DPT-43 తెలంగాణ సాహిత్యం, ప్రభుత్వ విధానాలు

1) బోనాల పండుగ నాడు మట్టికుండలు నెత్తి మీద పెట్టుకుని చేసే నృత్యం ఏది ?
ఎ) కోయ నృత్యం
బి) గుస్సాడి నృత్యం
సి) పేరిణి నృత్యం
డి) గరగ నృత్యం

2) గొల్లగట్టు జాతర ఎక్కువగా ఏ జిల్లాలో జరుగుతుంది ?
ఎ) మెదక్ జిల్లా
బి) వరంగల్ జిల్లా
సి) సూర్యాపేట జిల్లా
డి) రంగారెడ్డి జిల్

3) శివరాత్రి రోజున ప్రత్యేకంగా జరుపుకునే జాతర ఏది ?
ఎ) కొమరవెల్లి మల్లన్న జాతర
బి) మారమ్మ తల్లి జాతర
సి) గంగామ్మ జాతర
డి) కురుమూర్తి జాతర

4) బతుకమ్మ ఉత్సవాల మొదటి రోజును ఏమని వ్యవహరిస్తారు ?
ఎ) సద్దుల బతుకమ్మ
బి) ఎంగిలి పూల బతుకమ్మ
సి) బతుకమ్మ తొలి ఉత్సవం
డి) అటుకుల బతుకమ్మ

5) జానపద చారిత్రక గేయగాథలు గ్రంథ రచయిత ఎవరు ?
ఎ) గంగాధరం
బి) నాయని కృష్ణకుమారి
సి) జయధీర్ తిరుమలరావు
డి) బిరుదు రామరాజు

6) వేములవాడ భీమకవి రచించిన రచనలు ఏవి ?
ఎ) కవిజనాశ్రయం
బి) శివతత్త్వసారము
సి) భద్రాద్రి రామ శతకం
డి) నీతిసారం

7) సారంగు తమ్మయ రచించిన గ్రంథం ఏది ?
ఎ) శోకవర్తికం
బి) లక్ష్మణసారసంగ్రహం
సి) వైజయంతీ విలాసం
డి) శివయోగ సారం

8) పుచ్చలపల్లి సుందరయ్య రచించిన గ్రంథం ఏది ?
ఎ) నేను నా దేశం
బి) విశాలాంధ్రలో ప్రజారాజ్యం
సి) తాకట్టులో భారతదేశం
డి) చివరకు మిగిలేది

9) మిషన్ భగీరథను ఎవరు ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) మన్మోహన్ సింగ్ ఆగస్ట్ 2
బి) రాజీవ్ గాంధీ ఆగస్ట్ 4
సి) నరేంద్ర మోడీ, ఆగస్ట్ 7
డి) వి.పి సింగ్ ఆగస్ట్ 6

10) ప్రస్తుతం ఆరోగ్య లక్ష్మిగా పేర్కోంటున్న పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు ?
ఎ) ఆరోగ్య కిరణాలు
బి) ఆరోగ్య వాణి
సి) రాజీవ్ అమృత హస్తం
డి) ఇందిరమ్మ అమృత హస్తం

11) వృద్ధులకు అమలు చేస్తున్న ఆసరా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
ఎ) రక్షణ
బి) జీవనాధారం
సి) భరోసా
డి) భద్రత

12) కొత్త వంతెన పుస్తక రచయిత ఎవరు ?
ఎ) కె. శ్రీనివాస్
బి) సుంగిశెట్టి శ్రీనివాస్
సి) అల్లం నారాయణ
డి) సుంకిరెడ్డి నారాయణరెడ్డి

13) "ఫోరం ఫర్ సస్టెయినబుల్ తెలంగాణ" అనే సంస్థను స్థాపించినది ఎవరు ?
ఎ) అల్లం నారాయణ
బి) మల్లెపల్లి లక్ష్మయ్య
సి) ఘంటా చక్రపాణి
డి) మణికొండ వేదకుమార్

14) వరంగల్ లోని భద్రకాళీ ఆలయంను నిర్మించినదెవరు ?
ఎ) రవికీర్తి
బి) పులకేశి-2
సి) గణపతిదేవుడు
డి) రుద్రదేవుడు

15) నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి ఎవరు ?
ఎ) దాశరథి కృష్ణమాచార్య
బి) దాశరథి రంగాచార్య
సి) కాళోజీ నారాయణరావు
డి) శ్రీరంగం శ్రీనివాసరావు

16) ఆది హిందూ లైబ్రరీ స్థాపకులు ఎవరు ?
ఎ) దేవులపల్లి వెంకటేశ్వరరావు
బి) బి.ఎస్ వెంకట్రావు
సి) చౌడవరం విశ్వనాథం
డి) పాములపర్తి సదాశివరావు

17) తెలంగాణలో ఏం జరుగుతుంది అనే పుస్తక రచయిత ఎవరు ?
ఎ) గాదె ఇన్నయ్య
బి) మల్లేపల్లి లక్ష్మయ్య
సి) ప్రొఫెసర్ కోదండరాం
డి) ప్రోఫెసర్ జయశంకర్

18) తెలంగాణ ఆది కవిగా ఎవరిని పేర్కొంటారు ?
ఎ) మల్లికార్జున పండితుడు
బి) మల్లియ రేచన
సి) పాల్కురికి సోమన
డి) పావులూరి మల్లన

19) తెలుగులో లభ్యమౌతున్న వాటిలో మొట్ట మొదటి యక్షగానం ఏది?
ఎ) వీరభద్ర విజయం
బి) సుగ్రీవ విజయం
సి) నారాయణ శతకం
డి) భోగినీ దండకం

20) తెలుగులో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఏది ?
ఎ) సుమతి శతకం
బి) బాల భారతం
జి) క్రీడాభిరామం
డి) ఆంధ్ర భాషా భూషణం

21) ప్రతాపరుద్రుని ఆస్థానకవి, సంస్కృతంలో మొదటిసారి అలంకార గ్రంథాలు రాసింది ఎవరు ?
ఎ) విద్యానాధుడు
బి) మారన
సి) విశ్వనాధుడు
డి) ఎవరూ కాదు

22) తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా స్వతంత్ర్య వేడుకలు ఎక్కడ జరిగాయి ?
ఎ) గన్ పార్క్ స్థూపం వద్ద
బి) ఎన్.టి.ఆర్. గార్డెన్
సి) గోల్కొండకోట
డి) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్

23) వ్యవసాయ పనులలో 'కళ్ళం' అనగా ఏమిటి ?
ఎ) గడ్డి భూమి
బి) గడ్డి నుండి ధాన్యాన్ని వేరుచేసే స్థలం
సి) ధాన్యాన్ని నిలువ ఉంచే స్థలం
డి) నీటిని నిలువ ఉంచే స్థలం

24) ప్రముఖ నాటకం మా భూమి దేనితో సంబంధం కలిగి ఉంది ?
ఎ)  భూదానోద్యమం
బి) గిరిజనోద్యమం
సి) సామాజిక సంస్కరణోద్యమం
డి) తెలంగాణ సాయుధ పోరాటం

25) కాకతీయుల కాలంలోని నౌక చరిత్ర సంగీత గ్రంధ రచయిత ఎవరు ?
ఎ) త్యాగరాజు
బి) మారన
సి) తిక్కన
డి) గోనబుద్దారెడ్డి

26) తెలంగాణ తొలి తెలుగు పత్రిక ఏది ?
ఎ) రిసాలతబ్బి
బి) శేద్య చంద్రిక
సి) హైదరాబాద్ టెలిగ్రాఫ్
డి) దక్కన్ స్టాండర్డ్

27 తెలంగాణ ఆంధ్రోద్యమము రాజకీయ, సాంస్కృతిక చరిత్ర గ్రంధకర్త ఎవరు ?
ఎ) దేవులపల్లి ప్రభాకరరావు
బి) సుందరయ్య
సి) ఆదిరాజు వీరభద్రరావు
డి) మాడపాటి హనుమంతరావు

28) హైదరాబాద్ లో "హ్యూమానిటేరియన్ లీగ్" అనే సమస్యను స్థాపించిందెవరు ?
ఎ) రాయ్ బాలముకుంద్
బి) కేశవ రావు
సి) ప్రేమ్ జీ లాల్
డి) అబ్దుల్ ఖయ్యూం

29) తెలంగాణ పల్లెప్రగతికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ?
1) మెదక్ జిల్లా కౌడిపల్లిలో పథకం ప్రారంభమైంది
2) 2015 ఆగ్టు 22న కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు
3) తెలంగాణ గ్రామీణ సమీకృత అభివృద్ధి కార్యక్రమం పేరును తెలంగాణ పల్లె ప్రగతిగా మార్చారు
4) ఈపథకం అమలుకు రూ.450 కోట్లను IMF మంజూరు చేసింది
ఎ) 1,2,3 కరెక్ట్ 4 కాదు
బి) 1,2 కరెక్ట్ 3,4 కాదు
సి) 1,2,తప్పు 3,4 కరెక్ట్
డి) అన్నీ కరెక్టే

30) తెలంగాణ హరితహారంనకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు ?
ఎ) మూడో విడత హరితహారాన్ని సీఎం కేసీఆర్ కరీంనగర్ లో ప్రారంభించారు
బి) మొదటి విడత హరితహారాన్ని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రారంభించారు
సి) మొదటి విడత హరితహారంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు
డి) తెలంగాణలో హరితహారం కార్యక్రమం 2015 జులై 3న ప్రారంభమైంది

31) మిషన్ భగీరథకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు ?
ఎ) ప్రతి వ్యక్తికి  గ్రామాల్లో 100 లీటర్లు, పట్టణంలో -135 లీటర్లు, నగరాల్లో - 150 లీటర్లు అందిస్తారు
బి) మిషన్ భగీరథ పైలాన్ ను సీఎం కేసీఆర్ చౌటుప్పల్ లో ఆవిష్కరించారు
సి) తొలి దశను గవర్నర్ నరసింహన్ గజ్వేల్ లో ప్రారంభించారు
డి) మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి

32) తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ కింది వాటిలో ఏవి కరెక్ట్ ?
1) తెలంగాణ అమరవీరులకు రూ.10లక్షలు, ఉద్యోగం కల్పించింది
2) వడదెబ్బ మృతులకు కూడా ఆపద్భంధు పథకం వర్తించేలా నిర్ణయం
3) గీత, మత్య్స కార్మికులకు రూ.5లక్షల ప్రమాద బీమా
4) ఆదాయ పరిమితి పెంపు - గ్రామాల్లో : రు.1.50లక్షలు, పట్టణాల్లో రూ.2.00 లక్షలు
ఎ) అన్నీ కరెక్ట్
బి) అన్నీ తప్పు
సి) 1,2,3 తప్పు
డి) 1,2 తప్పు 3,4 కరెక్ట్

33) వ్యవసాయంపై ఆధారపడిన నిరుపేదలైన దళితులకు ప్రభుత్వం ఇచ్చే 3 ఎకరాల భూమి పథకం పేరేంటి ?
ఎ) భూదాన్
బి) భూలక్ష్మి
సి) భూమి కొనుగోలు పథకం
డి) మిషన్ లాండ్

34) తెలంగాణ రాష్ట్ర కొత్త పారిశ్రామిక విధానంను ఎప్పుడు ప్రకటించారు ?
ఎ) 2015 జూన్ 2
బి) 2015 జూన్ 12
సి) 2015 జూన్ 14
డి) 2015 జూన్ 24

35) TSIIC అంటే
ఎ) Telangana State Industrial Investment Centre
బి) Telangana State Industrial Investment Corporation
సి) Telangana State Infracture Investment Corporation
డి) Telangana State Industrial Infracture Corporation