DPT-35- సైన్స్ అండ్ టెక్నాలజీ – 50 బిట్స్

1) గాల్వనైజేషన్ ప్రక్రియలో ఇనుము తుప్పు పట్టకుండా వేటిని పూతగా ఉపయోగిస్తారు ?
ఎ) జింక్
బి) సోడియం
సి) మెగ్నీషియం
డి) ఫాస్సేట్

2) భూ పటలంలో ఎక్కువగా దొరికే లోహం ఏది ?
ఎ) ఆక్సిజన్
బి) నత్రజని
సి) అల్యూమినియం
డి) ఇనుము

3) కిందివాటిలో ద్విదళ బీజం ఏది ?
ఎ) చిక్కుడు
బి) మామిడి
సి) వరి
డి) మొక్క జొన్న

4) ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ఏ మొక్కపై పరిశోధన ద్వారా హ్యోగో డివ్రీస్ కనిపెట్టారు ?
ఎ) బఠానీ మొక్క
బి) గులాబీ
సి) పై రెండూ
డి) ఈనోథర

5) జంతువులు, మొక్కలు లక్షణాలు కలిగిన జీవి ఏది ?
ఎ) అమీబా
బి) యూగ్లీన
సి) మొలస్కా జీవులు
డి) ఏదీ కాదు

6) వృక్ష శాస్త్ర పితామహుడు ఎవరు ?
ఎ) థియో ఫ్రాస్టిస్
బి) అరిస్టాటిల్
సి) గ్రెగర్ మెండల్
డి) డార్విన్

7) అయస్కాంత బలరేఖలను గీయడానికి అవసరమైన పరికరం ఏది ?
ఎ) దండయస్కాతం
బి) వెర్నియర్ కాలిపర్స్
సి) ప్లాటింగ్ కంపాస్
డి) ఏదీ కాదు

8) పసుపు, బంగాళ దుంపలు ఏ నేలల్లో పండుతాయి ?
ఎ) లాటరైట్ నేలలు
బి) ఒండ్రుమట్టి నేలలు
సి) ఎర్ర నేలలు
డి) దుబ్బ నేలలు

9) సాధారణ ఆవులో ఎన్ని రోజులకు అండం విడుదలవుతుంది ?
ఎ) 42 రోజులు
బి) 29 రోజులు
సి) 21 రోజులు
డి) 30 రోజులు

10) టైఫాయిడ్ జ్వరాన్ని ఏ పరీక్ష ద్వారా నిర్ధారణ చేస్తారు ?
ఎ) టైడల్ టెస్ట్
బి) వైడల్ టెస్ట్
సి) సీరల్ టెస్ట్
డి) వైరల్ టెస్ట్

11) కంటిలో ఏ భాగాన్ని దానం చేసి దాతలకు ఇస్తారు ?
ఎ) రెటీనా
బి) లెన్స్
సి) కూటకం
డి) కార్నియా

12) రీచార్జబుల్ బ్యాటరీల్లో వేటిని ఉపయోగిస్తారు ?
ఎ) మెర్క్యూరీ
బి) మెగ్నీషియం
సి) లిథియం
డి) ఏదీ కాదు

13) పాలను చీజ్ గా మార్చడానికి, రక్తం గడ్డకట్టడానికి ఈ కింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది ?
ఎ) కాల్షియం
బి) మెగ్నీషియం
సి) అయోడిన్
డి) ఏదీ కాదు

14) కిడ్నీలో ఏర్పడిన రాళ్ళల్లో ఉండేది ఏంటి ?
ఎ) లిథియం కార్బోనేట్
బి) కాల్షియం ఆక్సలేట్
సి) 1 మరియు 2
డి) ఏవీ కావు

15) గాగుల్స్ లో ఉపయోగించే రంగు అద్దాల్లో ఏమి ఉంటుంది
ఎ) ఫెర్రస్ ఆక్సైడ్
బి) మెగ్నీషియం ఆక్సైడ్
సి) ఫాస్పరస్
డి) ఏవీ కావు

16) చింతపండు, ద్రాక్షలో ఉండే ఆమ్లం ఏది ?
ఎ) మాలిక్ ఆమ్లం
బి) ఎసిటికామ్లం
సి) హైడ్రోక్లోరికామ్లం
డి) టార్టారిక్ ఆమ్లం

17) రక్తదానం చేసేటప్పుడు రక్తాన్ని వేటిద్వారా సేకరిస్తారు ?
ఎ) ధమనులు
బి) సిరలు
సి) రక్త కేశ నాళికలు
డి) నరాలు

18) కణజాలాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ?
ఎ) సైటాలజీ
బి) హిస్టాలజీ
సి) పాథాలజీ
డి) సంఫ్టమాలజీ

19) ఎబోలా వైరస్ ను మొదటిసారిగా ఏ దేశంలో కనుగొన్నారు ?
ఎ) కెన్యా
బి) దక్షిణాఫ్రికా
సి) రిపబ్లిక్ ఆఫ్ కాంగో
డి) సూడాన్

20) జికా వైరస్ ఏ దో వల్ల వ్యాపిస్తుంది ?
ఎ) ఈడిస్ ఈజిప్ట్ దోమ
బి) క్యూలెక్స్
సి) ఆడ ఎనాఫిలస్
డి) పైవన్నీ

21) జికా వైరస్ ను మొదట ఏ జంతువులో గుర్తించారు ?
ఎ) మనిషి
బి) కోతి
సి) చింపాంజి
డి) గబ్బిలం

22) క్యాషియార్కర్ వ్యాధి వేటి లోపం వల్ల వ్యాపిస్తుంది ?
ఎ) లిపిడ్స్
బి) మినరల్స్
సి) కార్బోహైడ్రేట్స్
డి) ప్రొటీన్లు

23) బొగ్గు గని కార్మికుల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి ఏది ?
ఎ) సిడరోసిస్
బి) బ్లాక్ లంగ్ డిసీజ్
సి) బేబీ సిండ్రోమ్
డి) పై మూడు

24) కలరా వ్యాధి మనిషి శరీరంలో ఏ భాగానికి సోకుతుంది ?
ఎ) కాలేయం
బి) పెద్ద పేగు
సి) చిన్న పేగు
డి) మెదడు

25) మద్యం ఎక్కువగా తీసుకునే వారు ఎక్కువగా ఏ వ్యాధితో చనిపోతారు ?
ఎ) కాలేయ క్యాన్సర్
బి) సిర్రోసిస్
సి) గొంతు క్యాన్సర్
డి) ఏదీ కాదు

26) ఆకుకూరలు ఎక్కువ కాలం తాజాగా ఉండటానికి కారణమేంటి ?
ఎ) ఇథిలిన్
బి) సైటోకైనిన్ లు
సి) జిబ్బరెలిన్
డి) అబ్ సైసిక్ ఆమ్లం

27) HIV ప్రధానంగా ఏ రక్త కణాలపై దాడి చేస్తుంది ?
ఎ) టి-లింఫో సైట్ లు
బి) మోనో సైట్లు
సి) న్యూట్రో ఫిల్స్
డి) ఏవీ కావు

28) సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ఉంది ?
ఎ) హైదరాబాద్
బి) లక్నో
సి) అలహాబాద్
డి) పుణే

29) కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడే ఆహార పదార్థాలు ఏవి ?
ఎ) కొవ్వులు
బి) ప్రొటీన్లు
సి) విటమన్లు
డి) కార్బోహైడ్రేట్లు

30) వంట గ్యాస్ లో ఉండే మిశ్రమ వాయువులు ఏవి ?
ఎ) బ్యూటేన్, ప్రొపేన్
బి) మిథేన్, ఎథిలిన్
సి) కార్బన్ డైయాక్సడ్, ఆక్సీజన్
డి) పై మూడు కరెక్టే

31) మానవ శరీరంలోని అతిపెద్ద ఎముక ఏది ?
ఎ) స్టెపిన్
బి) టిబియా
సి) టార్సస్
డి) ఫీమర్

32) దొంగనోట్లను గుర్తించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి ?
ఎ) ఎక్స్ కిరణాలు
బి) ఆల్ట్రా వాయిలెట్
సి) గామా కిరణాలు
డి) పరారుణ కిరణాలు

33) టీవీ రిమోట్ లో ఉండే కిరణాలు ఏవి ?
ఎ) పరారుణ
బి) ఆల్ట్రావాయిలెట్
సి) ఎక్స్ కిరణాలు
డి) గామా కిరణాలు

34) ధ్వని వేగం ఎందులో ఎక్కువగా ఉంటుంది ?
ఎ) గాలి
బి) ఉక్కు
సి) గాలి
డి) నీరు

35) భారతీయ తీరగస్తీ దళంలో భాగంగా ఏపీలోని నెల్లూరులో లంగర్ వేసిన గస్తీ నౌక ఏది ?
ఎ) ఆయుష్
బి) విక్రమ్
సి) హరియంత్
డి) ఏదీ కాదు

36) దేశంలో మొదటి సౌరశక్తి వినియోగ యుద్ధ నౌక ఏది ?
ఎ) INS విక్రాంత్
బి) INS సర్వేక్షక్
సి) INS ఆయుష్
డి) ఇంకా తయారు కాలేదు

37) ప్రపంచంలోనే ఎక్కువ కాలం సేవలందించిన ఏకైక యుద్ధ విమాన వాహక నౌక ఏది ?
ఎ) INS విక్రాంత్
బి) INS సర్వేక్షక్
సి) INS ఆయుష్
డి) INS విరాట్

38) మన దేశంలో 3 నుంచి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే మధ్యతరహా క్షిపణి ఏది ?
ఎ) అగ్ని - 3
బి) అగ్ని - 2
సి) షిజియాన్
డి) బ్రహ్మోస్

39) బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణికి మన దేశంలోని ఏ నది పేరు పెట్టారు ?
ఎ) బ్రహ్మపుత్ర
బి) సరస్వతి
సి) గంగానది
డి) ఏదీ కాదు

40) రోదసీలో ఎక్కువ కాలం గడిపిన మహిళగా ఎవరు రికార్డు సాధించారు ?
ఎ) జెఫ్ విలియమ్స్
బి) పిగ్గీ విట్సన్
సి) సునీతా విలియమస్
డి) ఎవరూ కాదు

41) భారత్ కు చెందిన రిఫత్ షరూక్ అనే విద్యార్థి తయారుచేసిన ప్రపంచంలోనే అతి చిన్న ఉపగ్రహాన్ని నాసా ప్రయోగించింది. దాని పేరేంటి ?
ఎ) కలాంశాట్
బి) భారత్ శాట్
సి) మోడీ శాట్
డి) ఏదీ కాదు

42) మేకిన్ ఇండియాలో భాగంగా భారత్ లో తొలి ప్రైవేటు ఆయుధ కర్మాగారం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది ?
ఎ) తెలంగాణ
బి) ఆంధ్రప్రదేశ్
సి) మధ్యప్రదేశ్
డి) గుజరాత్

43) పరిసరాల్లో పరిమితికి మించి ఉన్న విషపూరిత రసాయనాలను కనిపెట్టే సాధనాన్ని NDRF కు రక్షణమంత్రి అందజేశారు. దాని పేరేంటి ?
ఎ) ఈ నాసిక
బి) ఈ నోస్
సి) ఈ ఇయర్
డి) ఈ ఐస్

44) భోఫోర్స్ కుంభకోణంతో భారత సైన్యానికి రావాల్సిన శతఘ్నులు గతంలో నిలిచిపోయాయి. ప్రస్తుతం అత్యాధునిక తేలికపాటి హొవిట్జర్ శతఘ్నులను ఎక్కడ నుంచి సరఫరా అయ్యాయి ?
ఎ) ఇటలీ
బి) అమెరికా
సి) రష్యా
డి) ఇజ్రాయెట్

45 ) క్రూయిజ్ క్షిపణి బాబర్ ఏ దేశానికి చెందినది ?
ఎ) బంగ్లాదేశ్
బి) మయన్మార్
సి) చైనా
డి) పాకిస్థాన్

46) పైలట్ రహిత విమానంలో అమర్చే రాడార్ ఏది ?
ఎ) భరణి
బి) ఇంద్ర
సి) అగ్ని
డి) సూర్య

47) మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ అబ్దుల్ కలాం అయితే.... మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియా ఎవరు ?
ఎ) జెస్సీ థామస్
బి) టెస్సీ థామస్
సి) క్రిష్టోఫర్ థామస్
డి) ఎవరూ లేరు

48) టి-90 యుద్ధవిమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి ఎవరు ?
ఎ) అబ్దుల్ కలాం
బి) ప్రణబ్ ముఖర్జీ
సి) ప్రతిభా పాటిల్
డి) కె.ఆర్ నారాయణన్

49) మనదేశంలో ఇటీవల ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకున్న పరిశోధనా సంస్థ ఏది ?
ఎ) ISRO
బి) BSI
సి)CSIR
డి) ICAR

50) మనదేశంలో మొదటి అణుపరీక్షను 1974లో పోఖ్రాన్ లో నిర్వహించారు. దానికి ఏమని కోడ్ పెట్టారు ?
ఎ) స్మైలింగ్ బుద్ధ
బి) లాఫింగ్ బుద్ధ
సి) క్రైయింగ్ బుద్ధ
డి) ఏదీ కాదు