DownLoad Android App

FBO/FROలో జనరల్ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ?

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్/ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల సాధనలో జనరల్ మ్యాథ్స్ చాలా కీలకం. ఇందులో Highest Marks స్కోర్ చేసినవాళ్ళు జాబ్ సంపాదించడంలో ముందుంటారనేది వాస్తవం.  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఈ విభాగానికి 100 మార్కులు కేటాయించారు.  ఈ వంద మార్కుల ప్రశ్నలను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. అంటే ప్రతి ప్రశ్నకు 54 సెకన్లలో సమాధానం రాయాల్సి ఉంటుంది.  ఇచ్చిన సమయంలోనే మొత్తం ప్రశ్నలకు జవాబులు గుర్తించాలంటే మ్యాథ్స్ లో చాలా ప్రాక్టీస్ అవసరం..   మీరు రోజులో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే … మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

జనరల్ మ్యాథ్స్ సిలబస్ ను 6 భాగాలుగా విభజించడం జరిగింది.

ఎ) అర్థమెటిక్

బి) బీజ గణితం

సి) త్రికోణమితి

డి) రేఖాగణితం

ఈ) క్షేత్ర గణితం

ఎఫ్) సంఖ్యాక శాస్త్రం

మొదటి టాపిక్ : అర్థమెటిక్ సిలబస్ ను ఈ కింది సబ్ – టాపిక్స్ గా విభజించడం జరిగింది.

 1. సంఖ్యా వ్యవస్థ
 2. కాలం- దూరం
 3. కాలం-పని
 4. శాతాలు
 5. బారు వడ్డీ
 6. చక్ర వడ్డీ
 7. నిష్పత్పి – అనుపాతం
 8. క.సా.గు & గ.సా.భా
 9. సంవర్గమానాలు

మొదలైనవి.

ఈ విభాగం నుంచి ఖచ్చితంగా ఎన్నిమార్కులు కేటాయించారో చెప్పడం లేదు. కానీ సిలబస్ ను నిర్ధిష్టంగా ఇచ్చారు.  ఈ సిలబస్ నందు మంచి మార్కులు సాధించాలంటే సరైన ప్రణాళికతో ప్రిపరేషన్ ప్రారంభించాలి.  అంతేకాకుండా పైన ఇచ్చిన టాపిక్స్ తో పాటు అదనంగా మరికొన్ని టాపిక్స్ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.  అర్థమెటిక్ విభాగంలో రిఫరెన్స్ పుస్తకంగా R.S.అగర్వాల్ ను వాడితే సరిపోతుంది.

రెండో టాపక్ అయిన బీజగణితంలో క్రింది సబ్ టాపిక్స్ గా విభజించవచ్చు.

 1. శేష సిద్ధాంతం
 2. బహుపదులు
 3. బహుపదులు – క.సా.గు, గ.సా.భా
 4. వర్గ సమీకరణాలు
 5. మూలాలకు, గుణకాలకు మధ్యగల సంబంధం (బహుపదులు)
 6. సమీకరణాల సాధన, అసమీకరణాల సాధన
 7. సమితి సిద్దాంతాలు – సమితి
 8. ఘాతాంకాల ధర

మొదలైన సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది.  ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలు పూర్తిగా మ్యాథ్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి అనుకూలంగా కనిపించినప్పటికీ, మ్యాథ్స్ పై ఎలాంటి పట్టులేని వారు కూడా రోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే… ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది.

 3 వ టాపిక్ ‘‘త్రికోణమితి’’ .  సాధారణంగా త్రికోణమితి చాలా పెద్ద టాపిక్.  ఈ టాపిక్ లోని సబ్ – టాపిక్స్ ను చాలా సులభంగా మరియు పరిమితంగా ఇవ్వడం జరిగింది.  ఈ టాపిక్స్ లో కింది సబ్ – టాపిక్స్ ను ఇచ్చారు.

 1. త్రికోణమితి నిష్పత్తులకు – θ =00,300,450,600,900 విలువలను, కోణాలను కనుగొనడం
 2. త్రికోణమతి సూత్రాలు ( ధర్మాలు)
 3. ఎత్తులు – దూరాలు

ఈ టాపిక్స్ నుంచి వచ్చే అన్ని ప్రశ్నలకు సమాధానాలను సాధించాలంటే తెలంగాణ పాఠశాల 9వ, 10వ తరగతిలోని త్రికోణమితి పాఠ్యాంశాలను ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది.

 4వ టాపిక్ ‘‘రేఖా గణితం’’.  రేఖాగణితం సిలబస్ కూడా అపరిమితం. కానీ ఈ విభాగం నుంచి కింది టాపిక్స్ మాత్రమే చేర్చడం జరిగింది.

రేఖలు, కోణాలు, తలం మరియు తలంలో ఉండే రేఖా చిత్రాలపై ప్రశ్నలు ఇలా ఉంటాయి

 1. కోణాలపై
 2. సమాన రేఖలపై
 3. త్రిభుజం లోని కోణాలపై
 4. సర్వ సమాన త్రిభుజాలపై
 5. త్రిభుజంపై భుజాలు, కొలతలపై
 6. మిళిత బిందువులపై
 7. బహు భుజులపై
 8. వృత్తం మరియు వాటి స్పర్శ రేఖలు, లంబ రేఖలపై
 9. లోకస్ పై
 10. సిలబస్ ను రూపొందించారు.

ఈ విభాగంలో పూర్తిగా మార్కులు సాధించాలంటే పాఠశాల 7 వతరగతి నుంచి 10 వ తరగతి వరకూ గల గణిత పుస్తకాలను రిఫర్ చేస్తే సరిపోతుంది.

జనరల్ మ్యాథ్స్ లో 5 వ విభాగం – క్షేత్ర గణితం

క్షేత్రగణితం అనగానే చాలామంది రేఖా గణితంగానే భావిస్తారు.  కానీ క్షేత్ర గణితం కేవలం కొలతలకు సంబంధించినది.  ఈ విభాగంలో టాపిక్స్ ను రెండు విధాలుగా చేసుకొని చదివితే సులభంగా ఎక్కువ మార్కులు సాధించవచ్చు.

మొదటిది: వైశాల్యాలు – ఈ వైశాల్యాలలో ప్రశ్నలను త్రిభుజాలు, బహుభుజాలు, వృత్తాలుగా విడగొట్టుకొని సాధన చేయాలి.  రెండోవది – ఘనపరిణామాలు.  ఈ ఘనపరిణామాలలో – ఘనం, దీర్ఘ ఘనం, స్థూపం, గోళం, శంఖువు, పిరమిడ్, పట్టకం మొదలైన వాటిని విడగొట్టుకొని వాటి ఉపరితల వైశాల్యాలు, ఘన పరిణామాలపై ప్రశ్నలను సాధన చేయాలి.

ఈ విభాగం నుంచి వచ్చే అన్ని ప్రశ్నలను సాధించాలంటే 7 నుంచి 9 వ తరగతి వరకూ గల పాఠ్యపుస్తకాలతో పాటు R.S. అగర్వాల్ పుస్తకం కూడా రిఫరెన్స్ గా ఉపయోగించుకోవాలి.

జనరల్ మ్యాథ్స్ రెండో పేపరులో చివరి మరియు 6వ విభాగం – సాంఖ్యాక శాస్త్రం.

ఇందులో దత్తాంశం సేకరణ, ట్యాబులేషన్, పౌన:పున్యాలు, గ్రాఫ్ లు, హిస్తారిగన్, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్ ల్లో గుర్తించడం వాటిపై ప్రశ్నలు సాధించడంతో పాటు బేసిక్ టాపిక్స్ అయిన అంక మధ్యమం, మధ్యగతం, బహుళికం, వ్యాప్తి, సహ సంబంధ గుణకం,SD మొదలైన టాపిక్స్ పై ప్రశ్నలకు సాధన చేయాల్సి ఉంటుంది.

జనరల్ మ్యాథ్స్ పేపర్ నందు వచ్చే మార్కులు 80శాతం కన్నా ఎక్కువగా ప్రశ్నలను గుర్తించాలంటే… 7వ తరగతి నుంచి 10 వ తరగతి వరకూ గల గణిత పాఠ్యపుస్తకాల్లో టాపిక్స్ ను సాధన చేయండి.  దానితో పాటు R.S.అగర్వాల్ పుస్తకాన్ని కొన్ని టాపిక్స్ కు ఉపయోగించుకుంటే సరిపోతుంది.

చివరగా చెప్పేది ఏమంటే – మోడల్ పేపర్స్ ను ప్రాక్టీస్ చేయడం మరువ కూడదు.  దాని ద్వారా మనం ఏ టాపిక్స్ లో స్ట్రాంగ్ గా ఉన్నామో, ఏ టాపిక్స్ లో వీక్ గా ఉన్నామో తెలుస్తుంది.

All the best students…

గోపిక్రిష్ణ సార్, అర్థమెటిక్, జనరల్ మ్యాథ్స్ నిపుణులు & డైరక్టర్, గోల్కొండ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోలీస్

నోట్:

 1. telanganaexams.com & Golconda Institute of Police సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆదివారం – 03.09.2017 ఉదయం 10.00 గంటలకు FBO/FSO/FRO సిలబస్ పై అవగాహన సదస్సు (దిల్ సుఖ్ నగర్ లోని గోల్కొండ ఇనిస్టిట్యూట్ ఆవరణలో ) నిర్వహిస్తున్నాం. తెలంగాణలోని ఏ జిల్లా వాళ్ళయినా హాజరవ్వవచ్చు. మన యాప్, వెబ్ సైట్ ఫాలో అయ్యే హైదరాబాద్ జంటనగరాలతో పాటు, చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అందరూ అవగాహన సదస్సుకు రండి.
 2. మనం నిర్వహించే Crash course లో maximum సిలబస్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మీ ప్రాక్టీస్ కి ఈ మాక్ టెస్టులు అదనంగా తోడవుతాయి. సెప్టెంబర్ 15 నుంచి కోర్స్ స్టార్టవుతుంది.  అలాగే సెప్టెంబర్ 10 నుంచి మాత్రమే ఫీజులు స్వీకరించగలం.  ఎలా పే చేయాలన్నది అప్పుడే చెబుతాం.


Share On

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail