Monday, November 12
Log In

CURRENT AFFAIRS JAN 24

రాష్ట్రీయం
1) ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆన్ లైన్ లో అడ్మిషన్లు స్వీకరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్ లైన్ విధానం పేరేంటి ?
జ: దోస్త్ ( 2016-17 నుంచి అమలు చేస్తున్నారు )
2) రాష్ట్రంలో 1 నుంచి 12 తరగతుల వరకూ తెలుగును తప్పనిసరి చేసేందుకు ఎవరి అధ్యక్షతన కమిటీ అధ్యయనం చేసింది ?
జ: తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. ఎస్. వీ. సత్యనారాయణ
3) స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చుల వివరాలను ఇవ్వని కారణంగా ఎంతమందిపై రాష్ట్ర ఎన్నికల సంఘం మూడేళ్ళ పాటు నిషేధం విధించింది ?
జ: 14,829 మంది
4) రాష్ట్రంలో ఔషధ నగరి (ఫార్మా సిటీ) ఏర్పాటుకు 19,333ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.  రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఈ ఫార్మాసిటీని నిర్మించనున్నారు ?
జ:  యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో
5) హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఎ.సంతోష్ కుమార్


6) డీడీ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం హెడ్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: కె.సుధాకర్ రావు
7) హైదరాబాద్ లో ప్రతి రెండేళ్ళకోసారి జరిగే ఇండియా ఏవియేషన్ షో మార్చి 8 నుంచి  ప్రారంభం అవుతోంది.  ఈసారి థీమ్ ఏంటి?
జ: వింగ్స్ ఇండియా 2018
8) హైదరాబాద్ లో చనిపోయిన వెంపటి రవిశంకర్ ఏ రంగంలో ప్రసిద్ధులు ?
జ: ప్రసిద్ధ కూచిపూడి నాట్య కళాకారుడు
(నోట్: పద్మ భూషణ్ వెంపటి చినసత్యం రెండో కుమారుడు)

జాతీయం
9) 20యేళ్ళ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేశారు.  గతంలో ఎవరు ఈ సమావేశాలకు హాజరయ్యారు ?
జ: 1997లో అప్పటి ప్రధాని దేవెగౌడ
10) డ్యామ్స్ భద్రతపై అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరగనుంది ?
జ: తిరువనంతపురం
11) విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (VSSC) కొత్త డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ:  ఎస్ సోమనాథ్
12) రెండో ప్రపంచ యుద్దం మెమోరియల్ మ్యూజియంను ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?
జ: అరుణాచల్ ప్రదేశ్
13) రిజర్వ్ బ్యాంక్ అంచనాల ప్రకారం భారత్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కువగా పెడుతున్న దేశం ఏది ?
జ: మారిషస్
(నోట్: రెండో స్థానం అమెరికా, మూడు బ్రిటన్, నాలుగు సింగపూర్. మారిషస్ మార్కెట్లో 21.8శాతం షేర్ వ్యాల్యూని కలిగి ఉంది)
14) 63వ జియో ఫిల్మ్ ఫేర్ అవార్డులు 2018లో ఉత్తమ చిత్రంగా ఎంపికైనది ఏది
జ: హిందీ మీడియం
15) దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల ఐదు మ్యాచుల టీ 20 క్రికెట్ సిరీస్ కు ఎవరు కెప్టెన్ గా ఎంపికయ్యారు ?
జ: హర్మన్ ప్రీత్ కౌర్

అంతర్జాతీయం
16) స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 48వ వార్షిక సమావేశాల యొక్క థీమ్ ఏంటి ?
జ: Creating a Shared Future in a Fractured World
17) 2018 ఇండియా ఆసియాన్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతోంది ?
జ: న్యూ ఢిల్లీ
18) ICC మహిళల ప్రపంచ క్రికెట్ టీ20 2018 టోర్నమెంట్ ఏ దేశంలో జరగనుంది ?
జ: వెస్ట్ ఇండీస్
19) 15వ ముంబై మారథాన్ 2018 పోటీల్లో సోలోమన్ దేక్సియా విజేతగా నిలిచాడు. ఈయన ఏ దేశానికి చెందిన వారు ?
జ: ఇథియోపియా

SI/CONSTABLE/VRO/GROUP.IV
పూర్తి వివరాలకు విజిట్ చేయండి:
http://telanganaexams.com/siconstable-4steps/

TRT జాబ్ కి 40 రోజుల ప్లాన్
SGT /SA (SOCIAL, BIOLOGY, TELUGU ) కి మాక్ టెస్ట్ లు, ప్రిపరేషన్ మెటీరియల్ (ఆన్ లైన్లో)
https://tsexams.com/trt-50days/

TRANCO ఎగ్జామ్స్ కి గ్రాండ్ టెస్టులు
(General Awarenes + Electrical Subject)
15 గ్రాండ్ టెస్టులు-1200 ప్రశ్నల కవరేజ్

AE/SUB ENGR...GS లో కొన్ని టాపిక్స్ పై ప్రిపరేషన్ మెటీరియల్ కూడా ఇవ్వబడును)
పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి:
https://tsexams.com/tranco-announce/

AEE ఎగ్జామ్స్ డేట్ ను TSPSC ప్రకటించింది.  మార్చి 18న జరుగుతాయి.  అందువల్ల మీరు ఆన్ లైన్ లో జనరల్ స్టడీస్ + CURRENT AFFAIRS మాక్ టెస్టులు రాసుకోడానికి మంచి అవకాశం

ఇంగ్లీష్, తెలుగు మీడియంల్లో మాక్ టెస్టులు... పూర్తి వివరాలకు : http://telanganaexams.com/aee-mock-tests/