Wednesday, December 19

CURRENT AFFAIRS – FEB 25

రాష్ట్రీయం
1) హైదరాబాద్ లో జరుగుతున్న బయో ఆసియా సదస్సుల్లో పాల్గొన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఎవరు ?
జ: సురేశ్ ప్రభు
2) డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించిన నమూనాకి ఏ అవార్డు దక్కింది ?
జ: హడ్కో 2017 డిజైన్ అవార్డు
3) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏటా నిర్వహించే టెక్నాలజీ అమలు, వినియోగం, పోలీస్ శాఖల్లో కంప్యూటరీకరణ అంశాలపై జరిగిన పోటీల్లో రాష్ట్రానికి చెందిన ఏ యాప్ కు అవార్డు దక్కింది ?
జ: టీఎస్ కాప్
4) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత మునిపల్లె రాజు చనిపోయారు. ఆయనకు ఏ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది ?
జ: 2006లో ( కళలు, సాహిత్య విభాగంలో )

జాతీయం
5) అమ్మ స్కూటర్ పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడ ప్రారంభించారు ?
జ: చెన్నైలో
6) రసగుల్లాకి భౌగోళిక గుర్తింపు కోసం పోటీ పడుతున్న మరో రాష్ట్రం ఏది ?
జ: ఒడిశా
7) రూ.2,200 కోట్లతో లులు గ్రూపు ఇంటర్నేషనల్ సంస్థ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను విశాఖపట్నంలో నిర్మించనుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు ?
జ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
8) ఈనెల 26,27 తేదీల్లో జాతీయ ఈ-పరిపాలన సదస్సును ఎక్కడ నిర్వహిస్తున్నట్టు కేంద్ర పరిపాలన సంస్కరణల విభాగం తెలిపింది ?
జ: హైదరాబాద్ లో
9) చెన్నైలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ నీలబ్ మిశ్రా కన్నుమూశారు. ఆయన ప్రస్తుతం ఏ పత్రికలో పనిచేస్తున్నారు ?
జ: నేషనల్ హెరాల్డ్ ( ఎడిటర్ ఇన్ చీఫ్ )
10) దక్షిణాఫ్రికాలో మహిళల వన్డే , టీ 20 క్రికెట్ సిరీస్ లను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. టీ20 సిరీస్ కు కెప్టెన్ గా ఎవరు వ్యవహరించారు ?
జ: హర్మన్ ప్రీత్ కౌర్
11) ఆస్ట్రియా ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచిన తెలుగు తేజం ఎవరు ?
జ: పారుపల్లి కశ్యప్
12) ప్రపంచ జిమ్నాస్టిక్స్ లో కాంస్య పతకం గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్ గా రికార్డు సృష్టించింది ఎవరు ?
జ: బుద్దా అరుణా రెడ్డి
(నోట్: ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఈ క్రీడా పోటీలు జరిగాయి )

CONSTABLE/SI/VRO/GROUP - IV మాక్ టెస్టులు
http://tsexams.com/pcvro-mock-test/

AEE ఎగ్జామ్స్ ఇంగ్లీష్, తెలుగు మీడియంల్లో మాక్ టెస్టులు...

పూర్తి వివరాలకు : https://telanganaexams.com/aee-mock-tests/