Friday, May 25
Log In

CURRENT AFFAIRS FEB 24

రాష్ట్రీయం
1) హైదరాబాద్ లోని జినోమ్ వ్యాలీలో రూ.500 కోట్ల పెట్టుబడితో పరిశోధనా కేంద్ర ఏర్పాటు చేసేందుకు బయోకాన్ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ CMD ఎవరు ?
జ: కిరణ్ మజుందార్ షా
2) 2014 జనవరి 1 నుంచి 2017 మార్చి 31 వరకూ చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంతమొత్తాన్ని మాఫీ చేస్తారు ?
జ: లక్ష రుణం (వృత్తి పరమైన అవసరాల కోసం తీసుకున్నవి మాత్రమే )


జాతీయం
3) 16 రాష్ట్రాల్లో 58 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయబోతున్నారు. రిటైర్డ్ అవుతున్న వారిలో ప్రముఖులు ఎవరు ?
జ: నటుడు చిరంజీవి, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్
4) అణ్వస్త్రాలని మోసుకెళుతూ 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దాని పేరేంటి ?
జ: ధనుష్
5) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు ?
జ: అనిల్ బైజాల్
6) ప్రమాదకర లూపస్ వ్యాధికి సరికొత్త చికిత్స అభివృద్ధికి పరిశోధనలు చేసేందుకు ఏ భారత సంతతి బృందానికి లూపస్ పరిశోధక కూటమి రూ.3.9కోట్ల గ్రాంటును మంజూరు చేసింది ?
జ: చంద్రమోహన్ తో పాటు ముగ్గురు శాస్త్రవేత్తల బృందం
7) ఏపీ నెల్లూరు జిల్లాలోని ఏ ఓడరేవును అధీకృత ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ గా కేంద్ర ప్రభుత్వ ప్రకటించింది ?
జ: కృష్ణ పట్నం ఓడరేవును
8) నీరవ్ మోదీ బ్రాండుకు బ్రాండ్ అంబాసిడార్ గా ఎవరు తప్పుకున్నారు ?
జ: నటి ప్రియాంక చోప్రా
9) బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు కూడా అంబుడ్స్ మన్ పథకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రస్తుతం ఏయే నగరాల్లో అంబుడ్స్ మన్ కార్యాలయాలు పనిచేస్తాయి ?
జ: చెన్నై, కోల్ కతా, ముంబై, ఢిల్లీ
10) నిషేధిత ఉత్ర్పేరకాలను కలిగి ఉన్న నేరానికి ఎవరిపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాలుగేళ్ళ పాటు నిషేధించింది ?
జ: భారత్ రన్నర్ జితన్ పాల్


అంతర్జాతీయం
11) టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వాచ్ లిస్ట్ లో అమెరికా ఏ దేశాన్ని చేర్చింది ?
జ: పాకిస్తాన్

CONSTABLE/SI/VRO/GROUP - IV మాక్ టెస్టులు
http://tsexams.com/pcvro-mock-test/

AEE ఎగ్జామ్స్ ఇంగ్లీష్, తెలుగు మీడియంల్లో మాక్ టెస్టులు...

పూర్తి వివరాలకు : http://telanganaexams.com/aee-mock-tests/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *