Thursday, March 21

CURRENT AFFAIRS – NOV 17

రాష్ట్రీయం
01) ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ప్రపంచ దేశాల్లోని 20 వినూత్న పథకాల్లో ఎంపికైన తెలంగాణకి చెందిన పథకాలు ఏవి ?
జ: రైతు బంధు పథకం, రైతు బీమా పథకం
02) రైతు బంధు, రైతు బీమా పథకాల గురించి వివరించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం పంపింది. ఈనెల 21-23 తేదీల్లో ఐరాస వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ హెడ్డాఫీసు రోమ్ లో ప్రసంగించడానికి వెళ్తున్నది ఎవరు ?
జ: వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థ సారధి
03) బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో సంస్కరణలు తెచ్చినందుకు ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావుకి ఏ అవార్డు లభించింది ?
జ: విద్యా నాయకత్వ పురస్కారం
(నోట్: బిజినెస్ స్కూల్ అఫైర్, దేవాంగ్ మెహతా జాతీయ విద్యాసంస్థలు ఈ అవార్డును బహుకరించాయి )
04) రాష్ట్రంలోని పరిశ్రమలోకెల్లా అత్యుత్తమ యాజమాన్య సంస్థగా తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ పురస్కారం ఏ సంస్థకు దక్కింది ?
జ: సింగరేణి కాలరీస్
(నోట్: వరల్డ్ HRD కాంగ్రెస్ నిర్వాహకులు ప్రకటించారు )
05) భారత శస్త్ర చికిత్స నిపుణుల సంఘం (ASI) అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: డాక్టర్ పి.రఘురాం

జాతీయం
06) 2018 సంవత్సరానికి ఫార్చూన్ ప్రకటించిన అత్యుత్తమ వ్యాపారవేత్తల జాబితాలో 12వ ర్యాంకు సాధించిన అడోబ్ CEO ఎవరు ?
జ: శంతను నారాయణ్
07) ప్రభుత్వంతో RBI విభేదాలు, పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై ప్రశ్నించేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2018 నవంబర్ 27న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను విచారణకు పిలుస్తోంది. ఈ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?
జ: వీరప్ప మొయిలీ ( ఇందులో 31మంది సభ్యులు ఉన్నారు )
08) స్పెయిన్ లో జరిగిన ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్ లో స్వర్ణాలు గెలుచుకున్న క్రీడాకారులు ఎవరు ?
జ: గుకేశ్, సవితశ్రీ

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
ప్రారంభం అయ్యాయి.  ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/