Monday, December 17

గ్రూప్ – 2 షెడ్యూల్ కోసం ధర్నా (With Video)

TSPSC గ్రూప్ -2 ఇంటర్వ్యూలకు షెడ్యూల్ ను వెంటనే రిలీజ్ చేయాలని గ్రూప్ 2 సెలెక్టెడ్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా తమకు న్యాయం చేసి ఆదుకోవాలని హైదరాబాద్ నాంపల్లి లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ముందు ముందు శాంతియుతంగా ధర్నా చేశారు. గ్రూప్ 2 కేసులో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఇప్పటికి నెల రోజులు గడిచినా... TSPSC నుంచి ఎలాంటి కదలిక లేదని ఆరోపించారు. రెండేళ్ళుగా మూడు వేల మంది అభ్యర్థులు మానసిక వేదనకు గురవుతున్నామని అన్నారు. ఎలాంటి టైమ్ వేస్ట్ చేయకుండా గ్రూప్ 2 నియామక ప్రక్రియ చేపట్టాలని కోరారు. 1:2 నిష్పత్తి ప్రకారం ఇంటర్వ్యూ షెడ్యూల్ తేదీలు ప్రకటించి ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు గ్రూప్ 2 సెలెక్టడ్ అభ్యర్థులు.

గ్రూప్ 2 అభ్యర్థుల ధర్నా విజువల్స్