Tuesday, November 13
Log In

గ్రూప్ -2 మెరిట్ జాబితాకి మరింత ఆలస్యం !

గ్రూప్ - 2 మెరిట్ జాబితా తయారు చేయడానికి మరో 3 వారాల టైమ్ పట్టే అవకాశాలున్నాయి. హైకోర్టు తుది తీర్పు తర్వాత అభ్యర్థుల జాబితాను మళ్ళీ తయారు చేయాల్సి ఉంది. తొలగించిన 19 ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నించిన వారిని గుర్తించి వారికి అదనంగా మార్కులు కలుపుతారు. ఆ తర్వాతే 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాని tspsc తయారు చేయనుంది. OMR లో వ్యక్తిగత వివరాలు తప్పుగా పేర్కొన్న వారిని ఈ జాబితా నుంచి తొలగిస్తారు. వైట్ నర్ వాడిన వారిని దిద్దుబాట్లు చేసిన వారిని కూడా జాబితా నుంచి తొలగిస్తారు. అంటే మళ్ళీ కొత్తగా 275 మందికి జాబితాలో చోటు దక్కే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాలకనుగుణంగా 1:3 నిష్పత్తిలో తుది జాబితా తయారు చేయడానికి 3,148 మంది అభ్యర్థులకు చెందిన 12,595 OMR షీట్స్ ను నిపుణుల కమిటీ వ్యక్తిగతంగా పరిశీలన చేయాల్సి ఉంది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం సాధారణ అభ్యర్థులను 1:3 రేషియోలో, దివ్యాంగులను 1:5 రేషియోలో పిలవాల్సి ఉంటుంది. గ్రూప్ - 2 జాబితా ఇప్పటికే వెలువడిందని వస్తున్న వదంతులను నమ్మొద్దని TSPSC కార్యదర్శి వాణి ప్రసాద్ తెలిపారు.