Tuesday, November 13
Log In

VRO/PC/GR.IVకి ఎగ్జామ్స్ టైమ్ లో ఎలా చదవాలి ?

VRO/PC/GR.IV ఉద్యోగాలకు ఎగ్జామ్ డేట్ దగ్గర పడింది.
ఈ టైమ్ లో ఎలా చదవాలి... ?
ఈ తక్కువ రోజులను ఎలా ఉపయోగించాలి...?
టైమ్ టేబుల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి... ?
రివిజన్ ఎలా ?

ఇలాంటి ఆలోచనలు, ప్రశ్నలు చాలామందిని  ఇబ్బంది పెడుతున్నాయి.  ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడిన దగ్గర నుంచి ఇప్పటి దాకా చదివింది ఒక ఎత్తు... ఇప్పుడు చదవబోయేది మరో ఎత్తు. ఎందుకంటే ఈ రోజులు చాలా కీలకం. కీలకమైన ఈ రోజుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకునే విధానాన్నిబట్టే... మీ జయాపజాలు ఆధారపడి ఉంటాయి. కీలకమైన ఈ రోజుల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ప్రతి నిమిషం... ప్రతి సెకన్ ... కూడా ఇంపార్టెంటే. దేన్నీ వేస్ట్ చేసుకోకండి

రివిజన్
పరీక్షలకు 10 రోజుల ముందు నుంచి అన్ని సబ్జెక్టులు రివిజన్ చేసుకోవాలి. ఇప్పటిదాకా చదవని అంశాలపై ఇప్పుడు కొత్తగా దృష్టి పెట్టవద్దు. తీరా అవి అర్థం కాకపోతే... మీరు చదివినదంతా వేస్ట్ అవుతుంది. ఇప్పటిదాకా చదివిన పాఠ్యాంశాలపై మీకున్న పరిజ్ఞానం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రతి సబ్జెక్టునూ మీ రివిజన్ లో భాగం చేసుకోవాలి. కరెంట్ ఎఫైర్స్ దగ్గర నుంచి అర్థమెటిక్, రీజనింగ్ దాకా ప్రతిదీ ఇంపార్టెంటే. దేన్ని నిర్లక్ష్యం చేయొద్దు.

మాక్ టెస్టులు
ఈ తక్కువ టైమ్ లో మీరు చేయాల్సింది వీలైనన్ని మాక్ టెస్టులు రాయడమే. అది ఆన్ లైన్ కానీయండి... ఆఫ్ లైన్ కానీయండి... చాలా చాలా ముఖ్యం. మీరు సివిల్స్, పోలీస్, గ్రూప్స్ తదితర ఉద్యోగాల్లో విజేతల ఇంటర్వ్యూలు చదివితే ఈ విషయం స్పష్టమవుతుంది. చాలామంది విజేతలు చెప్పేది ఒకటే మాట... ఎగ్జామ్ ముందు మేం వీలైనన్ని మాక్ టెస్టులు రాసామని చెప్పారు. దీంతో ప్రతి పరీక్షలో మీరు సాధించిన ప్రగతిని అంచనా వేసుకోవచ్చు. ఏదైనా ఒక సబ్జెక్ట్ లేదా పాఠ్యాంశాల్లో మీకు తక్కువ మార్కులు వస్తే... ఆ సబ్జెక్టులు లేదా విషయంపై మరింత శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుంది.

మీరు మాక్ ఎగ్జామ్ రాయడం పూర్తికాగానే... నాకు ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది ఒక్కటే చూసుకోకుండా... అందులో ఫలానా బిట్ నేను ఎందుకు చేయలేకపోయాను... అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకు సంబంధించిన విషయాలను ఒక్కసారి పుస్తకాలు లేదా ఆన్ లైన్ లో చెక్ చేసుకుంటే మీకు ఉన్న డౌట్ తీరిపోతుంది. ఇంకోసారి ఆ సబ్జెక్ట్ లేదా విషయంపై ఎలాంటి క్వొశ్చన్ వచ్చినా... మీరు ఈజీగా దానికి ఆన్సర్ రాయగలుగుతారు.

టైమ్ ప్లానింగ్
ఉదయం 5 గంటలకు నిద్ర లేచింది మొదలు రాత్రి 10 గంటలకు పడుకునే వరకూ టైమ్ ప్లానింగ్ ఉండాలి. ఏ టైమ్ లో ఏ సబ్జెక్ట్ చదవాలి. ఎంత సేపు చదవాలి...లాంటివి ప్లాన్ చేసుకోవాలి. ఈ ప్లానింగ్ అనేది ఎవరి ఇష్టానుసారం వాళ్ళది...
అయితే నాకు తోచిన కొన్ని సలహాలు ఇస్తాను. సాధారణంగా అంకెలు, సంఖ్యలు ఉన్నవి...మీకు కఠినంగా అనిపించిన సబ్జెక్టులను తెల్లవారుజామున చదివితే బాగా గుర్తుండి పోతాయి. చాలామంది అర్థరాత్రి దాకా చదువుతుంటారు. నిద్రని ఆపుకొని నైట్ ఔట్ చేసి... పగలు నిద్ర పోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా ఆరోగ్యం మీద ప్రభావం పడితే... రేపు ఎగ్జామ్ టైమ్ లో మీ కాన్ఫిడెన్స్ లెవల్స్ దెబ్బతినే అవకాశముంది. అందువల్ల ప్రతి ఒక్కరూ 8 గంటలపాటు కంటి నిండా నిద్ర పోవాల్సిందే.

రోజువారీ ప్లానింగ్
ప్రతి రోజులో ఏ గంటలో ఏ సబ్జెక్ట్ చదవాలో లిస్ట్ రాసుకోండి. అలాగే... చాప్టర్స్ రివిజన్ ఏమేం చేసుకోవాలో రాసుకుంటే... రివిజన్ మొత్తం పూర్తి చేసినట్టు అవుతుంది. అంటే

ఎగ్జామ్ కి మొత్తం రోజులు ఎన్ని ఉన్నాయి ?
ఉదయం నుంచి రాత్రి మనం పడుకునే వరకూ ఉన్న గంటలు ?
ఏ టైమ్ నుంచి ఏ టైమ్ వరకూ ఏమి చదవాలి?
ప్రతి రోజు మాక్ ఎగ్జామ్స్ ఎన్ని రాయాలి ?

లాంటివి ప్లాన్ చేసుకోవాలి. దాంతో ప్రతి రోజులో టైమ్ మొత్తం మీరు సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. అప్పుడు మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

అర్థమెటిక్ రీజనింగ్ నిర్లక్ష్యం చేయొద్దు

చాలామంది ఈ టాపిక్ ను నిర్లక్ష్యం చేస్తుంటారు. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులైతే జనరల్ స్టడీస్ లో చూసుకుందాంలే అనుకుంటే... మ్యాథ్స్ అభ్యర్థులేమో.. మనకెందుకు రాదు... అనుకుంటారు. ఎవరైనా సరే... అర్థమెటిక్, రీజనింగ్ లో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఈ విభాగానికి టైమ్ మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యం. ఎంత తక్కువ టైమ్ లో ప్రశ్నను సాల్వ్ చేయగలిగామన్నది ఇంపార్టెంట్.

మొన్నటి SI ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థుల్లో కొందరు ఇదే తప్పు చేశారు. అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలు చూసి... ఆ తర్వాత చేద్దాం.... ఇప్పుడవి మొదలుపెడితే టైమ్ తినేస్తుంది అనుకొని వదిలేశారు. కానీ తర్వాత ఇంటి దగ్గర వాటినే చక చకా చేసేశారు. అంటే ఎగ్జామ్ హాల్లో మన ఆలోచనలను బట్టే దృక్పథం మారిపోతుంది. వీటిని మాత్రం రోజులో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఎంటెప్ట్ చేయొచ్చు.

కరెంట్ ఎఫైర్స్

మీరు ఇప్పటి వరకూ కరెంట్ ఎఫైర్స్, మన వెబ్ సైట్/app నే ఫాలో అవుతున్నారు. ఏ రోజుకారోజు చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి... మీకు కరెంట్ ఎఫైర్స్ లో ప్రాబ్లెమ్ రాకపోవచ్చు. కొన్ని స్టేట్ మెంట్స్ వారీగా గుర్తు పెట్టుకుంటే ఎలా వచ్చినా... ఆ ప్రశ్నను రాయడానికి అవకాశం ఉంటుంది. మొన్నటి SI ప్రిలిమ్స్ చూశాక... కరెంట్ ఎఫైర్స్ ప్రశ్నలను జనరల్ నాలెడ్జ్ విభాగంలో వివరంగా ఇస్తున్నాం. ప్రతి రోజూ ఒక టైమ్ ప్రకారం www.telanganaexams.com వెబ్ సైట్ లో జనరల్ నాలెడ్జ్ విభాగం చూస్తే మీకు ఆ డౌట్స్ తీరిపోతాయి.

చివరగా ఓ మాట

1) ప్రాక్టీస్ పేపర్స్ లేదా మాక్ ఎగ్జామ్స్ తప్పనిసరిగా చేయండి. ఎన్ని టెస్టులు రాస్తే అంత మంచిది
2) అర్థమెటిక్, రీజనింగ్ పై నిర్లక్ష్యం వద్దు
3) వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాలతో టైం వేస్ట్ చేసుకోవద్దు
4) మా దగ్గర మాక్ టెస్టులు రాస్తున్న వారు రోజంతా మొబైల్ చూడకుండా... ప్రతి రోజు ఒక నిర్ధిష్ట టైమ్ లో మాత్రమే ఎగ్జామ్ రాసుకోండి.

(విష్ణుకుమార్ మేడుకొండూరు, సీనియర్ జర్నలిస్ట్ )

(VRO/PCకి ప్రిపేరేషన్ ఎలా ఉండాలో... రేపు, ఎల్లండి ఆర్టికల్ ఇస్తాను )

==================

SI/PC/VRO/GR.IV - 200 మాక్ టెస్టులు

ఎగ్జామ్స్ ముందు ప్రాక్టీస్ టెస్టులే కీలకం 

http://telanganaexams.com/mocktests/

ఈ లింక్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Telangana exams app ని డౌన్లోడ్ చేసుకోండి. 

https://play.google.com/store/apps/details?id=com.s2techno.telanganexams