Thursday, August 22

తప్పుల తడకగా జూనియర్ పంచాయతీ కార్యదర్శి రిజల్ట్స్

జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఫలితాల వెల్లడి తప్పుల తడకగా కొనసాగింది. రాష్ట్రం మొత్తమ్మీద 9355 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. అందుకోసం ప్రతి జిల్లా నుంచి ఆయా కలెక్టర్లు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు. కొన్ని చోట్ల దినపత్రికల్లో కూడా వీటిని అచ్చు వేశారు. అయితే జిల్లా కలెక్టర్లు ప్రకటించిన నెంబర్లలో కొన్ని రిపీట్ అయ్యాయి. అనేక జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి కనిపించింది. కొన్ని చోట్ల హార్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీల మధ్య కూడా కొన్ని నెంబర్లు తేడాలు ఉన్నట్టు స్వయంగా జిల్లా కలెర్టర్లే చెప్పారని అభ్యర్థులు చెబుతున్నారు. ఈనెల 25 లోగా రిక్రూట్ మెంట్ చేపట్టాలని పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. దాంతో హడావిడిగా లిస్టులు ప్రకటించి తప్పుల తడకగా మార్చారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.  ఈ తప్పులను చూపిస్తున్న ఫోటోలు  సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్స్ లో నిరుద్యోగ అభ్యర్థులు తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

అక్రమాలు జరిగాయి: అభ్యర్థులు

మరోవైపు - పంచాయతీకార్యదర్శి ఫలితాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు కొందరు హైదరాబాద్ పంచాయతీ రాజ్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఒకే నెంబర్లు రెండుసార్లు ఇవ్వడం, హైదరాబాద్ లో కష్టపడి చదివిన వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. తమకు నచ్చిన వారికి కొలువులు కట్టబెట్టారని అంటున్నారు. దీనిపై పంచాయతీ రాజ్ అధికారులు సమాధానం చెప్పాలనీ... తప్పుల్ని సరి చేసి అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఓ నిరుద్యోగి ఆవేదనను ఇక్కడ చూడండి