Thursday, June 27

CURRENT AFFAIRS – JULY 23

రాష్ట్రీయం
01) అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ శాన్ ఫ్రాన్సిస్కోలో 2018 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకూ జరిగే ప్రపంచ వాతావరణ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొనడానికి మన రాష్ట్రం నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి ఎవరు ?
జ: పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
02) రాష్ట్రంలో బహిరంగ మలమూత్ర విసర్జన లేని (ODF) జిల్లాల సంఖ్య ఎంత ?
జ: 11
03) నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో 2009 డిసెంబర్ లో తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసిన కానిస్టేబుల్ ఎవరు?
జ: కృష్ణయ్య
(నోట్: ఆయన కుటుంబానికి సీఎం కేసీఆర్ రూ.5లక్షల ఆర్థిక సాయం చేశారు)
04) ప్రజా వ్యవహారాల కేంద్రం (PAC) అనే సంస్థ విడుదల చేసిన ప్రజా వ్యవహారాల సూచికలో స్ఫూర్తిదాయక ప్రభుత్వ పాలనలో తెలంగాణకి ఎన్నో ర్యాంక్ వచ్చింది ?
జ: 3వ ర్యాంక్ (మొదటి ర్యాంక్ కేరళ - వరుసగా మూడోసారి సాధించింది)

జాతీయం
05) సన్సద్ ఆదర్శ గ్రామ్ యోజన కింద ఎంపీలు గ్రామాలను దత్తత తీసుకునే కార్యక్రమం ఏ ఏడాదిలో మొదలైంది ?
జ: 2014 అక్టోబర్ లో
06) సన్సద్ ఆదర్శ గ్రామ్ యోజన కింద ఒక్కో ఎంపీ 2016లో ఒక గ్రామం, 2019లో 2 గ్రామాలు దత్తత తీసుకోవాలి. 2024లో ఎన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలి ?
జ: ఐదు గ్రామాలు
07) ఎంపీ లాడ్స్ నిధులను రాష్ట్రంతో పాటు కేంద్రానికి చెందిన ఎన్నెన్ని పథకాలకు వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది ?
జ: కేంద్రం పథకాలు 223, రాష్ట్రాల్లో అమల్లో ఉన్న 1806 రకాలు పనులు
08) మొబైల్ ఫోన్ నుంచే జనరల్ రైల్వే టిక్కెట్లు పొందేందుకు రైల్వేశాఖ తీసుకొచ్చిన మొబైల్ యాప్ కు ఆదరణ లభిస్తోంది. ఆ యాప్ ఏది ?
జ: UTS ఆన్ మొబైల్
09) వస్తు సేవల పన్ను (జీఎస్టీలో) ఇటీవల కొన్ని శ్లాబులను సవరించడంతో ప్రస్తుతం 28శాతం పన్ను రేటులో ఎన్ని వస్తువులు మిగిలాయి ?
జ: 35 వస్తువులు (గతంలో 191 వస్తువులు ఉండేవి)
10)బాలికల పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజనలో ఏటా జమ చేసే కనీస మొత్తాన్ని ఎంతకు తగ్గించారు ?
జ: రూ.250 లకు (గతంలో రూ.1000గా ఉండేది )
11)అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య ప్రకటించిన 2017 వార్షిక అవార్డుల్లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ కి ఎంపికైనది ఎవరు ?
జ: భారత కెప్టెన్, సాకర్ స్టార్ సునీల్ చెత్రి
(నోట్: భైచుంగ్ భూటియా తర్వాత వంద అంతర్జాతీయ మ్యాచులు ఆడిన భారత ఆటగాడిగా ఘనత సాధించాడు )
12) మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికైంది ఎవరు?
జ: కమలా దేవి (మణిపూర్)
13) ఇంటర్ కాంటినెంటల్ కప్ లో రాణించిన ఎవరికి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ప్రకటించారు ?
జ: అనిరుధ్ థాపా

అంతర్జాతీయం
14) సూర్యుడి గురించి లోతుగా అధ్యయనం చేసేందుకు 2018 ఆగస్టు 6న ఏ వ్యోమ నౌకను సానా ప్రయోగించనుంది ?
జ: పార్కర్ సోలార్ ప్రోబ్
15) జర్మన్ గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేసులో ఎవరు ఛాంపియన్ గా నిలిచారు?
జ: హామిల్టన్

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/