DPT 27-సింధూ నాగరికత

1) సింధు ప్రజల ప్రధాన రేవుపట్టణమైన లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది ?
ఎ) పంజాబ్
బి) సింధ్
సి) గుజరాత్
డి) మహారాష్ట్ర

2) సింధు నది పేరు మీదుగా గ్రీకులు ఏ పంటను సిండన్ అని పిలిచేవారు ?
ఎ) బార్లీ
బి) పత్తి
సి) గోధుమ
డి) వరి

3) సింధు ప్రజలు ముద్రికలను (Seals) దేనితో తయారు చేశారు ?
ఎ) చెక్క
బి) కంచు
సి) మట్టి
డి) స్టియాటైట్

4) సింధు నాగరికత హరప్పా నాగరికత లేదా సంస్కృతి అని పేరు పెట్టింది ఎవరు ?
ఎ) ఆర్.బి.దయారాం సహాని
బి) సర్ జాన్ మార్షల్
సి) ఆర్.డి. బెనర్జీ
డి) మార్టిమర్ వీలర్

5) సింధు ప్రజలకు తెలియని లోహం ఏది ?
ఎ) ఇనుము
బి) రాగి
సి) ఇత్తడి
డి) వెండి

6) సింధు నాగరికతను మొదటిసారిగా క్రీ.శ. 1826లో పేర్కోన్నది ఎవరు ?
ఎ) అలెగ్జాండర్ బర్న్స్
బి) దయారం సహాని
సి) చార్లెస్ మాజిన్
డి) సర్ జాన్ మార్షల్

7) సింధు ప్రజల ప్రధాన ఓడరేవు ఏది ?
ఎ) సూత్కజెండర్
బి) అలంఘీర్ పూర్
సి) సూర్కోటుడా
డి) లోథాల్

8) సింధు ప్రజలు విస్తారంగా వాడిన లోహం ఏది ?
ఎ) వెండి
బి) రాగి
సి) ఇత్తడి
డి) ఇనుము

9) 1831లో సింధు నాగరికత గురించి పేర్కోన్నది ఎవరు ?
ఎ) చార్లెస్ మాజిస్
బి) సర్ జాన్ మార్షల్
సి) ఎస్.ఆర్. రావు
డి) అలెగ్జాండర్ బర్న్స్

10) సింధు నాగరికత కంటే ముందు వెలసిన పట్టణం ఏది ?
ఎ) అమ్రి
బి) లోథాల్
సి) గుజరాత్
డి) దోలవీర

11) సింధు నాగరికత కాలంలో ధోవతి ధరించిన విగ్రహం బయటపడిన తొలి ప్రదేశం ఏది ?
ఎ) చన్హుదారో
బి) మేహర్ ఘర్
సి) హరప్పా
డి) లోథాల్

12) సింధు నాగరికతలో వర్ధిల్లిన పరిశ్రమల్లలో ఒకటైన పూసల పరిశ్రమకు అత్యంత ప్రముఖ కేంద్రం ఎక్కడ ఉంది ?
ఎ) దోలవీర
బి) కాలీబంగన్
సి) చన్హుదారో
డి) బన్వాలి నగరం

13) సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు ఏది ?
ఎ) వేపచెట్టు
బి) రావిచెట్టు
సి) తులసి చెట్టు
డి) మర్రిచెట్టు

14) సింధు నాగరికతలో వరి పంటకి సంబంధించిన ఆధారాలు ఏ నగరాల్లో లభించాయి ?
ఎ) కాలిబంగన్, అమ్రీ
బి) హరప్పా. మొహంజోదారో
సి) లోథాల్, రంగపూర్
డి) లోథాల్, కాలిబంగన్

15) సింధు నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలు కారణంగా పేర్కోన్నది ఎవరు ?
ఎ) రాబర్ట్ ఎల్.రైక్స్
బి) మార్టిమమ్ వీలర్
సి) వై.డి. శర్మ
డి) ఆర్.ఎస్.శర్మ

16) సింధు నాగరికత నగరాలన్నింటిలోనూ వైశాల్యం, జనాభా దృష్ట్యా అత్యంత పెద్ద నగరం ఏది ?
ఎ) మొహంజదారో
బి) రంగపూర్
సి) లోథాల్
డి) అమ్రీ

17) సింధువాసులు బాబిలోనియాతో వాణిజ్యంలో ప్రముఖ పాత్ర పోషించిన రేవు పట్టణం ఏది ?
ఎ) లోథాల్
బి) సూర్కోటుడా
సి) అలంఘీర్ పూర్
డి) సుత్కజెండార్

18) మూడుసార్లు వరదలకు గురైన సింధు నగరం ఏది ?
ఎ) మొహంజదారో
బి) లోథాల్
సి) చన్హుదారో
డి) పైవేవి కావు

19) సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన పక్షి ఏది ?
ఎ) పాలపిట్ట
బి) పావురం
సి) రామచిలుక
డి) సీతాకోకచిలుక

20) దేశంలో సింధు నాగరికత ప్రదేశాలు ఎక్కువగా ఎక్కడ బయటపడ్డాయి ?
ఎ) మహారాష్ట్ర
బి) పంజాబ్
సి) సింధ్
డి) గుజరాత్

21) సింధు ప్రజల కుటీర పరిశ్రమల్లో కెల్లా విస్తృతమైనది ఏది ?
ఎ) ఇటుకల తయారీ
బి) బొమ్మల తయారీ
సి) వస్త్రాల తయారీ
డి) ఇవేవి కావు

22) ఏ సింధు నాగరికతా ప్రాంతంలో ఒంటె ఆనవాళ్లు లభ్యమయ్యాయి ?
ఎ) హరప్పా
బి) మొహంజదారో
సి) కాలిబంగన్
డి) లోథాల్

23) లోథాల్, చాన్హుదారో పట్టణాలు ఏ పరిశ్రమలకు ప్రసిద్ధి గాంచాయి ?
ఎ) నౌక పరిశ్రమ
బి) పూసల పరిశ్రమ
సి) లోహ పరిశ్రమ
డి) నేత పరిశ్రమ

24) ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించిన  నాగరికత ఏది ?
ఎ) పర్షియా నాగరికత
బి) ఈజిప్ట్ నాగరికత
సి) మెసపటోమియా నాగరికత
డి) సింధు నాగరికత

25) సింధు నాగరికత ఏ యుగానికి చెందిన నాగరికత ?
ఎ) రాతి యుగం
బి) ఆధునిక యుగ
సి) కంచు యుగం
డి) ఏదీ కాదు

 

note: జవాబులు 1:30 pm