Tuesday, November 13
Log In

హడావిడిగా పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్…! సడన్ గా ఎగ్జామ్ డేట్ !!

కొండంత సిలబస్ - నెగిటివ్ మార్కింగ్ విధానం

అధికారుల తొందరపాటుతో సర్కార్ కీ ఇబ్బందులు

జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామకాల విషయంలో అధికారులు మొదటి నుంచి ప్రదర్శిస్తున్న తొందరపాటుతనం నిరుద్యోగ అభ్యర్థులకు క్షోభ మిగులుస్తోంది. రాష్ట్రంలో కొత్త జోన్స్ కి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగానే.. హడావిడిగా 9,355 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు. ఈ హడావిడిలో తమ వెబ్ సైట్ పేరు కూడా తప్పుగా ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. దాంతో మీడియాతో పాటు అభ్యర్థులు కూడా ఆ తప్పు వెబ్ సైట్ పేరుతో వెతికి గందరగోళంలో పడ్డారు. తెల్లారి దినపత్రికల్లోనూ వెబ్ సైట్ పేర్లు తప్పుగా ప్రచురితం అయ్యాయి. సోషల్ మీడియాలో అభ్యర్థులు గగ్గోలు పెట్టారు. చివరకు వెబ్ సైట్ అడ్రస్ దొరికింది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తెల్లారి సాయంత్రం తర్వాత వాటి వివరాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు.

గతంలో ఏ ఎగ్జామ్ కీ లేనివిధంగా.... కనీసం tspsc కూడా అమలు చేయని నెగిటివ్ మార్క్ నిబందన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ కి అమల్లోకి తెచ్చారు అధికారులు. tspsc విడుదల చేసిన ఏ నోటిఫికేషన్లలోనూ ఇలాంటి విధానం అమలు కాలేదు. పంచాయతీ రాజ్ అధికారులు మాత్రం... రైల్వే బోర్డు, సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ మెంట్ సంస్థలను అనుసరించి ఈ కొత్తనిబంధన అమల్లోకి తెచ్చారు.

ఇక చివరి మూడు రోజుల నుంచి పంచాయతీ కార్యదర్శికి అప్లయ్ చేసే వెబ్ సైట్ పనిచేయలేదు. రాష్ట్రంలో డిగ్రీ స్థాయిలో ఉన్న ప్రతి నోటిఫికేషన్ కి 6,7 లక్షల మంది పోటీ పడుతున్నా... కేవలం 3 లక్షల మంది అప్లయ్ చేయగానే వెబ్ సైట్ మొరాయించింది. నిరుద్యోగ అభ్యర్థులు గగ్గోలు పెట్టడంతో చివరికి లాస్ట్ డేట్ పొడిగించారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా...జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్ డేట్ విషయంలోనూ మరోసారి గందరగోళం ఏర్పడింది. మొదట సెప్టెంబర్ 28 అంటే ఈ నెలలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ రాసిన లేఖ బయటకు వచ్చింది. ఆ తర్వాత కొద్ది సేపటికే అక్టోబర్ 28 డేట్ తో మరో లెటర్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇందులో ఏది నిజం... ఏది అబద్దమో తెలియక నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు. ఆ తెల్లారి రెండు దినపత్రికల్లో సెప్టెంబర్, అక్టోబర్ ... రెండు డేట్స్ తో వార్తలు ప్రచురితం అయ్యాయి. దాంతో పంచాయతీ రాజ్ శాఖ అధికారుల దగ్గర telangana exams క్లారిటీ తీసుకొని... డేట్ సెప్టెంబర్ 28గానే నిర్దారణ చేసింది.

ఇప్పటి వరకూ tspsc లేదా రాష్ట్రంలోని ఇతర నియామక సంస్థలు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా... అప్లికేషన్ చివరితేదీ తర్వాత ఎగ్జామ్ నిర్వహణకు 45 రోజుల టైమ్ ఇచ్చాయి. కానీ పంచాయతీ రాజ్ అధికారులు ఇచ్చిన టైమ్ కేవలం 20 రోజులు. లక్షల మంది కాంపిటీషన్ ఉన్న ఈ ఎగ్జామ్ ని 20 రోజుల్లో రాయడం ఎవరికి సాధ్యమవుతుందో అర్థం కావడం లేదు.

నోటిఫికేషన్లు రిలీజైన PC/VRO/GR.IV/SI ఎగ్జామ్స్ కీ... ఇప్పుడు రిలీజ్ చేసిన జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శి పరీక్షకి జనరల్ స్టడీస్ కామన్ గా ఉంది. అందువల్ల ఈ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు జనరల్ స్టడీస్ బాగానే రాయడానికి ఛాన్స్ ఉంది. కానీ సెకండ్ పేపర్ లో ఉన్న 10 టాపిక్స్ అర్థం చేసుకొని చదవడానికే కనీసం నెల రోజులు టైమ్ పడుతుందని అంటున్నారు నిరుద్యోగ అభ్యర్థులు. పైగా ఇప్పటి వరకూ చదివిన వాటిల్లో కాకుండా కొత్త సిలబస్ కావడంతో చాలామందికి ఈ విషయంలోనే గందరగోళం నెలకొంది. అటు మార్కెట్లో కూడా పుస్తకాల కొరత ఉంది. పైగా నెగటివ్ మార్కుల బూచీ పొంచి ఉంది.

ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అనేక విమర్శలున్నాయి. తక్కువ కొలువులు భర్తీ చేశారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ రద్దు కాకుంటే... కొత్త జోన్స్ ప్రకారం గ్రూప్ - 1, గ్రూప్ - 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా పడతాయని భావించారు. ఇంకా 15వేల పోస్టులకు నోటిఫికేషన్లు వస్తాయని లీకులు కూడా వచ్చాయి. దాంతో ఎప్పటి నుంచో గ్రూప్ - 1 కొలువులపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు చాలామంది తాము చేస్తున్న చిరు, ప్రైవేటు ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ.. ప్రిపేర్ అవుదాం అనుకున్నారు. తీరా అసెంబ్లీ రద్దవడంతో నిరుద్యోగుల ఆశలు అడియాసలు అయ్యాయి.

ఇంత నిరాశలోనూ ... జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఏకంగా 9వేలకు పైగా పోస్టులు పడటంతో నిరుద్యోగ అభ్యర్థులు కొంత ఊరట కలిగించింది. కానీ ఎగ్జామ్ కి 20 రోజులే టైమ్ ఇవ్వడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నాలుగేళ్ళుగా సర్కారీ కొలువుల కోసం ఎదురు చూస్తున్న తమకు ... అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి పెట్టి గందరగోళంలో పడేశారని అంటున్నారు. పైగా ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన కొద్దిపాటి అవకాశాన్ని పంచాయతీ రాజ్ అధికారులు నీరు గారుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. (చాలామంది అభ్యర్థులు telanganaexams.com నెంబర్ కి కాల్ చేసి తమ ఆవేదన చెప్పారు )

ఒకే రోజు మూడు ఎగ్జామ్స్

సాధారణంగా ఏదైనా ఎగ్జామ్ డేట్ ప్రకటించే ముందు... వేరే ఏదైనా రిక్రూట్ మెంట్ సంస్థ ఎగ్జామ్ డేట్ ప్రకటించిందా... లేదా... అన్నది చూసుకుంటారు. కానీ పంచాయతీ రాజ్ అధికారులు అక్టోబర్ 4 న డేట్ ప్రకటించడానికి ఎలాంటి ప్రిపరేషన్ చేయలేదనిపిస్తోంది. దాంతో PGT తో పాటు RRB గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్న రోజునే జూనియర్ పంచాయతీ రాజ్ ఎగ్జామ్ కూడా జరగబోతోంది. అంటే అభ్యర్థి ఒక ఎగ్జామ్ రాయాలంటే రెండు పరీక్షలు వదులుకోవాల్సిందే.

పంచాయతీ రాజ్ శాఖ నిర్ణయంపై ఓయూలో ధర్నా, ర్యాలీలు జరుగుతున్నాయి. అక్టోబర్ 4న గురుకుల పిజిటి పరీక్ష ఉన్నందున, అదే రోజు RRB ఇతర కేంద్ర ప్రభుత్వ పరీక్షలు ఉండటంతో వీటిన్నింటికీ దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఏ పరీక్ష రాయలో తెలియక అయోమయంలో ఉన్నారంటున్నారు. నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదనను ముఖ్యమంత్రి కెసిఆర్ అర్థం చేసుకోని పరీక్ష వాయిదాపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కనీసం ఎగ్జామ్ రాసుకోడానికి 45 రోజులు టైమ్ ఇవ్వాలని అడుగుతున్నారు నిరుద్యోగులు.

==============

ఫ్రెండ్స్
మన తెలంగాణ ఎగ్జామ్స్ website & app ఇంకా చాలామందికి చేరాలి. రాష్ట్రంలో చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. తెలుగులో అందుబాటులో ఉండాలని మనం website & app తీసుకొచ్చాం. దాదాపు లక్ష మంది మన యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. అందుకే మన ఫాలోవర్స్ నాకో హెల్ప్ చేయాలి. ఈ కింది యాప్ లింక్ ను ఓపిక చేసుకొని మీ whatsapp, telegram, Face book లాంటి సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి చేరేలా చూడగలరు. దాంతో చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది.
https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams