అన్ని యూనివర్సిటీల ఎగ్జామ్స్ వాయిదా

అన్ని యూనివర్సిటీల ఎగ్జామ్స్ వాయిదా

తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు, JNTU పరిధిలో జరుగుతున్న అన్ని ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో పరీక్షలను వాయిదా వేశామన్నారు. యూనివర్సిటీలు ఇప్పటికే ఎగ్జామ్స్ షెడ్యూల్ ను ప్రకటించాయి. బీటెక్ లాంటి కోర్సులకు ఇప్పటికే సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. దాంతో అవి కూడా వాయిదా పడ్డాయి. ఎగ్జామ్స్ కు సంబంధించిన రీ షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామంటోంది ఉన్నత విద్యా మండలి. రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్టు మంగళవారం నాడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఎగ్జామ్స్ యధావిధిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవడంతో ఎట్టకేలకు ఎగ్జామ్స్ కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు అధికారులు.