Tuesday, October 16
Log In

DPT-29-CURRENT AFFAIRS TOP 32

1) మహబూబ్ నగర్ జిల్లా ఎల్లూర్ రిజర్వాయర్ దగ్గర మిషన్ భగీరథ పథకానికి రూ.1500 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిన ప్రైవేటు బ్యాంకు ఏది ?
ఎ) ICICI
బి) ఆంధ్రాబ్యాంక్
సి) స్టేట్ బ్యాంక్
డి) కెనరా బ్యాంక్

2) దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకం కింద కొత్తగా అజీవిక గ్రామీణ ఎక్స్ ప్రెస్ యోజన పథకంను ఎవరు ప్రారంభించారు ?
ఎ) హర్షవర్ధన్
బి) అరుణ్ జైట్లీ
సి) రామ్ కృపాల్ యాదవ్
డి) రాం విలాస్ పాశ్వాన్

3) వైఫే ద్వారా అనుసంధానించి వైర్ లెస్ కవరేజీ కలిగిన దేశంలోనే మొదటి రాష్ట్ర సచివాలయం ఏది ?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) అరుణాచల్ ప్రదేశ్
సి) గుజరాత్
డి) న్యూఢిల్లీ

4) ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో మహిళల f-55 డిస్కస్ త్రో ఈవెంట్ లో కాంస్య పతకం ఎవరు గెలుచుకున్నారు ?
ఎ) ఆరమ్ జ్యోతి
బి) కరమ్ జ్యోతి
సి) సీమా పూనియా
డి) కృష్ణ పూనియా

5) చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ను ఏ విధంగా పేరు మార్చారు ?
ఎ) మద్రాస్ ఓపెన్
బి) బెంగళూరు ఓపెన్
సి) పుణె ఓపెన్
డి) మహారాష్ట్ర ఓపెన్

6) బ్రిటీష్ ఉన్నత న్యాయస్థానమైన యూకే కోర్ట్ ఆఫ్ అప్పీల్ లో నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు ?
ఎ) రబీందర్ సింగ్
బి) అరవింద్ సింగ్
సి) శివ్ జ్యోత్ సింగ్
డి) ఎవరూ కాదు

7) 2017 ఫార్చూన్ 500 జాబితాలో టాప్ లో నిలిచిన కంపెనీ ఏది ?
ఎ) అమెజాన్
బి) వాల్ మార్ట్
సి) డిమార్ట్
డి) మెట్రో రిటైల్

8) మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా అండ్ సౌత్ ఆసియా (MENASA) రీజియన్ కోసం ఐక్యరాజ్య సమితి  డేటా హబ్ ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది ?
ఎ) షార్జా
బి) కువైట్
సి) దుబాయ్
డి) ఇండియా

9) దేశంలో రేడియో ప్రసారాలకు సంబంధించి వీటిల్లో ఏవి ఖచ్చితం ?
1)  దేశంలో రేడియో ప్రసారాలు మొదలై  జులై 23, 2017 నాటికి 90 యేళ్ళు పూర్తయ్యాయి
2) మొదటి రేడియో స్టేషన్ : బాంబే స్టేషన్
3) 23 జులై 1927లో బాంబే స్టేషన్ ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్‌  సర్వీసెస్ విభాగం కింద ఏర్పాటైంది
4) ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్‌  సర్వీసెస్ ఆలిండియా రేడియోగా 8 జూన్ 1936లో అవతరించింది

5) ప్రసార భారతి కింద పనిచేస్తున్న ఆలిండియా రేడియో 30 భాషల్లో ప్రసారాలు చేస్తోంది
ఎ) 1,2,3,4
బి) 1,2,3 మాత్రమే
సి) 1,2,3,4,5
డి) 1,2 మాత్రమే

10) పేదలందరికీ (దారిద్ర్య రేఖకు దిగువనున్నవారికి) ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ?
ఎ) పంజాబ్
బి) రాజస్థాన్
సి) ఉత్తరప్రదేశ్
డి) గుజరాత్

11) గ్రామీణ స్థాయి నుంచి ఫుట్ బాల్ ఆటను ప్రోత్సహించేందుకు మిషన్ ఫుట్ బాల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
ఎ) అరుణాచల్ ప్రదేశ్
బి) మేఘాలయ
సి) అసోం
డి) మణిపూర్

12)  ప్రపంచంలో 2016 లో ఉగ్రవాద దాడులకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది ఖచ్చితం ?
1)  ఈ నివేదికను ప్రపంచ బ్యాంక్ తయారు చేసింది
2) మొదటి స్థానం - ఇరాక్ (2965 దాడులు)
3) రెండో స్థానంలో- ఆఫ్గనిస్తాన్ (1340)
4) మూడో స్థానం- భారత్ ( (927)
5) నాలుగో స్థానం - పాకిస్థాన్ ( 734)
ఎ) 1,2,3,4
బి) 1,2,3 మరియు 5
సి) 2,3,4,5
డి) అన్ని కరెక్టే

13) పదార్థ, వ్యతిరేక పదార్థాల లక్షణాలను కలిగిన ఓ ఏంజెల్ రేణువును ఏ స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇది ఏ దేశంలో ఉంది ?
ఎ) అమెరికా
బి) జపాన్
సి) ఫ్రాన్స్
డి) జర్మనీ

14) ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ సూపర్ క్యారియర్ USS గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ను ఏ దేశం సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టింది ?
ఎ) చైనా
బి) జపాన్
సి) అమెరికా
డి) ఉత్తర కొరియా
(నోట్: 1,106 అడుగులున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో 1 లక్షల టన్నుల బరువున్న ఆయుధాలు తీసుకెళ్ళ వచ్చు. దీనికి రెండు న్యూజనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్లు విద్యుత్ ను అందిస్తాయి )

15) యాత్రా స్థల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక బలోపేతంనకు సంబంధించిన కేంద్ర పథకం పేరేంటి ?
ఎ) అమృత్
బి) ప్రసాద్
సి) అజీవక్
డి) ఏదీ కాదు

16) కొత్త నౌకాయాన చట్టాలకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ ?
1) వివాదాల పరిష్కారానికి 1861, 1890 నాటి చట్టాలను రద్దు చేశారు
2) సవరణ బిల్లును రాజ్యసభలో రహదారులు, నౌకాయాన శాఖ సహాయమంత్రి మన్ సుఖ్ మాండవీయ ప్రవేశపెట్టారు
3) కొత్త చట్టం పేరు అడ్మిరాల్టీ-2017 ( పరిధి, నౌకా సంబంధ నష్టాలకు పరిహారం)
4) నౌకా సంబంధ నష్టాల పరిహారంపై వచ్చే వివాదాలు కలకత్తా, మద్రాస్, బొంబాయి హైకోర్టుల్లో పరిష్కరించే వారు
5) కొత్త చట్టం వస్తే కర్ణాటక, గుజరాత్, ఒడిషా, కేరళ, హైదరాబాద్ లో పరిష్కరిస్తారు
ఎ) 1,2,3 మాత్రమే
బి) 1,2,3,4 మాత్రమే
సి) అన్నీ కరెక్టే
డి) 1,2 మాత్రమే 3,4,5 కాదు

17) సైన్స్ రంగంలో విశేష కృషి చేసిన ఏ ప్రముఖ పాత్రికేయుడికి ఇందిరాగాంధీ పురస్కారం లభించింది ?
ఎ) అర్ణాబ్ గోస్వామి
బి) ప్రణయ్ రాయ్
సి) రజత్ శర్మ
డి) పల్లవ బగ్లా

18) యూనిసెఫ్ సౌహార్ద్ర రాయబారిగా మరో రెండేళ్ళపాటు పొడిగింపు పొందిన బాలీవుడ్ నటుడు ఎవరు ?
ఎ) అమితాబ్ బచ్చన్
బి) షారూఖ్ ఖాన్
సి) ఆమీర్ ఖాన్
డి) అజయ్ దేవ్ గణ్

19) ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వం 2014లో నియమించిన కమిటీ ఏది ?
ఎ) అనంత్ కుమార్ సిన్హా కమిటీ
బి) శ్యాంకుమార్ సిన్హా కమిటీ
సి) రాం కుమార్ సిన్హా కమిటీ
డి) అలాంటి కమిటీయే లేదు

20) రాష్ట్రపతి కోవింద్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ట్విట్టర్ ఖాతాలకు సంబంధించి కరెక్ట్ ఏది ?
1) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ట్విటర్ ఖాతా : @rashtrapati-bhvn
2) రామ్ నాథ్ ఫాలోవర్ల సంఖ్య 32.9 లక్షలు
3) గతంలో ప్రణబ్ ముఖర్జీ నిర్వహించిన ట్విటర్ ఖాతా  @presidentof India
4) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తుత ట్విటర్ ఖాతా @CitiznMukherjee
ఎ) 1,2,4
బి) 1,2,3
సి) 1,2 మాత్రమే
డి) అన్నీ కరెక్టే

21) రాష్ట్రపతి నివాసం, రాష్ట్రపతి భవన్ కు సంబంధించి ఏది కరెక్ట్ ?
1) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త నివాసం: 10, రాజాజీ మార్గ్
2) గతంలో ఇక్కడ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఉండేవారు
3) రాష్ట్రపతి భవన్ ను డిజైన్ చేసిన బ్రిటన్ ఆర్కిటెక్టు : సర్ ఎడ్విన్ ల్యాండ్ సీర్ లుటెయిన్స్
4) బ్రిటీష్ పాలనలో వైశ్రాయి నివాసంగా నిర్ణయించిన ఈ భవనం 1956 లో రాష్ట్రపతి భవన్ గా మారింది
ఎ) 1,2 మాత్రమే
బి) 1 మాత్రమే
సి) 1,2,3 మాత్రమే
డి) 1,2,3,4

22) కాబోయే భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరి పేరును CJI జస్టిస్ ఖేహర్ సిఫార్సు చేశారు ?
ఎ) జస్టిస్ భార్గవ్ మిశ్రా
బి) జస్టిస్ రమాదేవి
సి) జస్టిస్ వెంకటాచలం
డి) జస్టిస్ దీపక్ మిశ్రా

23) మనదేశంలో మాట్లాడే ప్రతి మాతృభాషను సంరక్షించి దానిని డాక్యుమెంట్ చేసే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దాని పేరేంటి ?
ఎ) స్పీల్
బి) బీల్
సి) సీల్
డి) డీల్

24) గూగుల్ CEO సుందర్ పిచాయ్ కు ఆ కంపెనీ మాతృసంస్థ డైరక్టర్ల బోర్డులో చోటు లభించింది.  ఆ సంస్థ పేరేంటి ?
ఎ) ఆల్ఫాబేట్
బి) బీటా గామా
సి) గూగుల్ బిఫోర్
డి) ఆల్ఫా గామా

25) హ్యాక్ చేయడానికి వీలులేని భారీ క్వాంటమ్ కంప్యూటర్ నెట్ వర్క్ ను అభివృద్ధి చేసిన దేశం ఏది ?
ఎ) జపాన్
బి) చైనా
సి) అమెరికా
డి) రష్యా

26) 2017 ఆసియన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఏ దేశంలో జరిగాయి ?
ఎ) ఇండోనేషియా
బి) భారత్
సి) చైనా
డి) నేపాల్

27) రాష్ట్రంలో జనాభా, రిజర్వేషన్లకు సంబంధించి ఏది ఖచ్చితం ?
1) 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్టీల జనాభా 9.06 శాతం
2) నోట్: సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎస్టీల జనాభా 10శాతం
3) 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీల జనాభా : 15.6శాతం
4) సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎస్సీల జనాభా 16.5 శాతం
ఎ) 1,3,4
బి) 1,2,4
సి) 1,2,3
డి) అన్నీ కరెక్టే

28) బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీ సహకారంతో మళ్లీ ప్రమాణాం చేశారు. బీహార్ శాసనసభలో మొత్తం సీట్లు ఎన్ని ?
ఎ) 243
బి) 244
సి) 245
డి) 246

29) దేశంలోనే మొదటిసారిగా జైళ్ళను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది ?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) తెలంగాణ
సి) పంజాబ్
డి) మధ్యప్రదేశ్

30) దేశంలోనే సొంత FM రేడియో స్టేషన్ ప్రారంభించిన మొదటి మెట్రో రైల్ స్టేషన్ ఏది ?
ఎ) ఢిల్లీ మెట్రో
బి) కొచ్చి మెట్రో
సి) లక్నో మెట్రో
డి) ముంబై మెట్రో

31) కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సావరిన్ గోల్డ్ బాండ్ పథకంలో అత్యధికంగా ఎంతమొత్తం బంగారం పెట్టుబడికి కేబినెట్ ఆమోదం తెలిపింది ?
ఎ) రెండు కేజీలు
బి) 500 గ్రాములు
సి) 4 కేజీలు
డి) ఎంతైనా

32) పేద, ధనిక తారతమ్యాలను తగ్గించే అసమానత్వ సూచీలో ప్రపంచ దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంత ?
ఎ) 132
బి) 133
సి) 148
డి) 152

 

note: జవాబులు 4:30 pm..