DPT-41- తెలంగాణ చరిత్ర, సంస్కృతి

1) కాకతీయుల కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచేవారు ?
ఎ) పెరికె ఎండ్ల సుంకం
బి) అమ్మబడి సుంకం
సి) అరి
డి) పెమ్ట సుంకం

2) ధర్మసాగర శాసనంలో పేర్కొన్న వాయిద్యం ఏది?
ఎ) వీణ
బి) జలకరండ
సి) తబల
డి) మృదంగం

3) కాకతీయుల కాలాన్ని ఎలా పిలుస్తారు?
ఎ) శూద్ర యుగం
బి) తామ్ర యుగం
సి) స్వర్ణ యుగం
డి) పైవేవి కావు

4) శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన గండభేరుండ ముద్ర ఏ కోటలో కన్పిస్తుంది ?
ఎ) భువనగిరి కోట
బి) నిర్మల్ కోట
సి) గద్వాల్ కోట
డి) మెదక్ కోట

5) మొదట కాకతీయులు నిర్మించిన గోల్కొండ పూర్వనామం ఏది ?
ఎ) మంకాల్
బి) రాచకొండ కోట
సి) నిర్మల్ కోట
డి) దోమకొండ

6) కాకతీయుల కాలంలో రాజును రక్షించే ప్రత్యేక అంగరక్షక దళంపేరు ?
ఎ) నగరీశ్రీకావలి
బి) అయ్యగార్లు
సి) లెంకలు
డి) నాయంకరులు

7) బౌద్ధమత విశేషాలతో కూడిన మ్యూజియం ఏ కొండపై ఉంది ?
ఎ) కోయిల కొండ
బి) నాగార్జున కొండ
సి) లింబాద్రి గుట్ట
డి) పైవేవి కావు

8) ఒకే పీఠంపై రెండు శివలింగాలున్న దేవాలయం ఎక్కడ ఉంది ?
ఎ) రామప్ప దేవాలయం
బి) నీలకంఠేశ్వరాలయం
సి) కూసుమంచి శివాలయం
డి) కాళేశ్వరం శివాలయం

9) చిలుకూరు బాలాజీకి గల మరోక పేరు ఏమిటి ?
ఎ) పాస్ పార్ట్ బాలాజీ
బి) ఫారెన్ బాలాజీ
సి) వీసా బాలాజీ
డి) ఏదీ కాదు

10) చార్మినార్ వాస్తుశిల్పి ఎవరు?
ఎ) మీర్ ఉస్మాన్ అలీఖాన్
బి) మీర్ మొమిన్ అస్త్రబాది
సి) మీర్ మెహబూబ్ ఆలీఖాన్
డి) ఆలీఖాన్

11) కుతుబ్ షాహీ సమాధులు ఏ శైలిలో నిర్మించబడ్డాయి?
ఎ) ఇండో-హిందూ
బి) ఇండో-పర్షియన్
సి) ఇండో-అరబిక్
డి) ఇండో-రష్యన్

12) శాతవాహనులు, కళ్యాణి చాళుక్యులు అభివృద్ధి చేసిన ఆలయం పేరు ఏమిటి ?
ఎ) బాసర
బి) బిర్లామందిర్
సి) ధర్మపురి
డి) యాదగిరి గుట్ట

13) పురానా హవేలీ ప్యాలెస్ లో ప్రసిద్ద సందర్శన స్థలాలు ఏమిటి?
ఎ) క్లాక్ టవర్
బి) గోడ గడియారం
సి) నవాబుల కత్తులు
డి) చెక్క వార్డ్ రోబ్

14) గోల్కొండని ఏ సంవత్సరంలో నిర్మించారు?
ఎ) 1143లో
బి) 1145లో
సి) 1141లో
డి) 1140లో

15) 1952 ముల్కీ ఉద్యమ సమయంలో ఉథావ్ రావు సంపాదకత్వంలో వచ్చిన పత్రిక ఏది ?
ఎ) పాయం
బి) ప్రజాతంత్ర
సి) గోలకొండ
డి) మాభూమి

16) ముల్కీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది. ?
ఎ) 1954
బి) 1956
సి) 1952
డి) 1950

17) 1952 సెప్టెంబర్ లో తెలంగాణాలో పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమం పేరు ఏమిటి ?
ఎ) ముల్కీ ఉద్యమం
బి) నాన్ ముల్కీ ఉద్యమం
సి) గైర్ ముల్కీ ఉద్యమం
డి) పైవేవి కావు

18) 1952 ముల్కీ ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభమైంది.  ?
ఎ) జి. రామాచారి
బి) ప్రొ.జయశంకర్
సి) టి.హయగ్రీవాచారి
డి) మదన్ మోహన్

19) ముల్కీ అనగా అర్ధం ఏమిటి ?
ఎ) స్థానికేతరుడు
బి) స్థానికుడు
సి) హైదరాబాదీ
డి) ఉర్దూ వచ్చినవారు

20) ఏ ఉద్యమాన్ని అణచివేయుటకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ ఆరు సూత్రాల పథకం ప్రవేశపెట్టింది ?
ఎ) సాయుధ పోరాటం
బి) జై ఆంధ్ర ఉద్యమం
సి) నక్సలైట్ ఉద్యమం
డి) పైవేవి కావు

21) రెంటాల గోపాలకృష్ణ గారు రచించిన గ్రంథం ఏది ?
ఎ) నా గొడవ
బి) తెలంగాణ
సి) రుద్రవీణ
డి) సర్పయాగం

22) హరిభద్రుడు రచించిన గ్రంథం ఏది ?
ఎ) జైనమత గ్రంథం
బి) నీతిసారం
సి) ప్రాకృత గ్రంథం
డి) హర్ష చరిత్ర

23) అభినవ దర్పణం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?
ఎ) విద్ధనాచార్య
బి) ఉగ్రదిత్యుడు
సి) లాయక్ అలీ
డి) నందికేశ్వరుడు

24) నన్నయ్య భట్టారకుడు రచించిన తెలుగు వ్యాకరణ గ్రంథం ఏది ?
ఎ) పద్మపురాణం
బి) ప్రేమాభిరామం
సి) ఆంధ్ర శబ్ద చింతామణి
డి) బాలభారతం

25) తెలంగాణ గట్టు మీద చందమామయో అనే పాటకు రచయిత ఎవరు ?
ఎ) అంబటి వెంకన్న
బి) గద్దర్
సి) మండె సత్యనారాయణ
డి) గూడ అంజన్న

26) మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు... పాత రచయిత ?
ఎ) మిత్ర
బి) వందేమాతరం
సి) రసమయి
డి) అందెశ్రీ

27) అమ్మా తెలంగాణమా-ఆకలి కేకల రాజ్యమా పాటకు రచయిత ఎవరు ?
ఎ) అందెశ్రీ
బి) గద్దర్
సి) అంబటి వెంకన్న
డి) వరంగల్ శ్రీను

28) బాలభారతం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?
ఎ) శ్రీశ్రీ
బి) అగస్త్యుడు
సి) శర్వవర్మ
డి) శివదేవయ్య

30) జై బోలో తెలంగాణ లో ‘గారడి జేస్తుండ్రు’ అనే పాట రచయిత ఎవరు ?
ఎ) గద్దర్
బి) కేసీఆర్
సి) గోరటి వెంకన్న
డి) కె.టి.ఆర్

31) ఆదిలాబాద్ జిల్లాలో జరిగే గిరిజనుల పండుగ ఏది ?
ఎ) కొండగట్టు జాతర
బి) మేళ్ళచేర్వు జాతర
సి) పెద్దమ్మ జాతర
డి) బుర్నూరు జాతర

32) మొదటి శాతకర్ణి బిరుదు ఏంటి?
ఎ) శ్రీసముద్రీశ్వర
బి) దక్షిణ పధేశ్వర
సి) దక్షిణాధిపతి
డి) సామ్రాజ్యాధిపతి

33) కురుబ వంశస్థులు చేసే నృత్యం ఏది ?
ఎ) ధింసా నృత్యం
బి) పేరిణి నృత్యం
సి) రేల నృత్యం
డి) గొరవయ్యల నృత్యం

34) ఏడుపాయల జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ?
ఎ) మెదక్
బి) ఆదిలాబాద్
సి) వరంగల్
డి) మహబుబ్ నగర్

35) జగిత్యాల జిల్లాలో ఎక్కువగా ఏ జాతర జరుపుకుంటారు ?
ఎ) కొండగట్టు జాతర
బి) కొమరవెల్లి మల్లన్న జాతర
సి) పెద్దమ్మ జాతర
డి) కురుమూర్తి జాతర

36) గ్రామజ్యోతి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?
ఎ) 2015 జులై 20
బి) 2015 నవంబర్ 10
సి) 2015 ఆగస్ట్ 17
డి) 2015 జూన్ 11

37) వితంతువులకు అమలు చేస్తున్న ఆసరా పింఛన్ పథకాన్ని ఏ పేరుతో పిలుస్తారు ?
ఎ) జీవనాధారం
బి) జీవనోపాధి
సి) చేయూత
డి) రక్షణ

38) వాటర్ గ్రిడ్ పథకం పేరు ఏమిటి ?
ఎ) మిషన్ కాకతీయ
బి) మిషన్ భగీరథ
సి) ఆరోగ్య పథకం
డి) ఇవేవి కావు

39) మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు ?
ఎ) గోల్కొండ
బి) వరంగల్
సి) కొత్తూర్
డి) చిలుకూరు

40) తెలంగాణ ప్రాంత తొలి దళిత కవి ఎవరు ?
ఎ) భాగ్యరెడ్డి వర్మ
బి) రావిచెట్టు రంగారావు
సి) చింతపల్లి దున్న ఇద్దాసు
డి) చింతపల్లి రవన్న

41) వృషభపురాణం కవితా సంకలనం రచయిత ఎవరు ?
ఎ) వేమూరి నరసింహరెడ్డి
బి) పేర్వారం జగన్నాథం
సి) మాడపాటి హనుమంతరావు
డి) కోవెల సుప్రసన్నాచార్య

42) శాతవాహన రాజ్యస్థాపకుడు ఎవరు?
ఎ) రెండవ శాతకర్ణి
బి) హాలుడు
సి) సిముఖుడు
డి) మొదటి శాతకర్ణి

43) ఎవరి ఆస్థానంలో ఆచార్య నాగార్జుడు ఉండేవాడు ?
ఎ) యజ్ఞశ్రీ శాతకర్ణి
బి) గౌతమీ పుత్ర శాతకర్ణి
సి) శ్రీముఖుడు
డి) ఎవరూ కాదు

44) తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు జతపరచండి
1) సిల్వర్ ఫిలిగ్రీ
2) ఇక్కత్ ఫ్యాబ్రిక్
3) ఇత్తడి కళ
4) స్కోల్ పెయింటింగ్
ఎ) పెంబర్తి
బి) చేర్యాల
సి) కరీంనగర్
డి) పోచంపల్లి
ఎ) 1ఎ,2బి, 3సి, 4డి
బి)1సి, 2డి, 3ఎ, 4బి
సి) 1డి,2సి,3బి,4ఎ
డి) 1సి,2డి,3బి,4ఎ

45) ప్రసిద్ధ ప్రాంతాలకు సంబంధించి ఏది తప్పు ?
ఎ) లాండ్ ఆఫ్ టెంపుల్ ఇన్ తెలంగాణ - అలంపూర్
బి) సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ - పోచంపల్లి
సి) సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ - గంగదేవి పల్లి
డి) రూసాగడ్డికి ప్రసిద్ధి - నిజామాబాద్ జిల్లా

46) ఈ కింది వాటిలో భౌగోళిక గుర్తింపు పొందినవి ఏవి ?
1) నిర్మల్ బొమ్మలు
2) హైదరాబాద్ హలీం
3) గద్వాల్ చీరలు
4) సిద్ధిపేట్ గొల్లభామ చీరలు
ఎ) 1, 2 కరెక్ట్ 3,4 తప్పు
బి) 1,2,3,4 కరెక్ట్
సి) 1,2,3 కరెక్ట్ 4 తప్పు
డి) అన్నీ కరెక్ట్

47) ఈజిప్ట్ (కైరో)లోని తెహ్రిక్ చౌక్ దిగ్భంధనం ను ఆదర్శంగా తీసుకొని చేసిన కార్యక్రమం ?
ఎ) మిలియన్ మార్చ్
బి) తెలంగాణ మార్చ్
సి) ఛలో ట్యాంక్ బండ్
డి) సకల జనుల సమ్మె

48) తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడిన రోజు ఏది ?
ఎ) 2009 డిసెంబర్ 27
బి) 2009 డిసెంబర్ 29
సి) 2009 డిసెంబర్ 24
డి) 2009 డిసెంబర్ 23

49) తెలంగాణలో సహాయ నిరాకరణ ప్రోగ్రామ్ మొదలైన రోజు ఏది ?
ఎ) 2011 ఫిబ్రవరి 17
బి) 2011 ఫిబ్రవరి 19
సి) 2011 ఫిబ్రవరి 23
డి) 2011 ఫిబ్రవరి 18

50) సకలజనుల సమ్మె ప్రారంభించేనాటికి ఈ కింది పార్టీల్లో జేఏసీలో లేనిది ఏది ?
ఎ) టీఆర్ఎస్
బి) కాంగ్రెస్
సి) బీజేపీ
డి) సీపీఐ ఎంల్ పార్టీ