Sunday, August 19
Log In

డీఈడీ రెండేళ్ళు రద్దు.. ఇక నాలుగేళ్ళు !

ప్రాథమిక పాఠశాలల్లో బోధనకు అవసరమయ్యే రెండేళ్ళ డీఈడీ కోర్సు ఇకపై రద్దు కానుంది. దీని స్థానంలో నాలుగుగేళ్ళ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (BELed) కోర్సును ప్రవేశపెట్టనున్నారు. 2019-20 విద్యాసంవత్సరం నుంచి ఇది అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డీఈడీతో విద్యార్థులకు బోధించే స్థాయి సరిపోవడం లేదనీ, అందువల్ల దాన్ని రద్దు చేసి డిగ్రీతో పాటు BELed విద్యను ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ( NCTE) వర్గాలు తెలిపాయి. 2014లో సంస్కరణలు మొదలుపెట్టిన NCTE అప్పట్లోనే BELED ప్రవేశపెట్టాలని భావించింది. అయితే DEd ని ఇప్పటికిప్పుడు రద్దు చేయాలా... మరో రెండేళ్లు కొనసాగించాలా... అన్నదానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.

NCTE నిబంధనల ప్రకారం ఇంటర్ తో DEd చేసిన వారు ఒకటి నుంచి 5 తరగతులు బోదించడానికి అర్హులవుతారు. డిగ్రీ ఉంటే ఒకటి నుంచి 8 వరకూ బోధించవచ్చు. డిగ్రీతో బీఈడీ చేసినవారు 8 నుంచి 12 తరగతుల వరకూ చెప్పడానికి అర్హత కలిగి ఉన్నారు.

2019-20 నుంచే కొత్త కోర్సులు

రెండేళ్ల బీఈడీ కోర్సు బదులుగా నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రవేశపెడతామని గత బడ్జెట్ లోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందువల్ల 2019-20 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం, ఎయిడెడ్ కాలేజీల్లో BA-BEd, BSc-BEd., కోర్సులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే ఉన్న రెండేళ్ళ బీఈడీ కోర్సును మరో రెండేళ్ళ పాటు అంటే 2020-21 వరకూ కొనసాగించే అవకాశాలున్నాయి. కొత్త కోర్సులు మొదలుపెట్టినప్పటికీ... పాత రెండేళ్ళ కోర్సులను కూడా కంటిన్యూ చేయనున్నారు.