అంశాలు.

3) సామాజిక ఉద్యమాలు: రైతుల ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు.

4) తెలంగాణ సాంఘీక సమస్యలు : వెట్టి, జోగిని, దేవదాసీ వ్యవస్థ, బాల కార్మికులు, బాలికల సమస్యలు, ఫ్లోరోసిస్, వలసలు, రైతులు - చేనేత కార్మికుల సమస్యలు.

5) సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, కార్మికులు, వికలాంగులు, చిన్నారులకు సంబంధించిన నిశ్చయాత్మక విధానాలు - సంక్షేమ కార్యక్రమాలు, ఉపాధి, పేదరిక నిర్మూలన, గ్రామీణ, పట్టణ, మహిళలు, చిన్నారులు, గిరిజనులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు.

ప్రభుత్వ అధికారిగా నియమితులయ్యే వారికి తన చుట్టూ ఉన్న సమాజం స్థితిగతులపై స్పష్టమైన అవగాహన ఉండాలన్న లక్ష్యంతో సిలబస్ ను రూపొందించారు. సమాజంలోని వివిధ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలు గురించి తెలుసుకోవాలి. సమాజ వికాసం, గ్రామీణ వికాసానికి సంబంధించిన కార్యక్రమాలపై అవగాహన పెంపొందించుకోవాలి. తెలగాణలో జిల్లాల వారీగా సమస్యల తెలుసుకొని వాటికి గల కారణాలు, పరిష్కారానికి ప్రభుత్వ చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలి.

పేపర్ - 3 : ( ఎకానమీ అండ్ డెవలప్ మెంట్ )

ఈ పేపర్ లో 3 విభాగాలు ఉన్నాయి. ఒక్కోదానికి 50 మార్కులు

1) భారత ఆర్థిక వ్యవస్థ - అంశాలు - సవాళ్ళు (50 మార్కులు)
2) తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి (50 మార్కులు)
3) అభివృద్ధి, మార్పు అంశాలు (50 మార్కులు)

1) భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ:

1) ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి భావనలు, వృద్ధి, అభివృద్ధి మధ్య సంబంధాలు

2) ఆర్థిక వృద్ధి కొలమానాలు, జాతీయాదాయ నిర్వచనాలు, భావనలు, జాతీయాదాయాన్ని లెక్కించే విధానం, నామినల్, వాస్తవ ఆదాయం తదితర అంశాలు

3) పేదలకు - నిరుద్యోగిత, ఆదాయ సంబంధిత పేదరికం, ఆదాయేతర సంబంధిత పేదరికం, పేదరికం లెక్కింపు విధానాలు, నిరుద్యోగం లెక్కించే విధానం మొదలైనవి.

4) భారత దేశ పంచవర్ష ప్రణాళికలు- లక్ష్యాలు, వ్యూహాలు, సాధించిన ప్రగతి, 12వ పంచవర్ష ప్రణాళిక - సమ్మిళిత వృద్ధి, నీతి ఆయోగ్

ఈ సెక్షన్ లో మంచి మార్కులు రావాలంటే జాతీయ ఆదాయ నిర్వచనాలు, భావనలు కీలకమైనవి. దీంతో పాటే జాతీయోత్పత్తి, నికర ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి భావనలు, స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి భావనలను అర్థం చేసుకోవాలి.  జాతీయ ఆదాయంతో పాటు వృద్ధి, అభివృద్ది భావనలు అధ్యయనం చేయాలి. వీటి మధ్య సంబంధాలు, కొలమానాలను విశ్లేషించాలి. వృద్ది, అభివృద్ధి కొలమానాలు అనగా, GNP,GDP, తలసరి ఆదాయం, తలసరి వినియోగం, మానవాభివృద్ధి సూచీలను అధ్యయనం చేయాలి.

- ప్రణాళికా సంఘాన్ని కేంద్రం రద్దు చేయగా దాని స్థానంలో నీతి ఆయోగ్ వచ్చింది. అయినప్పటికీ.. భారతదేశ అభివృద్ధిలో ప్రణాళికలు ముఖ్యపాత్ర పోషించాయి. ఇప్పటివరకూ అమలైన ప్రణాళికలు, లక్ష్యాలు, వ్యూహాలు, సాధించిన విజయాలు అధ్యయనం చేయాలి. 12వ పంచ వర్ష ప్రణాళికలో నిర్ణయించిన లక్ష్యాలు, సమ్మిళిత వృద్ధి సాధన, సమ్మిళిత వృద్ధి ద్వారా ఆర్థిక వృద్ధి ఎలా సాధించవచ్చు. అనే కోణంలో విశ్లేషించాలి. నీతి ఆయోగ్ నిర్మాణం, లక్ష్యాలు, విధులు, సభ్యులు, సమావేశాలు లాంటి వివరాలపై అవగాహన పెంచుకోవాలి.

సెక్షన్ 2 : ఎకానమీ అండ్ డెవలప్ మెంట్ ఆఫ్ తెలంగాణ:

1) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని (1956-2014) తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, వెనుకబాటుకి కారణాలు -జలాలు (బచావత్ ట్రిబ్యునల్), ఆర్థిక అంశాలు (లలిత్, భార్గవ, వాంఛూ కమిటీలు), ఉపాధి అంశాలు (జైభారత్ కమిటీ, గిర్ గ్లానీ కమిటీ) తదితర అంశాలపై ఏర్పాటు చేసిన కమిటీలు, సూచనలు

  1. తెలంగాణలో భూసంస్కరణలు, మధ్యవర్తుల తొలగింపు, జమీందారీ, జాగీర్దారీ, ఇనామ్ దారీ, కౌలు చట్టాల సంస్కరణలు, భూగరిష్ట పరిమితులు, ల్యాండ్ సీలింగ్, షెడ్యూల్ ఏరియాల్లో భూపరిమితులు తదితర అంశాలు చదవాలి.
  2. వ్యవసాయం అనుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవా రంగాలతో పాటు తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి అధ్యయనం చేయాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించిన పూర్తి అవగాహన అవసరం. రాష్ట్రంలోని ఏ జిల్లాల్లో ఏయే పంటలు ఎక్కువగా పండుతాయి ? గ్రామీణాభివృద్ధి పథకాలు ఏంటి ? నీటిపారుదల వ్యవస్థ తీరు తెన్నులు ఎలా ఉన్నాయి ? మెట్ట ప్రాంత వ్యవసాయం, సమస్యలు, రైతులకు పరపతి విధానం తెలుసుకోవాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ, సహకార రంగం, ప్రత్యామ్నాయ మార్గాలు, భూ సంస్కరణలు వాటి పరిణామాలు, ప్రణాళికల్లో రాష్ట్ర కేటాయింపులు, రాష్ట్ర ఆర్థిక పురోగతి నివేదికలు తదితర అంశాలు చదవి ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోవాలి.
  3. పరిశ్రమలు, సేవా రంగాలు: పారిశ్రామికాభివృద్ధి, పారిశ్రామిక రంగ తీర్మానం (టీఎస్ ఐపాస్), వృద్ధి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, పారిశ్రామిక ప్రాథమిక వసతుల రంగం, సేవారంగ నిర్మాణం, వృద్ధి మొదలైనవి.

సెక్షన్ 3: అభివృద్ధి, మార్పు- సమస్యలు:

  1. అభివృద్ధి డైనమిక్స్ : భారత దేశంలో ప్రాంతీయ అసమానతలు, సామాజిక అసమానతలు, కులం, తెగ, లింగం, మతం, వలస, పట్టణీకరణ
  2. అభివృద్ధి, పునరావాసం, భూసేకరణ విధానాలు, కొత్త చట్టాలు,
  3. ఆర్థిక సమస్యలు: వృద్ధి, పేదరికం, అసమానతలు, సామాజికాభివృద్ధి (విద్య, ఆరోగ్యం), సామాజిక మార్పు, సామాజిక భద్రత
  4. సుస్థిరాభివృద్ధి, భావన, లెక్కింపు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

తెలంగాణ ఎకానమీలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే 2015 చాలా ఉపయోగకరమైన పుస్తకం. చాలా వరకూ అంశాలు దాని నుంచే రాబోతున్నాయి.

పేపర్ - 4 ( తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం )

1) ఐడియా ఆఫ్ తెలంగాణ (1948-70):

హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రత్యేక సంస్కృతి, తెలంగాణ భౌగోళిక, సాంస్కృతిక, రాజకీయ దృక్కోణం, తెలంగాణ ప్రజలు, కులాలు, మతాలు, కళలు, పండగలు, హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన, సాలర్జంగ్ సంస్కరణలు, ముల్కీ నాన్ ముల్కీ వివాదాలు. ( ఇక్కడ 1948లో హైదరాబాద్ పై పోలీస్ చర్యతో ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. ఈ పోలీస్ చర్యలో కీలకవ్యక్తులుగా వ్యవహరించిన అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, హైదరాబాద్ ప్రధాని మీర్ లాయక్ అలీ, సైన్యంలో వివిధ స్థానాల్లో ఉన్న వ్యక్తులు గురించి అవగాహన పెంచుకోవాలి. ఆ సమయంలో పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాలు పాత్రలపైనా అవగాహన అవసరం.

- బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గం : 1952 ముల్కీ ఆందోళన : స్థానికులకు ఉద్యోగాల కోసం డిమాండ్ - సిటీ కాలేజీ ఘటన - దాని ప్రాముఖ్యత, 1953లో ఫజల్ అలీ కమీషన్, సిఫార్సులు తదితర అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు: 1956 ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం - ముఖ్యాంశాలు. ఈ ఒప్పందంలో తీర్మానాలు, ఈ ఒప్పందం ఆ తర్వాత ఎలా ఉల్లంఘించబడిందీ అనేన దానిపై దృష్టి పెట్టాలి. 1969లో మొదటి దశ తెలంగాణ ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు, ముఖ్యమైన సంఘటనలు, 8 సూత్రాలు, 5 సూత్రాలు గురించి విడి విడిగా అధ్యయనం చేయాలి. కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి వలసలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. 1970 తర్వాత వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్, విద్య, ఉద్యోగాలు, వైద్యం, ఆరోగ్య రంగాల్లో తెలంగాణకి జరిగిన అన్యాయాలపై స్టడీ చేయాలి. 1969లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు, జీవో 36, దాని ప్రభావం తెలుసుకోవాలి.

2) రెండో దశ... సమీకరణ (1971-90)

తెలంగాణ ఉద్యమంలో రెండో దశపై కాస్త ఎక్కువగానే దృష్టి పెట్టాలి. ఈ దశలో ఎన్నో కీలకఘట్టాలు జరిగాయి. 1972లో జై ఆంధ్ర ఉద్యమం, 1973లో రాష్ట్ర పతిపాలన, ఆరు సూత్రాల పథకం, తెలంగాణకు వ్యతిరేకంగా సాగిన చర్యలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ వ్యవస్థ ఏర్పాటు లాంటివి చదవాలి. ఆర్టికల్ 371డీ, రాష్ట్రపతి ఉత్తర్వులు, జీఓ 610 మూడింటిని ఒక దగ్గరగా చేర్చుకొని కంపారిజన్ చేసుకోవాలి. అలాగే నక్సలైట్ ఉద్యమం, భూస్వామ్య వ్యతిరేక పోరాటం, రైతు కూలీ సంఘాలు, గిరిజన భూముల ఆక్రమణ, ఆదివాసీల తిరుగుబాటు, జల్-జంగల్-జమీన్ నేపథ్యం తెలుసుకోవాలి. 1980ల్లో ప్రాంతీయ పార్టీలు, తెలంగాణలో సాంఘి, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మార్పులు, తెలంగాణ ఆస్తిత్వాన్ని అణచివేయడానికి జరిగిన కుట్రలు, భాషా సంస్కృతులపై జరిగిన దాడి లాంటివి అధ్యయనం చేయాలి. 1990ల్లో ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు, తెలంగాణ ప్రాంతంపై వాటి ప్రభావం, పెరిగిన ప్రాంతీయ అసమానతలు, తెలంగాణలో వ్యవసాయం, చేతి వృత్తుల రంగాల వారికి జరిగిన అన్యాయాలు, ఆర్థిక వ్యవస్థ, రియల్ఎస్టేట్ ప్రభావం లాంటి వాటిపై అవగాహన ఉండాలి. ఇదే సమయంలో తెలంగాణ అస్తిత్వం కోసం జరిగిన ప్రయత్నాలు, చర్చలపైనా స్టడీ చేయాలి.

3) మూడో దశ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం( 1990-2014):

గ్రూప్ అభ్యర్థులకు ఇది కీలకమైన విభాగం. ఈ దశపై పూర్తిగా పట్టు సాధించాలి. మనలో చాలామంది ఈ కాలంలో జరిగిన ఉద్యమాలను ప్రత్యక్షంగా చూసినవారే. అందుకే వీటిని గుర్తుంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ దశలో ఏర్పాటైన ముఖ్యమైన పార్టీలు, ప్రజా సంఘాల సమాచారం, వాటి నేపథ్యం తెలుసుకోవాలి. పౌర, ప్రజా సంఘాల పుట్టుకతో ప్రత్యేక తెలంగాణ అస్తిత్వ భావన, తెలంగాణ ఐక్యవేదిక, భువనగిరి సభ, తెలంగాణ జనసభ, తెలంగాణ మహా సభ, వరంగల్ ప్రకటన, తెలంగాణ విద్యార్థుల వేదిక లాంటి అంశాలపై ఫోకస్ చేయాలి.

2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులు అధ్యయనం చేయాలి. టీఆర్ఎస్ నిర్వహించిన పలు కార్యక్రమాలు, సభలు, సమావేశాలు వీటిల్లో పాల్గొన్న జాతీయ స్థాయి నేతలు గుర్తుంచుకోవాలి. అలాగే 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దారి తీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఓయూలో జరిగిన ఉద్యమం, తెలంగాణ కోసం బలిదానాలు, డిసెంబర్ 9 ప్రకటన, 23న దానికి వ్యతిరేక ప్రకటన లాంటివి ముఖ్యమైన అంశాలే. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు, టీడీపీ, ఎంఐఎం వ్యవహరించిన తీరు తెలుసుకోవాలి. ఇంకా సాంస్కృతిక పునరుజ్జీవనం, ధూమ్ ధామ్ కార్యక్రమం, సాహిత్యం, కళలు, కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మహిళల పాత్ర కూడా తెలుసుకోవాలి. తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడంలో పొలిటికల్ జేఏసీ పాత్ర, ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ, సకల జనుల సమ్మె, సాగర హారం, మిలియన్ మార్చ్, పల్లె పల్లె పట్టాల పైకి, సడక్ బంద్ లాంటి ఉద్యమ కార్యక్రమాలు, ఆ సందర్భంలో జరిగిన పర్యవసానాలపై అవగాహన ఉండాలి.

దీంతోపాటు గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీల గురించి తెలుసుకోవాలి. లలితకుమార్ కిటీ (1969), భార్గవ, వాంఛూ కమిటీ (1969), భరత్ రెడ్డి కమిటీ (1985), 610 జీవో (1985), గిర్ గ్లానీ కమిటీ (2001), ప్రణబ్ ముఖర్జీ కమిటీ (2005), శ్రీ కృష్ణ కమిటీ (2010) వాటి సిఫార్సులు, అమలు జరిగిన విధానం స్పష్టంగా తెలిసి ఉండాలి. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులపై 2011 మార్చి 23న హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎ.నరసింహా రెడ్డి ఇచ్చిన తీర్పు చదవాలి.

తెలంగాణ ఆవిర్బావం దిశగా:

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల తర్వాత తెలంగాణ ఏర్పాటు దిశగా సాగిన పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది. 2013జులై1న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటన, ఆగస్ట్ 6న విభజన కమిటీ, ఏకే ఆంటోనీ ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటును చదవాలి. ఏపీ అసెంబ్లీలో బిల్లు, లోక్ సభ, రాజ్యసభ ఆమోదం, గెజిట్ విడుదల, ఆవిర్భావ ప్రకటన తేదీ, ఆవిర్భావం లాంటి క్రమానుగతంగా చదువుకుంటూ వెళ్ళాలి. ఆతర్వాత 2014 లో వచ్చిన ఎన్నికలు, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం, ఆయన మంత్రి వర్గం వరకూ చదువుకోవాలి.

 

Hey! Checkout this amazing course TARGET GROUP 2 (TSPSC) - 4 PAPERS- TM TEST SERIES + MENTORSHIP VIDEOS, LIVE INTERACTIONS by Telangana Exams Plus.
Click to Buy now! http://payments.course-today.com?token=eyJjb3Vyc2VJZCI6NjIxNDUsInR1dG9ySWQiOjEzOTcxNCwib3JnSWQiOjEyMjM1LCJjYXRlZ29yeUlkIjpudWxsfQ==