TS ED CET 2021 నోటిఫికేషన్ రిలీజ్

TS ED CET 2021 నోటిఫికేషన్ రిలీజ్

2021 సంవత్సరానికి ఎడ్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ కంప్యూటర్ బేస్డ్ ఆధారిత టెస్ట్ (CBT) ను నిర్వహించనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈనెల 19 నుంచి అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ.650 ( SC/ST/దివ్యాంగులకు రూ.450) లను TS ONLINE/AP ONLINE పేమెంట్ గేట్ వే ద్వారా చెల్లించాలి.

2021 జూన్ 15 లోగా ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఆన్ లైన్ లో తమ అప్లికేషన్లు సబ్మిట్ చేయొచ్చు.

ఎడ్ సెట్ ఎగ్జామ్ జరిగే తేది: 24.08.2021 ( మంగళవారం) & 25.08.2021 (బుధవారం)

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ & మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ

పూర్తి వివరాలకు
https://edcet.tsche.ac.in/TSEDCET/EDCET_HomePage.aspx ను విజిట్ చేయండి