నిరుద్యోగులకు శుభవార్త !

రాష్ట్రంలో రెండో విడతగా 3 వేల 334 ఉద్యోగ నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఎక్సైజ్, ఫారెస్ట్, ఫైర్ సర్వీసు శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు జారీ చేసింది. మొదట విడతగా 30 వేల 453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చింది ఆర్థిక శాఖ. మరో 3 వేల 334 ఉద్యోగ నియమకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన జీవోలను జారీ చేసింది. CM KCR అసెంబ్లీలో 80 వేల 39 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో 30 వేల 453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఇప్పుడు ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోనూ ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఇంకా దాదాపు 40 వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలి. అయితే ఎక్సైజ్, ఫైర్ సర్వీస్ శాఖల భర్తీ బాధ్యతలను తెలంగాణ పోలీస్ రిక్రూమెంట్ బోర్డుకు అప్పగించే అవకాశముంది. ఇవన్నీ యూనిఫామ్ పోస్టులే కావడంతో ఆ బోర్డుకే ఇస్తారని భావిస్తున్నారు.