Friday, November 16
Log In

CURRENT AFFAIRS JAN 21,22

రాష్ట్రీయం
1) రాష్ట్రంలో భవన నిర్మాణ పనులకు అనుమతి వ్యవధి ప్రభుత్వం 30 రోజుల నుంచి ఎంతకు తగ్గించింది?
జ: 21 రోజులకు
2) రాష్ట్రంలో ప్రభుత్వ రంగ డైరీ ఫామ్స్ లో పాలు పోస్తే లీటర్ కు ఎంత మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది
జ: రూ.4
3) రాష్ట్రంలో కొత్తగా ఇన్నేవేషన్ హబ్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: JNTUH
4) తెలుగురాని ప్రభుత్వ ఉద్యోగులకు 48 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలుగు అకాడమీ నిర్ణయించింది.  ఆ కార్యక్రమం పేరేంటి ?
జ: పరిచయ
5) KIGA 2018 అవార్డును అందుకున్న తెలంగాణకు చెందిన డాక్టర్ ఎవరు?
జ: డాక్టర్ దేవయ్య
6) ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ముగిసింది.  ఈ జాతర ఎక్కడ జరుగుతుంది
జ: ఇంద్రవెల్లి
7) వైద్య, ఆరోగ్య సేవల్లో సంస్కరణలు - కంప్యూటరీకరణ, పారదర్శకత విధానాలను అమలు చేసినందుకు CSI అవార్డును ఎవరు స్వీకరించారు ?
జ: వాకాటి కరుణ ( వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ )
8) హైదరాబాద్ లో మరణించిన రామకొండల రాగాల గతంలో ఏ పదవిని నిర్వహించారు ?
జ: మాజీ డీజీపీ

జాతీయం
9) ఎన్నికల సంఘం కొత్త ప్రధాన కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ఓం ప్రకాశ్ రావత్
(నోట్: ప్రస్తుత CEC ఏకే జోతి స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు )
10) దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలంటూ రూపొందించిన దేశభక్తి గీతం ఏది
జ: భారత్ కె వీర్
11) 2018-19 బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందుగా న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో ఏ వేడుక జరిగింది ?
జ: హల్వా వేడుక
12) ఆప్ ఎమ్మెల్యేల లాభదాయక పదవుల కేసులో ఎన్నికల కమిషన్ అనర్హత వేటుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఎంతమందిని అనర్హత వేటు పడింది ?
జ: 20మంది ఎమ్మెల్యేలు
13) HPCL లోని ప్రభుత్వం వాటాలను ఏ సంస్థ కొనగులో చేయనుంది
జ: ONGC
14) ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో ఉన్న భారత్ ఏ ఏడాది నాటికి మొదటి స్థానానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు ?
జ: 2024లో
15) భారత్ లో మొదటగా ఎప్పుడు కుటుంబ నియంత్రణ పద్దతులను అమలు చేశారు ?
జ: 1952లో
16) వేల యేళ్ళ నాటి దేశీ విత్తనాలను ప్రకృతి వ్యవసాయ రైతులకు అందించేందుకు దేశీ విత్తనోత్సవం ఎక్కడ జరగనుంది
జ: హైదరాబాద్
17) అంధుల ప్రపంచ కప్ విజేత గా భారత్ జట్టు నిలిచింది. ఏ జట్టును భారత్ క్రీడాకారులు ఓడించారు ?
జ: పాకిస్తాన్

అంతర్జాతీయం
18) వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు ఎక్కడ జరుగుతోంది ?
జ: దావోస్ (స్విట్జర్లాండ్ )
19) అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF)చీఫ్ ఎవరు ?
జ: క్రిస్టీన్ లగార్డ్
20) అమెరికా విదేశాంగ శాఖలో ఆర్థిక వాణిజ్య వ్యవహారాల సహాయ కార్యదర్శిగా నియమితులైన భారతీయ సంతతి మహిళ ఎవరు ?
జ: మనీషా సింగ్ ( న్యాయవాది)