Tuesday, November 13
Log In

గ్రూప్ – 2 ఇంటర్వ్యూలకి లైన్ క్లియర్

తెలంగాణ గ్రూప్-2 ఇంటర్వ్యూ లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో గ్రూప్-2 ఎగ్జామ్ లో వైట్నర్, డబుల్ బబ్లింగ్ చేసిన వారిని ఇంటర్వ్యూ లను నుంచి తొలగించాలని ఆదేశించింది. గ్రూప్- 2 పరీక్షల్లో 3,147 మంది సెలక్ట్ అయ్యారు. వీళ్ళల్లో వైట్నర్,డబుల్ బబ్లింగ్ చేసిన 267 మందిని తొలగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 1:2 పద్ధతిలో గ్రూప్ -2 లో సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో TSPSC తదుపరి చర్యలు చేపట్టనుంది.

2016 నవంబర్ 11, 13 తేదీల్లో గ్రూప్ - 2 ఎగ్జామ్ జరిగింది. 2016 సెప్టెంబర్ లో 1032 పోస్టులకు tspsc నోటిఫికేషన్ విడుదల చేసింది.