Friday, September 20

గగనయాన్

1) అంతరిక్షంలోకి భారతీయుడిని పంపేందుకు అవసరమయ్యే కీలక పరిజ్ఞానంపై 2004లో కసరత్తు మొదలైంది

2) 2022 కల్లా భారతీయుడిని అంతరిక్షంలోకి పంపనున్నారు

3) GSLV మార్క్ 3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తారు

4) వ్యోమ నౌకను 300-400కిమీ ఎత్తులోని భూ దిగువ కక్ష్యలో దీన్ని ప్రవేశపెడతారు

5) గగనయాన్ ప్రాజెక్ట్ వ్యయం రూ.10వేల కోట్ల లోపు

6) భూమి నుంచి ప్రయోగించాక 16 నిమిషాల్లో ఈ వ్యోమ నౌక నిర్దేశిత కక్ష్యలోకి చేరుతుంది

7) వ్యోమగాములు ఐదు నుంచి ఏడు రోజుల పాటు రోదసీలో ఉంటారు

8) అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయుడు రాకేశ్ శర్మ నుంచి ఇస్రో సలహాలు, సూచనలు తీసుకుంటుంది. రాకేశ్ శర్మ 1984లో రష్యా ప్రయోగించిన సోయుజ్ టీ - 11 వాహన నౌకలో అంతరిక్షంలోకి ప్రయాణించారు.