Tuesday, September 25
Log In

DPT-45-CURRENT AFFAIRS-TOP (30ans)

1) రెడ్డి హాస్టల్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాజా బహుదూర్ వెంకటరామా రెడ్డి ఎడ్యుకేషనల్ క్యాంపస్ ను ఎక్కడ నిర్మించనున్నారు ?
ఎ. బుద్వేలు
బి. బద్వేల్
సి. గజ్వేల్
డి. పటాన్ చెరు

2) రాష్ట్రంలో మూడో వైమానిక పరికరాల తయారీ పార్కును ఎక్కడ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ?
ఎ.  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో
బి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఆదిభట్లలో
సి. హైదరాబాద్ జిల్లా సరూర్ నగర్ మండలం ఆదిభట్లలో
డి. రంగారెడ్డి జిల్లా  పటాన్ చెరు మండలం లింగంపల్లిలో

3) కశ్మీర్ లో మారణహోమం సృష్టిస్తున్న ఏ ఉగ్రవాద సంస్థను విదేశీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అమెరికా ప్రకటించింది ?
ఎ. హిజ్బుల్ ముజాహిదీన్
బి. జైషే మహ్మద్
సి. లష్కరే తోయిబా
డి. ఇండియన్ ముజాహిదీన్

4) యువతలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు మెళకువలు, యోగా విధానాలను ఇంటర్నెట్ ద్వారా దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థ ఏది ?
ఎ. పతంజలి
బి. ఆర్ట్ ఆఫ్ లివింగ్
సి. ఓషో ఫౌండేషన్
డి. ఈషా ఫౌండేషన్

5) భారత సైన్యం వాడుతున్న టీ-90 యుద్ధ ట్యాంకుల్ని ఆధునీకరించాలని ఆర్మీ నిర్ణయించింది. ఇవి ఏ దేశంలో తయారైనవి ?
ఎ. అమెరికా
బి. రష్యా
సి. బ్రిటన్
డి. ఇజ్రాయెల్

6) భారత వాణిజ్య నౌకల్లో దేశీయ దిక్సూచి వ్యవస్థను ప్రవేశపెట్టాలని కేంద్ర నిర్ణయించింది. దాని పేరేంటి ?
ఎ. భువన్
బి. గగన్
సి. జీపీఎస్
డి. ఇన్సాట్

7) భారత్ లో పాకిస్తాన్ హై కమిషనర్ గా కొత్తగా బాధ్యతలు చేపట్టినవారు ఎవరు ?
ఎ. సొహైల్ మహమూద్
బి. సొహైల్ అబ్బాస్
సి. సౌహైల్ సింగ్
డి. అహ్మద్ ఖాన్ సొహైల్

8) 2017లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హాలీవుడ్ నటి ఎవరని ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించింది ?
ఎ.ఎమ్మా స్టోన్
బి. ఏంజెలీనా జోలి
సి. జెన్నిఫర్ లోపెజ్
డి. షకీరా

9) భారత్- చైనా సరిహద్దుల్లో పెండింగ్ లో ఉన్న రోడ్లను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ బోర్డర్ రోడ్లను ఏ సంస్థ నిర్మించనుంది ?
ఎ. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్
బి. ఎల్ అండ్ టీ
సి. డీఎల్ ఎఫ్ ఇన్ఫ్రాస్టక్చర్స్
డి. ఎల్ అండ్ టీ కన్ స్ట్రక్షన్స్

10) నావికా సాగర్ పరిక్రమ ప్రాజెక్ట్ కింద సెప్టెంబర్ 2017 లో ఇండియన్ నావీకి చెందిన మహిళా సిబ్బంది..  ప్రపంచాన్ని చుట్టు వచ్చేందుకు వెళ్తోంది. అందుకోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న బోటు పేరేంటి ?
ఎ. INSV అరుణి
బి. INSV తరుణి
సి. INSV సాగరిక
డి. INSV అరుణిమ

11) పర్యావరణ హిత పరిశోధనలు చేస్తున్న రాష్ట్రానికి చెందిన ఏ యువశాస్త్రవేత్తకు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా అవార్డు లభించింది ?
ఎ.  డాక్టర్ చంద్రశేఖర్ శర్మ
బి. డాక్టర్ చంద్రశేఖర్ వర్మ
సి. డాక్టర్ చంద్రశేఖర్ పునీత్
డి. డాక్టర్ చంద్రశేఖరన్

12) నగదు రహితహ చెల్లింపులను ప్రోత్సహించేందుకు భీమ్ యాప్ పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ఎప్పటి వరకూ పొడిగించారు ?
ఎ. 2018 జూన్ 30
బి. 2018 జనవరి 1
సి. 2018 మార్చి 31
డి. 2018 మార్చి 28

13) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ ఈ నెల 27న పదవీ విరమణ చేస్తున్నారు. అయితే కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తున్నారు..?
ఎ. జస్టిస్ దల్వీర్ భండారీ
బి. జస్టిస్ దీపక్ మిశ్రా
సి. జస్టీస్ రమేష్ సింగ్
డి. జస్టిస్ అనూప్ మిశ్రా

14)  తెలంగాణాలో క్లీన్ ఎయిర్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీని ప్రకారం చెత్తనుంచి విద్యుత్ తయారు చేస్తారు. అయితే ఈ విధానం ప్రస్తుతం ఎక్కడ అమల్లో ఉంది.?
ఎ. లండన్
బి. టోక్యో
సి.  శాన్ ఫ్రాన్సిస్కో
డి. సింగపూర్

15) పెట్రోలియం రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణానికి హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL) తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
ఎ. బెంగాల్
బి. మహారాష్ట్ర
సి. రాజస్థాన్
డి. గుజరాత్

16) ఇటీవలే శ్రీలంకతో.. జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే భారతీయులకు వీసా లేకుండా తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఇచ్చిన దేశం ఏది ?
ఎ. చైనా
బి. అమెరికా
సి. శ్రీలంక
డి. ఖతార్

17) భారీ వర్షాలతో వచ్చిన వరదల కారణంగా ఏ ప్రఖ్యాత జాతీయపార్కులో 346 జంతువులు చనిపోయారు ?
ఎ. కజిరంగ నేషనల్ పార్క్
బి. నామ్ దఫా శాంక్చువరీ
సి. గిర్ అభయారణ్యం
డి. దుడ్వా నేషనల్ పార్క్

18) పర్యావరణ హితం కోసం LED బల్బులు, ట్యూబ్ లైట్స్, సీలింగ్ ఫ్యాన్లు ఎక్కడ అమ్మేందుకు Oil Marketing Companies, Energy Efficiency Services Ltd మధ్య ఒప్పందం కుదిరింది ?
ఎ. షాపింగ్ కాంప్లెక్స్
బి. పెట్రోల్ బంకులు
సి. మల్టీప్లెక్స్ లు
డి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

19) ఏ దేశ ప్రధాని హత్యాయత్నం కేసులో 10 మందికి ఉరిశిక్ష పడింది ?
ఎ. బంగ్లాదేశ్
బి. నేపాల్
సి. మారిషస్
డి. పాకిస్తాన్

20) హ్యాండీకాప్ ఇంటర్నేషనల్ కి గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితులైన బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు ఎవరు ?
ఎ. రొనాల్డో
బి. రొనాల్డిన్హో
సి. శాంసెజ్
డి. నేమర్

21) ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ – 2017 పోటీసులు ఎక్కడ జరుగుతున్నాయి ?
ఎ. గ్లాస్గో (స్కాట్లాండ్)
బి. లండన్
సి. ఇండోనేషియా
డి. బీజింగ్ ( చైనా )

22) ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేధింపులు, గృహహింస, ఈవ్ టీజర్ల నుంచి మహిళలను రక్షించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన హెల్త్ లైన్ నెంబర్ ఎంత ?
ఎ. 180
బి. 181
సి. 182
డి. 183

23) జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) లో కొత్తగా చేరిన పార్టీ ఏది ?
ఎ. టీఆర్ఎస్
బి. శివసేన
సి. జనతాదళ్(యు)
డి. ఆర్జేడీ

24) కొత్త 50 రూపాయల నోటు మీద ఏ లెటర్ సిరీస్ ను ఆర్బీఐ  ముద్రించనుంది ?
ఎ. ఎల్
బి. ఎన్
సి. ఐ (ఇండియా)
డి. ఏమీ లేదు

25) ఇండియన్ కోస్ట్ గార్డ్ ల సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని కేటాయించింది ?
ఎ.22 వేల కోట్లు
బి.33 వేల కోట్లు
సి.40 వేల కోట్లు
డి.32 వేల కోట్లు

26) దీపావళి సంబురాల్లో శబ్ద, వాయు కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ కేంద్ర పర్యావరణ శాఖ చేపట్టిన కార్యక్రమం ఏది ?
ఎ. సేఫ్ దివాలీ
బి. అచ్ఛా దివాలి, ఆనంద్ దివాలీ
సి. హిరత్ దివాలీ, స్వస్థ్ దివాలీ
డి. మై ఫ్యామిలీ, మై దివాలీ

27) BSNL ఏ సంస్థతో కలసి Bespoke mobile wallet ను ప్రారంభించింది ?
ఎ. Mobibank
బి. MobiKwik
సి. MobiMoney
డి. MobileMoney

28) వాతావరణంలో అనూహ్యమైన మార్పుల వల్ల  (క్లైమేట్ ఛేంజ్ ) దేశం ఎంత మొత్తాన్ని భరించాల్సి వస్తోంది ?
ఎ. 67 వేల కోట్లు
బి. 35 వేల కోట్లు
సి. 46 వేల కోట్లు
డి. 93 వేల కోట్లు

29) ఈనెల 21న 99యేళ్ల తర్వాత ఏ దేశంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతోంది?
ఎ. అమెరికా
బి. ఇండియా
సి. పాకిస్తాన్
డి. జపాన్

30) ఆసియా పసిఫిక్ రీజియన్ లో బలం పెంచుకోడానికి మూడు దేశాలతో రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అమెరికా, జపాన్ నిర్ణయించాయి.  భారత్ కాకుండా మరో రెండు దేశాలు ఏవి ?
ఎ. దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా
బి. ఉత్తర కొరియా, ఆస్ట్రేలియా
సి. చైనా, పాకిస్తాన్
డి. చైనా, దక్షిణ కొరియా