DPT-16 – PRESIDENT OF INDIA (ANS)

1) భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాని వారు
ఎవరు ?
ఎ) పార్లమెంటు సభ్యులు
బి) ఎమ్మెల్సీలు
సి) ఎమ్మెల్యేలు
డి) ఎవరూ కాదు

2) రాష్ట్రపతితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు ?
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) ఉప రాష్ట్రపతి
సి) లోక్ సభ స్పీకర్
డి) భారత అటార్నీ జనరల్

3) రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదాలను పరిశీలించి, తగిన తీర్పులు ఇచ్చేది ఎవరు ?
ఎ) ఎన్నికల సంఘం
బి) పార్లమెంటు
సి) సుప్రీంకోర్టు
డి) ఎవరూ కాదు

4) రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈ కింది వాటిలో ఏ విధానం సరైనది ?
ఎ) రహస్య బ్యాలెట్ ఓటింగ్
బి) నైష్పత్తిక బదిలీ చేసే పద్దతి
సి) ఓటును బదిలీ చేసే పద్దతి
డి) పైవన్నీ

5) భారత రాష్ట్రపతి విషయంలో ఈ కింది వాటిలో ఏది తప్పు ?
ఎ) రాజ్యాధినేత
బి) ప్రభుత్వాధినేత
సి) ప్రథమ పౌరుడు
డి) త్రివిధ దళాలధిపతి

6) రాష్ట్రపతి ప్రస్తుత నెల జీతం ఎంత ?
ఎ) రూ.1.00లక్ష
బి) రూ.1.25లక్ష
సి)రూ.2.00లక్షలు
డి) రూ.1.50లక్షలు

7) రాష్ట్రపతి ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఎన్నోవంతు ఓట్లు రాకపోతే డిపాజిట్ కోల్పోయినట్టుగా పరిగణిస్తారు ?
ఎ) 1/6
బి) 1/10
సి) 1/3
డి) 1/5

8) పార్లమెంటులో ప్రవేశపెట్టే ఏ బిల్లుల విషయంలో ముందుంగా రాష్ట్రపతి అనుమతి పొందాలి ?
ఎ) సాధారణ బిల్లులు
బి) రాజ్యాంగ సవరణ బిల్లులు
సి) ఆర్థిక బిల్లులు
డి) పైవన్నీ

9) రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ ను ఎలక్టోరల్ కాలేజీలో ఎంతమంది ప్రపోజ్ చేయాలి, ఎంతమంది సమర్థించాలి ?
ఎ) 75, 50
బి) 50,50
సి) 100, 100
డి) 75,75

10) పార్లమెంటు సభ్యులు కాని వారిని ఎంతమందిని రాష్ట్రపతి నామినేట్
చేస్తారు ?
ఎ) 12
బి) 14
సి) 2
డి) 16

11) భారత రాష్ట్రపతి ఎన్నకను ఎవరు నిర్వహిస్తారు ?
ఎ) ఎన్నికల సంఘం
బి) పార్లమెంటు సెక్రటరియేట్
సి) రాష్ట్రపతి భవన్ అధికారులు
డి) కేంద్ర ప్రభుత్వం

12) రాష్ట్రపతికి సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పు ?
ఎ) రాష్ట్రపతి 5యేళ్ళ పాటు పదవిలో ఉంటారు
బి) ఆర్థిక బిల్లుల విషయంలో ముందుగా అనుమతి తీసుకోవాలి
సి) తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి అందిస్తారు
డి) రాష్ట్రపతి పదవికి 2 సార్లు కంటే ఎక్కువ పోటీ చేయకూడదు

13) రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ ఎన్ని రోజులు అమల్లో ఉంటుంది ?
ఎ) 222 రోజులు
బి) 200 రోజులు
సి) 90 రోజులు
డి) 180 రోజులు

14) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు రెండూ ఖాళీ అయితే రాష్ట్రపతిగా ఎవరు బాధ్యతలు చేపడతారు ?
ఎ) భారత అటార్నీ జనరల్
బి) రాజ్యసభ ఉపాధ్యక్షుడు
సి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
డి) లోక్ సభ స్పీకర్

15) రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానంనకు సంబంధించిన నిబంధన ఏది ?
ఎ) 59
బి) 61
సి) 60
డి) 62

16) భారత్ లో ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి ఎవరు ?
ఎ) బాబూ రాజేంద్ర ప్రసాద్
బి) వి.వి. గిరి
సి) జాకీర్ హుస్సేన్
డి) నీలం సంజీవ రెడ్డి

17) రాష్ట్రపతి సుప్రీంకోర్టు నుంచి న్యాయవిషయాలపై సలహా తీసుకునే ప్రకరణ ఏది ?
ఎ) 143
బి) 134
సి) 155
డి) 145

18) ప్రణబ్ ముఖర్జీ ఎన్నో రాష్ట్రపతి ?
ఎ) 14
బి) 12
సి) 13
డి) 15

19) ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు ?
ఎ) శంకర్ దయాళ్ శర్మ
బి) వి.వి. గిరి
సి) ఆర్. వెంకట్రామన్
డి) అబ్దుల్ కలాం

20) రాష్ట్రపతిని సర్వసైన్యాధ్యుక్షుడిగా పేర్కొనడాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు ?
ఎ) అమెరికా
బి) రష్యా
సి) ఇంగ్లండ్
డి) ఐర్లాండ్

21) 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో రెండో ప్రాధాన్యతా ఓట్లతోటి గెలిచిన వ్యక్తి ఎవరు ?
ఎ) నీలం సంజీవ రెడ్డి
బి) వి.వి.గిరి
సి) అబ్దుల్ కలాం
డి) సర్వేపల్లి రాధా కృష్ణన్

22) అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసినది ఎవరు ?
ఎ) నీలం సంజీవ రెడ్డి
బి) జాకీర్ హుస్సేన్
సి) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
డి) సర్వేపల్లి రాధాకృష్ణన్

23) ది టర్బులెంట్ ఇయర్స్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ?
ఎ) ప్రణబ్ ముఖర్జీ
బి) అబ్దుల్ కలామ్
సి) హమీద్ అన్సారీ
డి) జాకీర్ హుస్సేన్

24) రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి ఈ కింది అధికారాలు లేవు ?
ఎ) కార్యనిర్వహణాధికారాలు
బి) శాసనాధికారాలు
సి) న్యాయాధికారాలు
డి) విచక్షణాధికారాలు

25) రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఉద్దేశించిన నిబంధన ఏది ?
ఎ) 356
బి) 360
సి) 352
డి) 369

Friends, 
ఇంకా FACE BOOK ను ఫాలో అవని వారు telanganaexams కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి. telanganaexams పేజీ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ ను accept చేయండి. దీంతో వెబ్ సైట్ అప్ డేట్ సమాచారం నేరుగా మీకు చేరుతుంది.