Friday, July 19

1857 FBO పోస్టులకు లైన్ క్లియర్ – 4,5 రోజుల్లో పోస్టింగ్స్

ఎంతోకాలంలో ఎదురు చూస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. 1857 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దాంతో ఇప్పటికే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసుకున్న అభ్యర్థులకు 4, 5 రోజుల్లో పోస్టింగ్స్ ఇచ్చేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. PCCF ప్రశాంత్ కుమార్ ఝా ఇప్పటికే అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్

FBO పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను 12 అటవీ సర్కిళ్ళల్లో నిర్వహిస్తారు. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీ ద్వారా అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాని ఇప్పటికే TSPSC అటవీశాఖాధికారులకు సమర్పించింది. వీటిల్లో అర్హులైన అభ్యర్థులను అటవీశాఖ కమిటీ ఎంపిక చేయనుంది.

గతంలో ఆనందరావుతో పాటు మరో ఐదుగురు దాఖలు చేసిన పిటిషన్ పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును TSPSC సవాల్ చేసింది. 6ఎ నిబంధన ప్రకారం నియామకాలు చేపట్టాలని పిటిషనర్లు కోరుతున్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం అటవీ చట్టాలను అమలు చేయడంలో సిబ్బంది కొరతపై కోర్టు తీవ్రంగా స్పందించింది. FBO పోస్టుల్లో ఎవరైనా చేరకపోతే ఆ పోస్టులను పిటిషనర్లతో భర్తీ చేయాలని ఆదేశాలిచ్చింది కోర్టు. మొత్తం 1857 FBO పోస్టుల భర్తీకి TSPSC 2017 ఆగస్టు 18న నోటిఫికేషన్ ఇచ్చింది.