Thursday, June 27

డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ రిలీజ్

హైదరాబాద్‌:
తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కోసం ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం మూడు విడతల్లో సీట్ల కేటాయిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలు రీవెరిఫికేషన్ ఫలితాలు ఈ నెల 27న విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో ఈ నోటిఫికేషన్‌ను వాయిదా వేసిన దోస్త్ కమిటీ మళ్ళీ షెడ్యూల్ ప్రకటించింది. డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు సంబంధించిన ముఖ్య తేదీలను ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

నోటిఫికేషన్‌ వివరాలు

- ఈ నెల 23 నుంచి జూన్‌ 3 వరకు తొలి విడత దోస్త్‌ రిజిస్ట్రేషన్లు

- ఈ నెల 25 నుంచి జూన్‌ 3 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం

- జూన్‌ 10 వరకు మొదటి విడత సీట్ల కేటాయిస్తారు

- జూన్‌ 10 నుంచి 15 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు

- జూన్‌ 20న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

- జూన్‌ 20 నుంచి 26 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు.

- జూన్‌ 29న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు

- జులై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం అవుతాయి.