Friday, September 20

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి గొగొయ్ ?

- ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్ర తన తర్వాత CJI గా జస్టిస్ రంజన్ గొగొయ్ పేరును ప్రతిపాదించారు
- CJI దీపక్ మిశ్రా 2018 అక్టోబర్ 2 న పదవీ విరమణ చేస్తున్నారు
- తర్వాత ప్రధాన న్యాయమూర్తి పేరును సిఫార్సు చేయాల్సిందిగా న్యాయ మంత్రిత్వ శాఖ దీపక్ మిశ్రాకి లేఖ రాసింది
- సర్వోన్నత న్యాయస్థానంలో మిశ్రా తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి గొగొయ్
- ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే 2018 అక్టోబర్ 3న గొగొయ్ CJIగా ప్రమాణం చేస్తారు. ఆయన ఈ పదవిలో 2019 నవంబర్ 17 వరకూ కొనసాగుతారు
- అసోమ్ కి చెందిన జస్టిస్ గొగొయ్ 1978లో బార్ కౌన్సిల్ లో చేరారు.
- 2001 ఫిబ్రవరి 28న గువహాటి హైకోర్టులో పర్మినెంట్ జడ్జిగా నియమితులయ్యారు.
- 2010 సెప్టెంబర్ లో పంజాబ్, హరియాణా హైకోర్టుకి బదిలీ. 2011 ఫిబ్రవరిలో అదే కోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియామకం
- 2012 ఏప్రిల్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి