Wednesday, May 23
Log In

EAM CET రాస్తున్నారా …? రూల్స్ తెలుసుకోండి !

AP లేదా TS ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి ఆల్ ద బెస్ట్. అయితే ఆన్ లైన్ ఎగ్జామ్ కి వెళ్ళే ముందు ఈ కింది నిబంధనలు తప్పక పాటించండి.

ఎగ్జామ్ కి ఏవి తీసుకెళ్ళాలి ?

1) ఎగ్జామినేషన్ హాల్ కు వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డు (హాల్ టికెట్), బాల్ పాయింట్ పెన్ అనుమతిస్తారు
2) SC/ST లు అయితే కుల ధృవీకరణ పత్రం తీసుకెళ్ళాలి
3) ఎంసెట్ అప్లికేషన్ ఆన్ లైన్ నుంచి ప్రింట్ తీసుకొని దానిపై కాలేజీ ప్రిన్సిపల్ లేదా గెజిటెడ్ ఆఫీసర్ తో అటెస్టేషన్ చేయించి తీసుకురావాలి. వీటిని ఇన్విజిలేటర్ కి సమర్పించనిచో వారి రిజల్ట్ విత్ హెల్డ్ లో ఉంచబడను.

ఏవి తీసుకెళ్లకూడదు ?

1) కాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, ఎలాంటి వాచీలు, పెద్ద కళ్ళద్దాలు ఇతర ఏవైనా ఎలక్ట్రానిక్ పరికరాలు

ఇతర వివరాలు:
1) పరీక్షా కేంద్రానికి గంట ముందే హాజరు కావాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు.
2) పరీక్షకు ముందు బయో మెట్రిక్ విధానంలో విద్యార్థుల వేలి ముద్రలు స్వీకరిస్తారు. అందువల్ల ఎడమచేతి బొటనవేలికి ఎలాంటి మెహందీ, ఇంక్ లాంటివి ఉండకూడదు.
3) ప్రశ్నాపత్రం ఇంగ్లీషు, తెలుగులో ఉంటుంది.
4) సరైన జవాబు ఎంపిక చేసుకున్నాక టిక్ మార్క్ పెట్టి సేవల్ చేయాలి. ఒకవేళ ఆ ప్రశ్నకు జవాబు వేరేది అనుకుంటే... మీరు మళ్ళీ సరైన ఆన్సర్ సెలక్ట్ చేసి సేవ్ చేసుకోవచ్చు.
5) పూర్తి చేసిన ప్రశ్నలు పచ్చ రంగులో, పూర్తి చేయని ప్రశ్నలు ఎరుపు రంగులో ఉంటాయి. ప్రశ్నలు పూర్తి చేసి సేవ్ చేయనవి వైలెట్ రంగులో కనిపిస్తాయి.
6) మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏదైనా సిస్టమ్ పనిచేయకపోయినా, ఏదైనా సాఫ్ట్ వేర్ ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకురావాలి

( మీ హాల్ టిక్కెట్స్ లో ఈ నిబంధనలు అన్నీ ఉన్నాయి.  ఒకసారి చదువుకోగలరు )

All the best

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *