ఎన్నికల యంత్రాంగం

1) చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లు, రీజినయల్ కమిషనర్లను ఎవరు నియమిస్తారు ?
జ: రాష్ట్రపతి
(నోట్: ఈ నియామకం పార్లమెంటు రూపొందించిన చట్టాలకు లోబడి ఉండాలి)
2) జిల్లా స్థాయిలో ఎన్నికల సంఘ తరపు రిటర్నింగ్ అధికారిగా ఎవరు పనిచేస్తారు ?
జ: జిల్లా కలెక్టర్
3) పోలింగ్ స్టేషన్ స్థాయిలో ఎన్నికల అధికారిని ఏమంటారు ?
జ: ప్రొసీడింగ్ ఆఫీసర్
4) భారత్ లో కేంద్ర ఎన్నికల కార్యాలయం ఢిల్లీలో ఉంది. దాన్ని ఏమంటారు ?
జ: నిర్వాచన్ ఆయోజన్
5) కేంద్ర ఎన్నికల సంఘంలో పనిచేసే CEC తో పాటు ఇద్దరు కమిషనర్లకు జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తారు ?
జ: భారత సంఘటిత నిధి నుంచి
6) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించినట్టే పార్లమెంటు తప్పిస్తుంది. దీనికి సంబంధించిన ప్రకరణ ఏది ?
జ: ప్రకరణ 324 (5)
7) ఎన్నికల కమిషన్ లో కమిషనర్లను అవినీతి, అసర్థమత ఆరోపణలపై ఎవరి సిఫార్సులతో రాష్ట్రపతి తొలగిస్తారు ?
జ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్
8) ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు ఎన్నికల వ్యయానికి సంబంధించిన ఖర్చులు, ఖాతాల ఆడిట్ నివేదికను ఎన్నికల ముగిసిన ఎన్ని రోజుల్లోగా కమీషన్ ను సమర్పించాలి ?
జ: 15 రోజుల్లోగా
9) ఏ అధికరణ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి ఆ ఎన్నికలు ముగిసేవరకు కమిషన్ న్యాయబద్దమైన సంస్ధగా పనిచేస్తుంది ?
జ: 329 అధికరణ
10) ఏ సంవత్సరంలో సవరించిన ప్రజాప్రాతినిధ్య చట్టం అనుసరించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డవారిని బహిష్కరించవచ్చు ?
జ: 1988లో
11) ఏ అధికరణ ప్రకారం CEC సూచనను అనుసరించి రాష్ట్ర్రపతి పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తారు?
జ: 103 అధికరణ
12) కేంద్ర ఎన్నికల కమిషన్ పార్టీల మధ్య వచ్చే వివాదాలను విచారించి, పార్టీల వాదలను విని పరిష్కరిస్తుంది. ఈ అధికారాలను ఏమంటారు ?
జ: Quasi Judicial Powers
13) ఎన్నికల ఫలితాలు ప్రకటించకముందు, ప్రకటించిన తర్వాత వచ్చే వివాదాలను ఎక్కడ సవాల్ చేయొచ్చు ?
జ: ఫలితాలు ప్రకటించకముందు - కేంద్ర ఎన్నికల సంఘం, ఫలితాలు ప్రకటించాక హైకోర్టుల్లో