DAY -3 – VERBని ఎప్పుడు ఎలా వాడాలి ?

DAY -3 ( HOME WORK CONTINUE)

అంతకుముందు జరిగిన పనులు ?

అప్పుడే జరిగిన పనులు ?

చేయకూడని పనులకు ఏం ఉపయోగించాలి ?

గతంలో అంతకుముందే జరిగిన పనులకు II (3) ను ఉపయోగించాలి

1 నిన్న 5 PM కంటే ముందే నేను బస్టాండుకు చేరుకున్నాను.
2 నేను వెళ్ళేసరికి వాళ్ళు లంచ్ మొదలుపెట్టారు
3 ఆమె నన్ను కలిశాకే, నీ దగ్గరకు వచ్చింది
4 108 వచ్చే సరికి అతను చనిపోయాడు
5 సచిన్ క్రీజులోకి రాకముందే ధోనీ సెంచరీ చేశాడు
6 నేను స్టేషన్ కి వెళ్ళేసరికి Train వెళ్ళిపోయంది
7 ఆమె డిగ్రీ కంటే ముందే కంప్యూటర్స్ నేర్చుకుంది
8 నిన్నఉదయం నీ కంటే ముందే నేను మేనేజర్ ను కలిశాను
9 శ్రావణి రాజీనామా చేయడం కంటే ముందు, భాస్కర్ ఆ జాబ్ కోసం అప్లయ్ చేశాడు
10 చిరంజీవి రాజకీయాల్లోకి రావడం కంటే ముందే జీవిత, రాజశేఖర్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు.
11 అంతకుముందే ఇంజనీర్ ఇంటి ప్లాన్ గీశారు
12 నేను వెళ్ళడం కంటే ముందే కిషోర్ బ్యాంక్ లో మనీ డిపాజిట్ చేశాడు
13 అంతకుముందే బాలు మార్కెట్ కు వెళ్ళాడు
14 లావణ్య కంటే ముందే లత బీ.టెక్ పూర్తి చేసింది
15 ఖమ్మం బస్ కంటే ముందే కోదాడ బస్ బయలుదేరింది
16 ఆమె కంటే ముందు అతను నన్ను కలిశాడు
17 ఆమె కాలేజీకి బయలుదేరడం కంటే ముందే సీతకి ఫోన్ చేసింది
18 నా కంటే ముందే అతను ఎఏ పూర్తి చేశాడు
19 అంతకుముందే  వారు పరీషలు వాయిదా వేశారు
20 జూన్ కంటే ముందే వారు స్కూల్ ఓపెన్ చేశారు.
21 అంతకుముందే నేను నీకు తెలియపరిచాను
22 రవి బి.ఎ. తీసుకోవడం కంటే ముందే నన్ను సలహా అడిగాడు
23 వర్కర్స్ సాయంత్రం 5 కంటే ముందే సమ్మె నోటీస్ ఇచ్చారు
24 అంతకుముందే క్లర్క్ మేనేజర్ ని కలిశాడు
25 నేను నీకు హెల్ప్ చేసే ముందే వారిని సలహా అడిగాను
26 నేను బస్ లోకి ఎంటర్ కావడం కంటే ముందుగానే వారు సీట్లు ఆక్రమించారు
27 అంతకుముందే నేను నీకు చెప్పాను
28 సీఎం సాయంత్రం 4 కంటే ముందే ఢిల్లీ చేరుకున్నాడు
29 నిన్న మీకంటే ముందే నేను ఎంపీని కలిశాను
30 వారు రవి కంటే ముందే స్టేషన్ కి చేరుకున్నారు.

గతంలో అప్పుడు జరుగుతూనే ఉన్న పనులకు II (4) ను ఉపయోగించాలి

1 ఆమె నిన్న సాయంత్రం 4 అప్పుడు కూడా టైప్ చేస్తూనే ఉంది
2 నేను నీ కోసం ఈరోజు ఉదయం వరకూ ఎదురు చూస్తూనే ఉన్నాను
3 నిన్న ఆమె కాలేజీకి వెళ్ళేసరికి దాదాపు గంట సేపటి నుంచి మ్యాథ్స్ సార్ క్లాస్ చెబుతూనే ఉన్నారు.
4 అప్పుడు వారు రాస్తూనే ఉన్నారు
5 నిన్న ఉదయం 7 గంటల అప్పుడు వాళ్ళు వాకింగ్ చేస్తూనే ఉన్నారు
6 అప్పుడు నేను గ్రౌండ్  లో క్రికెట్ ఆడుతూనే ఉన్నాను
7 ఆమె రాత్రి 9 గం. వరకూ టీవీ చూస్తూనే ఉంది
8 గత సంవత్సరం జూన్ వరకూ వారు కొబ్బరికాయల బిజినెస్ చేస్తూనే ఉన్నారు
9 నేను నిన్నటి వరకూ లెటర్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను
10 మేము సావిత్రిని హాస్పిటల్ కు తీసుకెళ్ళేంత వరకు ఆమె జ్వరంతో బాధపడుతూనే ఉంది
11 సచిన్ అప్పుడు ఆడుతూనే ఉన్నాడు
12 నిన్న నేను వెళ్ళేసరికి ఆమె పనిచేస్తూ ఉంది
13 గత నెల వరకూ నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తూనే ఉన్నాను
14 శ్రీను అప్పటి వరకూ వాళ్ళని ఫాలో అవుతూనే ఉన్నాడు
15 పెళ్లికి ముందు వరకూ ఆమె కాలేజీకి వెళుతూనే ఉంది

చేయకూడని పనులకు మనం SHOULD NOT ను ఉపయోగించాలి

1 మనం ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించకూడదు
2 మనం ఎవరికి హాని చేయకూడదు
3 మనం ఇతరులతో తగాదాలు పెట్టుకోకూడదు
4 పిల్లలు చెడు అలవాట్లు నేర్చుకోకూడదు
5 పెద్ద వాళ్ళు, పిల్లల్లా ప్రవర్తించకూడదు
6 మీరు అబద్దాలు చెప్పకూడదు
7 మనం డ్రైవింగ్ లెసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు
8 మనం డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టకూడదు
9 మనం మందును ఎక్కువగా తీసుకోకూడదు
10 మనం రోడ్ల మీద ఆడకూడదు
11 మనం రోడ్డు మధ్యలో నడవకూడదు
12 మనం Rules కి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు
13 మీరు దేవాలయంలోకి చెప్పులతో వెళ్ళకూడదు
14 కాలం చెల్లిన మందులను మనం వాడకూడదు
15 నీవు అప్పులు ఎక్కువగా చేయకూడదు
16 నీవు అలా చేయకూడదు
17 నీవు అక్కడికి వెళ్ళ కూడదు
18 మనం వారిని తప్పుగా అర్థం చేసుకోకూడదు
19 ప్రతి విషయానకి మనం ఇతరుల మీద ఆధారపడకూడదు
20 మనం ఎవరినీ నొప్పించకూడదు
21 మనం ఇతరుల విషయాలు గురించి చర్చించకూడదు
22 మనం అనవసరం విషయాల గురించి చర్చించకూడదు
23 మనం అవినీతిని ప్రోత్సహించకూడదు
24 అధికారులు వారి అధికారాన్ని దుర్వినియోగగం చేసుకోకూడదు
25 రౌడీలను, గూండాలను మనం నాయకులుగా ఎన్నుకోకూడదు
26 పిల్లలు ఎక్కువగా సినిమాలు చూడకూడదు
27 మీరు అల్లరి చేయకూడదు
28 నీవు అలా ప్రవర్తించకూడదు
29 మనం భోజనం చేయగానే నిద్రపోకూడదు
30 మనం చెట్లు నరకకూడదు

తప్పనిసరి పనులకు Have to ను ఉపయోగించాలి

1 నేను school కి వెళ్ళాలి
2 మనం English నేర్చుకోవాలి
3 నీవు ఇక్కడకి రావాలి
4 అతడు ఈ letter ను post చేయాలి
5 ముందు నీవు నిజం తెలుసుకోవాలి
6 ముందు నీవు సంస్కారం నేర్చుకోవాలి
7 మనం Exam బాగా రాయాలి
8 నీవు బండి మీద నెమ్మదిగా వెళ్లాలి
9 నీవు వాళ్ళతో మాట్లాడాలి
10 నీవు దీని గురించి Serious గా ఆలోచించాలి
11 నీవు Light వేయాలి
12 నీవు Light ఆర్పివేయాలి
13 మనం మార్కెట్ కి వెళ్ళాలి
14 నేను కూరగాయలు కొనడానికి market కి వెళ్ళాలి
15 మనం ప్రతిరోజూ వ్యాయామం చేయాలి
16 నేను books తెచ్చుకోడానికి Library కి వెళ్ళాలి
17 నేను English Class కి attend కావాలి
18 మనం English లో మాట్లాడటానికి ప్రయత్నించాలి
19 మనం ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలి
20 నేను ఈ రోజు చాలా work చేయాలి
21 ఆమె ఈ రోజు చాలా పని చేయాలి
22 నీవు ఇక్కడికి వెంటనే రావాలి
23 నీవు నీ నుంచి చాలా నేర్చుకోవాలి
24 ఆమె Hyderabad నుంచి ఇక్కడికి రావాలి
25 నేను నా Friend కి letter రాయాలి
26 మనం మంచి వాళ్ళతో మాత్రమే Friendship చేయాలి
27 మనం పెద్దవాళ్ళని గౌరవించాలి
28 మనం ఇతరులతో మర్యాదగా మాట్లాడాలి
29 నేను నీట్ గా రాయాలి
30 ఆమె తన పద్దతి మార్చుకోవాలి
31 రవి English లో Hard work చేయాలి
32 Sita బాగా పాడాలి
33 వారు రోడ్డుకు ఎడమ ప్రక్క నడవాలి
34 మీరు Principal పర్మిషన్ తీసుకోవాలి
35 నేను Cricket ఆడాలి
36 నేను ఎన్నో నేర్చుకోవాలి
37 నేను బాగా తినాలి
38 నేను జాగ్రత్తగా వినాలి
39 నేను చూడాలి
40 నీవు Doctor ని కలవాలి
41 నేను రేపు Hyderabad కి వెళ్లాలి
42 నేను నా Friend కి Help చేయాలి
43 నేను వాళ్ళతో ఈ విషయం చెప్పాలి
44 నేను ఈ విషయం గురించి కనుక్కోవాలి
45 నీవు Meeting arrange చేయాలి
46 ఆమె meals చేయాలి
47 వాళ్ళు నా problem ని అర్థం చేసుకోవాలి
48 Principal ఈ Students ని Exam కి allow చేయాలి
49 Sachin ఈ మ్యాచ్ లో Century చేయాలి
50 మనం దేవుడిని నమ్మాలి
51 నువ్వు అన్ని Questions కి Answer చేయాలి
52 మనం Good leaders ని ఎన్నుకోవాలి
53 Students classroom లో discipline maintain చేయాలి
54 మనం ఈ problem ని discuss చేయాలి
55 అతను manners నేర్చుకోవాలి
56 మనం poor people కి Help చేయాలి
57 నువ్వు door lock చేయాలి
58 Bhaskar Students ని కంట్రోట్ చేయాలి
59 ఆమె అన్ని విషయాలు చెప్పాలి
60 మీరు doubts అడగాలి.

(NOTE: 4th Day పాఠాలను శనివారం అందించగలము... ఈలోగా  3 రోజుల లెసన్స్ తో పాటు Exercises ను మరోసారి revision చేసుకోగలరు )