Tuesday, December 1

GROUP 1 REFERENCE BOOKS గ్రూప్ 1 రిఫరెన్స్ బుక్స్ ( Vedio Class Script)

( ఈ స్క్రిప్ట్ చదవడానికి ముందు యూట్యూబ్ క్లాస్ వినండి... మంచిగా అర్థం అవుతుంది )

TSPSC గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వడానికి ఎలాంటి బుక్స్ చదవాలో మీకు వివరిస్తాను.  అయితే రిఫరెన్స్ బుక్స్ లిస్ట్ అయితే ఇస్తాను గానీ... ఇంతకంటే మంచి బుక్స్... మీకు దొరికితే వాటినే కొనుక్కోండి.  అంతే కాదు... ఇప్పటికే మీరు బుక్స్ కొనుక్కొని ఉంటే... వాటినే కంటిన్యూ చేయండి.... తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఇంకా బెటర్.

అంటే... మీకు కావల్సిన గ్రూప్ 1 బుక్స్... మీ అంతట మీరే సెలక్ట్ చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం.  చాలామంది చాలా బుక్స్ సజెస్ట్ చేస్తారు.  అవన్నీ మీరు కొనుక్కోవాలంటే కష్టం.  పైగా అన్ని పుస్తకాలు చదివినంత మాత్రాన ఉపయోగం కూడా లేదు.  ఎక్కువ పుస్తకాలు కొనుక్కొని... ఎక్కువ పుస్తకాలు చదివి అనవసరంగా టైమ్ వేస్ట్ చేసుకోవద్దు...

అయితే చాలామంది కొత్త వాళ్ళు గ్రూప్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నట్టు మెస్సేజ్ లు పెడుతున్నారు.  బుక్స్ గ్రూప్ 1 నుంచి 4 వరకూ పనికొచ్చేలా మంచి బుక్స్ సజెస్ట్ చేయమని అడుగుతున్నారు.  నేను గతంతో గ్రూప్స్ బుక్స్ కి సంబంధించి ఓ వీడియో క్లాస్ ఇచ్చాను.  దాని లింక్ ను ఈ కింది వీడియో description లో ఇచ్చాను. చూడండి...

కేవలం గ్రూప్ 1 కి ఎలాంటి బుక్స్, ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి... అన్నది నాకు తెలిసిన నాలెడ్జ్ మేరకు... మా నిపుణుల సలహాలతో మాత్రమే ఈ క్లాస్ ఇస్తున్నాను.

గ్రూప్ 1 రిఫరెన్స్ బుక్స్ గురించి చెప్పుకునే ముందు బ్రీఫ్ గా మీకు కొన్ని విషయాలు చెబుతాను.  మీరు ప్రతి రోజూ బుక్స్ నుంచి నోట్స్ రాసుకోవడం మర్చి పోవద్దు.  అలాగే దినపత్రికల నుంచి కరెంట్ ఎఫైర్స్ ఫాలో అవ్వాలి... అవసరమైతే నోట్స్ రాసుకోవాలి...

ఈ నోట్స్ అనేది టాపిక్ వైజ్ గా  ఉండాలి... క్విక్ గా అర్థమయ్యేలా... సూక్ష్మంగా ... మరోసారి చదవితే మొత్తం ఆ టాపిక్ అర్థమయ్యేలా ... crisp గా రాసుకోండి... ఒకటికి పది సార్లు చెబుతున్నా... గ్రూప్ 1 లేదా 2 అభ్యర్థులు మస్ట్ గా నోట్స్ రాయాల్సిందే.

ఏ4 తెల్లకాగితాలు తీసుకోండి... నీట్ గా రాసుకోండి... ముఖ్యంగా పాయింట్స్ బుల్లెట్స్ వైజ్ గా టాపిక్స్ రాసుకోండి... అవసరమైన చోట ఈజీగా అర్థమయ్యేలా... డయాగ్రామ్స్, ఛార్ట్స్ వేసుకోండి...

నోట్స్ రాసుకునేముందు ఏది రాసుకోవాలి... అనే కన్ఫూజన్ లో ఉన్నట్టు కొందరు మెస్సేజ్ లు పెట్టారు. అసలు మీరు నోట్స్ రాసే ముందు... ఆ టాపిక్ లేదా లెసన్ పూర్తిగా చదవండి... మనం ఏం చదివాం... ఇందులో ఏది ఇంపార్టెంట్ అనేది... ఒకసారి మనసులో మననం చేసుకోండి... అప్పుడు మీకు కొంత ఐడియా వస్తుంది...

నోట్స్ రాసేదాని కంటే ముందు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే...

ఒక్కసారి మీరు గ్రూప్ 1 పాత ఎగ్జామ్ పేపర్స్ రిఫర్ చేయండి... మీకు బయట బుక్స్ కూడా దొరుకుతాయి... తీసుకోండి... త్వరలో మన ప్రిలిమినరీ, మెయిన్స్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందీ... మన యూట్యూబ్ క్లాసులతో పాటు... తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ లో ప్రీవియస్ క్వొశ్చన్ పేపర్స్ పోస్ట్ చేస్తాను.

మీకు ముందు క్లాసులోనే చెప్పాను... గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ముందు నుంచి రైటింగ్ ప్రాక్టీస్ చేయండి... మీరు రాసుకున్న నోట్స్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోండి... ప్రతి రోజూ న్యూస్ పేపర్స్, మేగజైన్స్ ఫాలో అవుతూ మీ నోట్స్ ని అప్ డేట్ చేసుకోండి...

ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు  ప్రతి రోజూ ఫాలో అవ్వండి... అన్నీ చివర్లో చూసుకునే సంప్రదాయానికి చెక్ చెప్పండి... అప్పుడే మీరు గ్రూప్ 1 యే... ఏదైనా సాధించవచ్చు.

జనరల్ స్టడీస్  లో కరెంట్ ఎఫైర్స్, అండ్ కరెంట్ ఈవెంట్స్ కోసం...

 • రోజువారీ దినపత్రికలు
 • యోజన తెలుగు మేగజైన్...ఇది మస్ట్ గా తెచ్చుకోండి...
 • తెలంగాణ మేగజైన్... ఇది ప్రభుత్వ సమాచార శాఖ ఆధ్వర్యంలో వస్తోంది... ఇందులో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు కవర్ అవుతాయి... ఇది ఇంటర్నెట్ ఎడిషన్ కూడా దొరుకుతుంది...
 • ఏదైనా మంత్లీ మేగజైన్...
 • ఇండియా 2019 ( కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖ ఆధ్వర్యంలో ప్రచురితం అవుతుంది... ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకాలు... సంక్షేమ కార్యక్రమాలు... వాటికి కేటాయించిన బడ్జెట్ లు ఉంటాయి... ఇది మీకు అమెజాన్ లో కూడా దొరుకుతుంది. )
 • తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ ఇచ్చే రోజువారీ కరెంట్ ఎఫైర్స్...
 • జీకే టుడే వెబ్ సైట్
 • అలాగే Affairs Cloud for competitive exams వెబ్ సైట్స్ చూస్తే సరిపోతుంది...
 • ఇవి కాకుండా మనోరమ ఇయర్ బుక్ లాంటిది ఉంటే... జీకే కూడా కవర్ అవుతుంది.
 • డైలీ పేపర్స్ నుంచి కొంతమందికి నోట్స్ రాసుకోవడం అలవాటు... ఒకే... ఇది కూడా గుడ్ హాబిట్... ఒక్కో టాపిక్ ను పాయింట్స్ వైజ్ గా రాసుకోండి...
 • ఇలా కరెంట్ ఎఫైర్స్ నోట్స్ రాసుకుంటే... అన్ని సబ్జెక్టులకు కూడా పనికొస్తుంది.

POLITY – భారతర రాజ్యాంగ, పరిపాలనకు సంబంధించి...

 • తెలుగు అకాడమీలో మంచి పుస్తకాలు ఉన్నాయి...
 • బీఏ రాజనీతి శాస్త్రం – సెకండియర్ బుక్ భారత ప్రభుత్వం రాజకీయాలు
 • బీఏ ప్రభుత్వ పాలన సెకండియర్ బుక్ – భారత దేశ పాలన
 • బీఏ ఫైనల్ ఇయర్ – ప్రభుత్వ పాలన శాస్త్రం,
 • లక్ష్మీ కాంత్ ఇండియన్ పాలిటీ బుక్
 • పాలిటీ అండ్ గవర్నెన్స్ లక్ష్మీ కాంత్
 • NCERT BOOKS
 • బి. క్రిష్ణారెడ్డి పాలిటీ బుక్ కూడా బాగుంది. .

INDIAN HISTORY – భారత దేశ చరిత్ర

 • Ancient History – RS Sharma
 • Medieval History – Sathish Chandra
 • Modern History – Bipin Chandra
 • అలాగే ఆధునిక భారత దేశ చరిత్రకి సంబంధించి శీనయ్యసార్ బుక్ కూడా బాగుండి.
 • NCERT Books

TELANGANA HISTORY – తెలంగాణ చరిత్ర...

 • Telugu Academy Intermediate Books
 • Telangana Movement and State formation – Telugu Academy
 • వి ప్రకాష్ రాసిన బుక్ గ్రూప్ 1 purpose లో బాగుంటుంది... మెయిన్స్ కి కూడా బాగా పనికివస్తుంది.

SOCIETY

 • Telugu Academy తో పాటు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ బుక్స్ ఉన్నాయి. అంబేద్కర్ వర్సిటీవి అయితే మీకు సెకండ్ హ్యాండ్ వి కూడా దొరుకుతాయి.
 • కొంత మంది విన్నర్ పబ్లిషర్స్ బుక్స్ ... సొసైటీకి సంబంధించి బాగున్నట్టు చెప్పారు తీసుకోవచ్చు.

INDIAN ECONOMY

 • NCERT బాగున్నాయి... ఇంగ్లీష్ మీడియం వాళ్ళు... ఇంగ్లీష్ అర్థం చేసుకునే వాళ్ళు ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి NCERT బుక్స్ ఫాలో అయితే బెటర్. ఇవి కొనక్కర్లేదు... web site నుంచి డౌన్లోడ్ చేసుకోండి...
 • ఎకనామిక్స్ లో తెలుగు అకాడమీ బుక్స్ బాగానే ఉన్నాయి... లేటెస్ట్ ఎడిషన్స్ తీసుకోండి...

TELANGANA ECONOMY

 • Telugu Academy లేటెస్ట్ ఎడిషన్స్ తో పాటు
 • Telangana Socio Economic outlook

TELANGANA MOVEMENT AND STATE FORMATION

 • Telugu Academy బుక్స్ తో పాటు
 • సయీద్ సిరీస్ బుక్స్
 • Telangana History (1948-2014) – V.Prakash

ENVIRONMENT

 • DISASTER MANAGEMENT – CBSE TEXT BOOKS బాగున్నాయి.
 • ఇవి కాకుండా ఇంకా ఏమైనా పుస్తకాలు ఉన్నాయోమే చూడండి

ఆప్టిట్యూట్ అండ్ లాజికల్ రీజనింగ్ బుక్స్ కి సంబంధించి

 • ఆర్ఎస్ అగర్వాల్ కు మించిన బుక్ లేదు... ఇంగ్లీష్ మీడియం వాళ్ళు... లేదంటే ఇంగ్లీష్ లో కూడా చేసుకోగలను అనుకుంటే... స్టాఫ్ సెలక్షన్ కమిషన్; POS, బ్యాంక్స్ ఎగ్జామ్స్ అన్నింటీకీ పనికొచ్చేలా ఉన్న కిరణ్ సిరీస్ బాగున్నాయి... కిరణ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కేరీర్ ఎక్స్ లెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీ వారి తరపున వచ్చిన బుక్ ఇది.
 • రోజువారీ ప్రాక్టీస్ మస్ట్ గా చేయాలి

SCIENCE

 • Basic Concepts – NCERT
 • ముఖ్యంగా 6 టు టెన్త్ బుక్స్ చాలా బెటర్...
 • ఇవి కూడా అకాడమీ బుక్స్ బాగున్నాయి... ఇంగ్లీష్ మీడియంలో కూడా బుక్స్ వచ్చాయి... మిత్రులు ఆదే సత్యనారాయణ గారు రాసిన టెక్నాలజీ బుక్ బాగుంది...
 • విన్నర్ పబ్లికేషన్స్ కూడా ఓకే

GEOGRAPHY

 • Physical Geography – GC Leong
 • NCERT BOOKS
 • ఇటు 6 నుంచి 10 తరగతి వరకూ టెక్ట్స్ బుక్స్ బెటర్
 • ఈ బుక్స్ ఐడియా నాకు తెలసినవి... నిపుణులు, గతంలో విజేతలు అయిన వారిని అడిగి మాత్రమే ఇచ్చాను. వీటిల్లో నుంచే ప్రశ్నలు వస్తాయని గ్యారంటీ లేదు...

మీకు చివరగా మరోసారి చెబుతున్నాను.  ఎక్కువ పుస్తకాలు కొని టైమ్ వేస్ట్ చేసుకోవద్దు... మీ దగ్గరున్న బుక్స్ కి ఒకటి, రెండు యాడ్ చేసుకోండి... పుస్తకాలన్నీ మార్చే ప్రయత్నం చేయొద్దు. అంతేకాదు... మీకు నేను సజెస్ట్ చేసిన దానికన్నా... ఇంకా మంచి పుస్తకాలు ఉన్నాయని భావిస్తే అవే కొనుక్కోండి... ఎవరి ఒపీనియన్ వారిది...

టోటల్ గా మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలంటే... వీటన్నింటికంటే... తెలుగు అకాడమీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్  దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన బుక్స్ తో పాటు, ఇంటర్, డిగ్రీ బుక్స్... అలాగే  ఆరు నుంచి పదో తరగతి పుస్తకాలు కొనుక్కోండి...

NCERT బుక్స్ అయితే చాలా చాలా బాగున్నాయి... మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళయినా... లేదా ఇంగ్లీష్ అర్థం అవుతుంది అనుకుంటే... వాటినే తీసుకోండి.  NCERT బుక్స్ గానీ... ఇటు స్టేట్ బుక్స్ గానీ... మీరు వెబ్ సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి... కొనుక్కోవాల్సిన అవసరం లేదు.

ఇది గ్రూప్ 1 కి సంబంధించి బుక్స్ క్లాస్...

మనం నెక్ట్స్ క్లాసులో ఏయే టాపిక్స్ ని ఎలా ఎత్తుకోవాలి... ఎలాంటి సొల్యూషన్ చూపించవచ్చు... అసలు గ్రూప్ 1లో ఏ టాపిక్స్ వచ్చే అవకాశం ఉంది అన్న దానిపై నెక్ట్స్ క్లాస్ లో వివరిస్తాను.

Please subscribe Telangana Exams Youtube Channel

And download Telangana Exams android app from google play store.

This is

M.Vishnu Kumar

Senior Journalist & Content Writer

Hyderabad