Tuesday, September 25
Log In

డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్

రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈనెల 10 నుంచి 26 వరకూ ఆన్ లైన్ లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రూ.400 ఫైన్ తో మే 25 నుంచి 29 వరకూ అప్లయ్ చేసుకోవచ్చు.

మొదటి విడత సీట్లను జూన్4న

రెండో విడత సీట్లను జూన్ 19న

మూడో విడత సీట్లను జూన్ 30న కేటాయిస్తారు.

రెండో విడత వెబ్ ఆప్షన్స్ జూన్ 5 నుంచి 14 వరకూ ఆ తర్వాత 3 విడత వెబ్ ఆప్షన్స్ జూన్ 20 నుంచి 27 వరకూ ఇవ్వడానికి విద్యార్థులకు అవకాశం ఉంది.

కాలేజీలు ప్రారంభమైన తర్వాత అంతర్ కాలేజీల మార్పునకు అవకాశం ఇస్తారు. దాంతో కోర్సు కూడా (గ్రూప్ ఛేంజ్ ) చేసుకోవచ్చు. ఎంసెట్ తో దోస్త్ తో లింకేజ్ చేస్తారు. దాంతో ఇంజనీరింగ్ సీట్లు పొందిన విద్యార్థుల యొక్క డిగ్రీ సీట్లు రద్దవుతాయి. దోస్త్ కోసం రాష్ట్రమంతటా 74 హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటుచేశారు. ఇతర వివరాలకు ఈ కింది  వెబ్ సైట్ లో లాగిన్ అవ్వొచ్చు.

http://www.dost.cgg.gov.in