Tuesday, November 13
Log In

పంచాయతీ కార్యదర్శికి ఏం చదవాలి ? మొదటి పేపర్ ఏ టాపిక్ కి ఎన్ని మార్కులు ?

జూనియర్ పంచాయతీ అధికారి ఎంట్రన్స్ కి రెండు పేపర్లు ఉంటాయని మీకు తెలుసు. మొదటి పేపర్ లో ఏ విభాగానికి ఎన్ని మార్కులు వస్తాయన్న (expected) విశ్లేషణ ఇప్పుడు చూద్దాం.

వర్తమాన అంశాలు అంటే కరెంట్ ఎఫైర్స్...

ఈ విభాగంలో ఎగ్జామ్ డేట్ కి ఆరు నెలల నుంచి ఏడాది వరకూ జరిగిన సంఘటనలపై ప్రశ్నలు వస్తాయి. ఇందులో భాగంగా మీరు ప్రతి రోజూ www.telanganaexams.com లో వచ్చే కరెంట్ ఎఫైర్స్ ఫాలో అవ్వాలి. దీంతో పాటు జనరల్ నాలెడ్జ్ లో అదనపు సమాచారం ఇస్తున్నాం. పాయింట్స్ రూపంలో ఉన్న వాటిని కూడా చదివితే మీరు స్టేట్ మెంట్స్ రూపంలో ఇచ్చినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ ఎఫైర్స్ విభాగం నుంచి 10 నుంచి 15 ప్రశ్నలు వచ్చే అవకాశముంది.

జనరల్ సైన్స్:

ఈ విభాగంలో నిత్య జీవితానికి పనికొచ్చే బిట్స్ ఉంటాయి. అంతే వచ్చే ప్రశ్న మన డైలీ లైఫ్ లో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది. వీటిని ఫాలో అవ్వాలంటే... తప్పనిసరిగా 8,9,10 తరగతుల పాఠ్య పుస్తకాలు చదివితే బెటర్. ఈ విభాగంలో కూడా 10 నుంచి 15 ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది.

పర్యావరణం - విపత్తుల నిర్వహణ:

ఇది మనం పాఠ్యపుస్తకాల్లో నేర్చుకోని అంశం. అయినప్పటికీ... ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ తప్పనిసరిగా వీటిపై అవగాహన ఉండాలని ఈ టాపిక్స్ ను ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఇస్తున్నారు. వీటిల్లో అగ్నిప్రమాదాలు, తుఫాన్లు, వరదలు లాంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అలాగే జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో విపత్తుల నిర్వహణ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది. ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించాలన్నది తెలుసుకోవాలి. 5-8 ప్రశ్నలు రావొచ్చు.

భారత, తెలంగాణ భౌగోళిక అంశాలు, ఆర్థిక వ్యవస్థ:

భౌగోళిక అంశాల్లో ఉనికి, శీతోష్ణస్థితి, పర్వతాలు, నదులు, నేలలు వ్యవసాయ పంటలు, అడవులు, వన్యమృగ సంరక్షణా కేంద్రాలు, జాతీయ పార్కులు, ఖనిజాలు, పరిశ్రమలు రవాణాతో పాటు చివరల్లో 2011 జనాభా లెక్కల అంశాలపై నజర్ పెట్టాలి. అలాగే తెలంగాణలో ఈ అంశాల్ని కూడా స్టడీ చేస్తూ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు లాంటి వాటిని క్షుణ్ణంగా చదవాలి. తెలంగాణ జాగ్రఫీలో కొత్త జిల్లాలపైనే ప్రశ్నలు వచ్చే అవకాశముంది. 5-10 ప్రశ్నలు.

భారత రాజ్యాంగం - విశిష్ట లక్షణాలు
రాజ్యాంగ స్వరూపం, స్వభావం పనితీరుతో పాటు పార్లమెంటు, అసెంబ్లీ లాంటి అంశాలపై అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఇటీవల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి కాబట్టి వాటిపై అవగాహన ఉండాలి. వీటిల్లో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ముఖ్యమైన తీర్పులు, న్యాయపరమైన అంశాలు ఫాలో అవ్వాలి. రాజ్యాంగానికి సంబంధించిన అంశాలను ఎప్పుడూ వర్తమాన అంశాలతో పోల్చుతూ చదువుకోవాలి. 5- 10 ప్రశ్నలు

ఆధునిక భారత దేశ చరిత్ర:

భారత దేశ చరిత్రలో స్వాతంత్రోద్యమానికే ప్రియారిటీ ఇస్తున్నారు. దాంతో ఆధునిక భారత దేశ చరిత్రతో పాటు స్వాతంత్ర్య ఉద్యమాలు, గాంధీ కాలంలో జరిగిన ఉద్యమాలు, వాటి పరిణామాలపై దృష్టి పెట్టాలి. గాంధీతో పాటు నెహ్రూ లాంటి ఇతర జాతీయ నాయకుల గురించి తెలుసుకోవాలి. 10-15 ప్రశ్నలు.

తెలంగాణ చరిత్ర, ఉద్యమం
తెలంగాణ చరిత్ర అంటే చాలామంది ఉద్యమం ఒక్కటే అనుకుంటున్నారు. అది తప్పు. చరిత్ర ఉద్యమంలో భాగంగా శాతవాహనులు, కాకతీయల నుంచి అసఫ్ జాహీల వరకూ చదవాల్సిందే. అలాగే 1948 నుంచి 2014 జరిగిన తెలంగాణ ఉద్యమాలు, వివిధ పరిణామాలను చదవాలి. ఇక 2001 నుంచి మొదలైన మలి దశ ఉద్యమం కీలకం. 2001 నుంచి 2014 వరకూ తెలంగాణ పోరాటంలో వివిధ ఉద్యమాలు, కమిటీలు, పార్లమెంటులో పునర్విభజన బిల్లు ఆమోదం లాంటివి కీలకం. వీటిల్లో దాదాపు 15-25 ప్రశ్నలు రావొచ్చు.

తెలంగాణ సమాజం, సంస్కృతి:

తెలంగాణ సాహిత్యం, కళలు, ముఖ్యమైన వారసత్వ కట్టడాలు, తెలంగాణ సినిమాలు, అవార్డులు లాంటి వాటిపై నజర్ పెట్టాలి. 10-15 ప్రశ్నలు.

తెలంగాణ ప్రభుత్వ విధానాలు:

2014 లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2018 వరకూ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను చదవాలి. అలాగే ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఇంపార్టెంట్. పథకాల గురించి చదివేటప్పుడు... అవి ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ప్రారంభించారు... బెనిఫిట్ ఎవరికి... ఎంత... లాంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆయా పథకాల లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి.

మొదటి పేపర్లో చివరి టాపిక్ : మెంటల్ ఎబిలిటీ

ఇది కేవలం అభ్యర్థి యొక్క మానసిక ఆలోచనా సామర్థ్యాన్ని పదును పెట్టేవిగా ఉంటాయి. ఈ టాపక్ నుంచి 15-20 ప్రశ్నలు మస్ట్. వీటికి ఇవాళ్టి నుంచి ప్రతి రోజూ సాధన చేయడం కన్న ఉత్తమమైన సలహా మరొకటి లేదు. ఎందుకంటే ముందు నుంచి ప్రాక్టీస్ లేకే చాలామంది విలువైన మార్కులు కోల్పోతున్నారు. తర్వాత చూద్దాం లే అనే నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు.

లాజికల్ రీజనింగ్ లో ఏం ప్రిపేర్ అవ్వాలి

రక్తసంబంధాలు, పజిల్ టెస్ట్, సీటింగ్ అరేంజ్ మెంట్, దిక్కులు, నంబర్ ర్యాంకింగ్ మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు ఉండొచ్చు.

కాంప్రహెన్షన్ :
ఇందులో ఏదైనా ఒక పేరా ఇచ్చి... వాటికి సమాధానాలు గుర్తించమని అడుగుతారు... ఇవి గుర్తించడం ఈజీయే అయినా... కొంచె కష్టపడాల్సి ఉంటుంది.

వాక్యాల నిర్మాణం:

ఒక ప్రశ్నకు సంబంధించి నాలుగు వాక్యాలు ఇస్తారు. వీటిల్లో ఏది ముందు, ఏది తర్వాతో తెలుసుకొని గుర్తించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ విషయం లేదా సంఘటన మొత్తానికి ఒక రూపం వస్తుంది. వీటిల్లో తెలుగుతో పాటు ఇంగ్లీషులోనూ పరీక్షించే అవకాశముంది.

వీటితో పాటు న్యూమరికల్, అర్థమెటిక్ ఎబిలిటీ పైనా ప్రశ్నలు వస్తాయి.

(అర్థమెటిక్, రీజనింగ్ వాటిపై విడిగా మళ్ళోసారి ఆర్టికల్ ఇస్తాను )

పంచాయతీ సెక్రటరీలకు 100 మాక్ టెస్టులు + 10గ్రాండ్ టెస్టులు (ఇందులో రెండు పేపర్లకు సంబంధించిన ప్రశ్నలు కవర్ అవుతాయి )

https://telanganaexams.com/gp-secy-mock/