Monday, July 22

పంచాయతీ కార్యదర్శి పోస్టుల సిలబస్

9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామాల్లో పనిచేసే జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మూడేళ్ళ పాటు రూ.15 వేలు వేతనం ఇస్తారు. ఆ తర్వాత పనితీరును బట్టి రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందువల్ల ఈ అవకాశాన్ని నిరుద్యోగులు మంచిగా ఉపయోగించుకోవాలి. జోనల్ వైజ్ గా పోస్టులు పడటం వల్ల స్థానికులకు 95శాతం రిజర్వేషన్ ఉంటుంది. అయినప్పటికీ పోటీ భారీ స్థాయిలోనే ఉంటుంది. ఈసారి గ్రామపంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ నిర్వహణ బాధ్యతను పంచాయతీ రాజ్ శాఖ తీసుకుంది. దాంతో మళ్లీ JNTU లేదా TSPSC నే పేపర్ తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. పోటీ తీవ్రత దృష్ట్యా కూడా పేపర్ టఫ్ గా ఉంటుందని భావిస్తున్నాం. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మొన్నటి SI (Prelims) పేపర్ చూస్తే (ఇది JNTU తయారు చేసింది) రాబోయే రోజుల్లో మిగతా ఎగ్జామ్స్ కూడా ఇలానే ఉండొచ్చని భావిస్తున్నాం.

చాలామంది కోచింగ్ సెంటర్లకు వెళ్ళి శిక్షణ తీసుకునే స్థోమత లేదని నాకు మెస్సేజ్ లు పెడుతున్నారు. అందువల్ల తక్కువ అమౌంట్ తో వారు ఎగ్జామ్స్ రాసుకునే విధంగా మేము మాక్ టెస్టులు + GRAND TESTS కండక్ట్ చేస్తున్నాం. అయితే ప్రస్తుతం ఉన్న కాంపిటేషన్, పేపర్ టఫ్ ను దృష్టిలో పెట్టుకొని... ఇప్పటివరకూ మేము ఇచ్చిన మాక్ టెస్టులకు భిన్నంగా మళ్లీ కొత్తగా మాక్ టెస్టులను ప్రిపేర్ చేయిస్తున్నాం. ఇందులో మీరు నూటికి నూరుపాళ్ళు విజయం సాధించేలా చూడాలన్నది మా ధ్యేయం.

అలాగే ఏ వారం ఏమేం చదవాలి...

ఆ సబ్జెక్ట్ లో ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏంటి...

ఎగ్జామ్ పేపర్లో ఎలా అడిగే వీలుంది లాంటి టాపిక్స్ ను సబ్జెక్ట్ నిపుణులతో అందిస్తాం.

అందువల్ల మీరు కోచింగ్ తీసుకున్నా... తీసుకోకపోయినా... ఓ ప్లాన్డ్ ప్రకారం చదివితే విజయం సాధించేలా మా ప్రోత్సాహం ఉంటుంది.

పేపర్ 1
ఈ పేపర్ ప్రస్తుతం మీరు ప్రిపేర్ అవుతున్న VRO/GR.IV/PC/SI మోడల్ ను పోలి ఉంది. అంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నదే. మొత్తం 12 అంశాలు ఉన్నాయి
1) రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు (కరెంట్ అఫైర్స్)
2) అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ ఘటనలు
3) నిత్య జీవితంలో సైన్స్
4) పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ అంశాలు
5) దేశ, రాష్ట్ర భౌగోళిక అంశాలు, భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
6) భారత రాజ్యాంగం - విశిష్ట లక్షణాలు
7) భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం
8) ఆధునిక భారత దేశ చరిత్ర, జాతీయోద్యమం
9) తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం
10) తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు,
11) తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పథకాలు
12) మెంటల్ ఎబిలిటీ (వెర్బల్ & నాన్ వెర్బల్ )

పేపర్ 2
ఇందులో మొత్తం 10 అంశాలపై అభ్యర్థులు ప్రిపరేషన్ సాగించాలి

1) తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018
2) భారత దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటు, రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీల నివేదికలు
3) పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలు
4) గ్రామీణ ఆర్థిక స్థితిగతులు, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వాలు చేపట్టిన పథకాలు, గ్రామీణ నిరుపేదలను ఆదుకోడానికి ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలు
5) భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పథకాలు, వివిధ శాఖల పనితీరు
6) తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, పనితీరు, గ్రామీణ పేదల సాధికారిత, స్వావలంబన కోసం ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు, గ్రామీణ చేతి వృత్తులు
7) స్థానికంగా ఉన్న కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, సంక్షేమ పథకాలు
8) మహిళా సాధికారత, వారి ఆర్థికాభివృద్ధిలో స్వయం సహాయక సంఘాల పాత్ర
9) స్థానిక సంస్థల రెవెన్యూ - ఖర్చుల పద్దు నిర్వహణ
10) వివిధ పథకాల నుంచి గ్రామాలకు వచ్చే నిధుల వివరాలు
2) గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వాలు చేస్తున్న కృషి

( మొత్తం సిలబస్ పై విశ్లేషణ, ఎలా ప్రిపేర్ అవ్వాలి... ఏ విభాగం నుంచి ఎన్ని మార్కులకు ప్రశ్నలకు రావొచ్చు లాంటి వివరాలు మరో ఆర్టికల్ లో ఇస్తాను )

(మేడుకొండూరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ )