Saturday, August 17

పోలీస్ ఎగ్జామ్స్ అప్లికేషన్లకు ఎడిటింగ్ ఆప్షన్

రాష్ట్రంలో నిర్వహిస్తున్న పోలీస్ ఉద్యోగాల్లో క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులకు తమ అప్లికేషన్లలో ఎడిట్ చేయించుకోడానికి TSLRPB అవకాశం కల్పించింది. అందుకోసం జూన్ 4 ఉదయం 8 గంటల నుంచి జూన్ 7 రాత్రి 8 గంటల దాకా అవకాశం కల్పించింది. అయితే కొన్ని ఎడిటింగ్ ఆప్షన్స్ TSLPRB హైదరాబాద్ లో మాత్రమే చేయించుకోవాలి. మరికొన్ని ఎడిట్ చేయించుకోడానికి సెంటర్స్ కేటాయించారు. అయితే ఈ ఎడిట్ ఆప్షన్స్ కి కూడా TSLPRB సర్వీసు ఫీజు కింద భారీగానే వసూలు చేస్తోంది.

A- టైప్ ఫీల్డ్స్ కరెక్ట్ చేయించుకోడానికి హైదరాబాద్ లో మాత్రమే అవకాశం ఉంది. అందుకోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.3వేలు, ఇతరులు రూ.5 వేలు చెల్లించాలి.

( ఏయే ఫీల్డ్స్ కరెక్ట్ చేసుకోడానికి అవకాశం ఇచ్చారో... ఈ కింద ఇచ్చిన ప్రెస్ నోట్ చూడగలరు)

ఇక B - టైప్ ఫీల్డ్స్ కరెక్ట్ చేయించుకోడానికి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకునే జిల్లా కేంద్రాల్లోనే అవకాశం కల్పించారు. అందుకోసం అందుకోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.2వేలు, ఇతరులు రూ.3 వేలు చెల్లించాలి.

( ఏయే ఫీల్డ్స్ కరెక్ట్ చేసుకోడానికి అవకాశం ఇచ్చారో... ఈ కింద ఇచ్చిన ప్రెస్ నోట్ చూడగలరు)

అలాగే పోలీస్ రిక్రూట్ మెంట్ ఫైనల్ ఎగ్జామ్స్ కు సంబంధించి రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం కేవలం 1525 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్టు TSLPRB తెలిపింది. దీనికి సంబంధించిన గడువు ముగిసినట్టు ఛైర్మన్ ప్రకటించారు.

TSLPRB పూర్తి ప్రెస్ నోట్ కోసం క్లిక్ చేయండి

PressReleased dated 31st May 2019