Sunday, November 18
Log In

CURRENT AFFAIRS JAN 31

రాష్ట్రీయం
1) 2018-19 సం.నికి తెలంగాణకి ప్రాధాన్య రంగంలో రుణ అంచనాలను నాబార్డ్ ఎంతగా నిర్ణయించింది
జ: రూ.83,388 కోట్లు
(నోట్: గత ఏడాది రుణ ప్రణాళిక కంటే 14 శాతం ఎక్కువ )
2) రాబోయే సంవత్సరంలో తెలంగాణకి వ్యవసాయ రంగంలో ఎంత రుణాలు అవసరం అవుతాయని నాబార్డ్ అంచనా వేసింది ?
జ: 62,352 కోట్లు
3) తెలంగాణ ప్రాంతంలో తొలి శాతవాహనుల కాలంలో (2వేల యేళ్ళ కిందట) విదేశాలతో వ్యాపార సంబంధాలు జరిగాయి అనడానికి సంబంధించిన సాక్ష్యాలు ఎక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయి
జ: పెద్ద బొంకూరు (పెద్దపల్లి జిల్లా )


జాతీయం
4) ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల స్థానంలో భారత్ కి ఎన్నో స్థానం లభించింది
జ: ఆరో స్థానం
5) సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పెంచిన జీతాలు అమల్లోకి వచ్చాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి నెలసరి వేతనం ఎంత ?
జ: రూ.2.80 లక్షలు ( గతంలో రూ.1.00 లక్ష)
6) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నెలసరి వేతనం ఎంత
జ: రూ.2.50 లక్షలు ( గతంలో రూ.90,000)
7) హైకోర్టు న్యాయమూర్తుల నెలసరి వేతనం ఎంతకు పెరిగింది
జ: రూ.2.25 లక్షలు (గతంలో రూ.80 వేలు)
8) ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఎవరు
జ: రేఖా శర్మ
9) ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఎవరు
జ: రజనీష్ కుమార్
10) 2021 నాటికి ప్రాంతీయ భాషల్లో నెట్ ఉపయోగించే వారి శాతం ఎంత ఉంటుందని టైమ్స్ ఇంటర్నెట్ అధ్యయనంలో తెలిపింది
జ: 75శాతం మంది
11) రాష్ట్ర మంచ్ పేరిట కొత్త రాజకీయ వేదికను న్యూఢిల్లీలో ఎవరు ఏర్పాటు చేశారు
జ: యశ్వంత్ సిన్హా
12) భారత టేబుల్ టెన్నిస్ లో వరుసగా ఎనిమిదోసారి జాతీయ ఛాంపియన్ గా నిలిచి రికార్డు సాధించిన ఆటగాడు ఎవరు
జ: ఆచంట శరత్

-------------------------------------------------------------

TRT ఎగ్జామ్స్ పనికొచ్చే టాపిక్స్ : CURRENT AFFAIRS & GK

దాదాపు 100 మాక్ టెస్టులు (ఒక్కో టెస్టులో 25 ప్రశ్నలు -5 సార్లు రాసుకోవచ్చు)

అతి ముఖ్యమైన ప్రశ్నలను Multiple Choice విధానంలో ఇస్తున్నాం...
http://tsexams.com/current-affairs-gk/